వార్తలు
పాస్టర్ మైఖేల్ కోవిడ్ -19 నుండి ఉపశమనం కోసం అందరినీ ఉపవాసం మరియు ప్రార్థించమని ఆహ్వానించారు
Saturday, 28th of March 2020
0
0
55
కరుణా సదన్ పరిచర్యకు చెందిన పాస్టర్ మైఖేల్ ఫెర్నాండెజ్, COVID-19 నుండి ఉపశమనం కోసం 3 రోజుల ఉపవాసం మరియు ప్రార్థన కోసం తనతో మరియు ఆయన బృందంతో చేరాలని అందరినీ ఆహ్వానిస్తున్నాడు.
ఉపవాస దినాలు: 29, 30 & 31 మార్చి 2020
1. యేసు నామములో యేసు యొక్క విలువైన రక్తంతో నేను నన్ను, నా కుటుంబాన్ని మరియు ఇంటిని కప్పుతున్నాను.
2. తండ్రీ, నీ చిత్తానుసారముగా మేము ఏదైనా అడిగితే, నీవు మా మాట వింటారనే నమ్మకం ఉంది. మాపై కృప చూపి ఈ కరోనా మహమ్మారిని ఆపమని కోరుతున్నాము. యేసు నామములో. (1 యోహాను 5:14)
3. తండ్రీ, నీవే మాకు ఆశ్రయము మరియు బలము, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ మహమ్మారితో బాధపడుతున్న వారందరినీ ముట్టాలని మేము నిన్ను కోరుతున్నాము. క్వారంటైన్‌లో ఉన్న వేలాది మందిని నీవు ఓదార్చాలని కూడా మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో. (కీర్తనలు 46:1)
4. నేను ఒప్పుకుంటున్నాను, యెహోవా మనకు భయంతో కూడిన ఆత్మను ఇవ్వలేదు గాని ప్రేమ, శక్తి మరియు మంచి మనస్సు గల ఆత్మను ఇచ్చాడు. మన చుట్టూ ఉన్న భయం, అణచివేత మరియు నిస్పృహ యొక్క ఆత్మ అగ్ని ద్వారా కాల్చబడును గాక. యేసు నామములో.
5. తండ్రీ, ప్రభువా మా కష్టములలో, నీకు మొఱ్ఱపెట్టుచున్నాము, నీవు నమ్మకమైనవాడవు మరియు ఈ కష్టము నుండి మమ్ములను తప్పకుండా విడిపించుదువు. కోవిడ్-19తో బాధపడుతున్న వారి సంరక్షణలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలందరి కోసం మేము ప్రార్థిస్తున్నాము. వారిపై నీ రక్షణ మరియు కృపకై మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో. (కీర్తనలు 107:28)
6. తండ్రీ, పాస్టర్ మైఖేల్, కరుణా సదన్ పరిచర్య పాస్టర్లు మరియు నాయకులు ఈ సమయంలో సరైన మాటలను పరిచర్య చేయడానికి మరియు సరైన పనులను చేయడానికి నీ ఆత్మ ద్వారా దైవికంగా నడిపించబడాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో.
7. తండ్రీ, “మేము మీ శరీరము మరియు ప్రతి ఒక్కరు ఆ దివ్య శరీరంలోని అవయవమే” అని మీ వాక్యం చెబుతోంది. అన్ని సంఘాలు (KSMతో సహా) దేవుడు వాటిని ఉంచిన కొండపై వెలుగుగా ఉండాలని మేము ప్రార్థిస్తాము. యేసు నామములో. (1 కొరింథీయులకు 12:27)
8. ఒప్పుకోలు:
నాకు మరియు నా ప్రియమైనవారికి ఎటువంటి అపాయము జరగదు,
నా ఇంటికి మరియు నేను నివసించే ప్రాంతానికి ఎటువంటి తెగులును రాకూడదు;
యెహోవా తన దూతలకు నా గురించి నా కుటుంబ సభ్యుల గూర్చి ఆజ్ఞాపిస్తాడు
మా మార్గములన్నిటిలో మమ్మల్ని కాపాడుటకు.
పాదములకు రాయి తగులకుండ వారు మమ్మును తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు
యేసు నామములో. (కీర్తనలు 91:10-12)
9. తండ్రీ, ఈ సంక్షోభంలో దేశాలు మరియు సంస్థలకు నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వ అధికారులు మరియు నిర్ణయాధికారుల కోసం మేము ప్రార్థిస్తున్నాము. మేము దేవుని జ్ఞానం మరియు వారిపై, వారి బృందాలు మరియు కుటుంబాలపై రక్షణకై ప్రార్థిస్తున్నాము. వారు తమ దేశాలకు మరియు ప్రపంచ సమాజానికి ప్రయోజనం కలిగించే క్రియాశీల నిర్ణయాలు తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో.
10. తండ్రీ, మమ్ములను వర్ధిల్లజేయుటకు మరియు మాకు హాని చేయకుండునట్లు నీవు ప్రణాళికలు కలిగి ఉన్నందున నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోకూడదని మేము ప్రార్థిస్తున్నాము. నీవు ఎప్పుడూ విఫలం కానందున వ్యాపారం వృద్ధి చెందాలని మేము ప్రార్థిస్తున్నాము. యేసు నామములో. (యిర్మీయా 29:11)
ఉపవాసం ప్రారంభం: 00:00 గంటలు (అర్ధరాత్రి)
ఉపవాసం ముగుస్తుంది: 16:00 గంటలు (సాయంత్రం 4)
టీ, కాఫీ వద్దు, నీరు మాత్రమే తీసుకోవాలి.
వాక్యము, ఆరాధన మరియు ప్రార్థనలో గరిష్ట సమయాన్ని వెచ్చించండి
ఆ తర్వాత, మీరు మీ ఉపవాసాన్ని విరమించుకోవచ్చు మరియు మీ సాధారణ భోజనం చేయవచ్చు
గమనిక: మీరు ఆధ్యాత్మికంగా పరిణతి చెందినవారైతే, మీరు 18:00 గంటల వరకు చేయవచ్చు.
ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి
Join our WhatsApp Channel
కమెంట్లు