english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. దయాళుత్వము చాలా ముఖ్యమైనది
ಅನುದಿನದ ಮನ್ನಾ

దయాళుత్వము చాలా ముఖ్యమైనది

Sunday, 13th of July 2025
0 0 380
Categories : దయాళుత్వము (Kindness)
కాగా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులునైన వారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంత మును ధరించుకొనుడి. (కొలొస్సయులు 3:12)

"సందర్భం కోసం ధరించుట" అనే పదబంధాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా? కుటుంబంలో లేదా ఆఫీసులో ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటే, మనము తగిన దుస్తులు ధరించేలా చూసుకుంటాం. అదేవిధంగా, అపొస్తలుడైన పౌలు అనుదినము మనం దయాళుత్వముతో మనల్ని ధరించుకోవల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తున్నాడు.

దయాళుత్వము కేవలం మాటల కంటే ఎక్కువైనది. ఇది మంచి భావోద్వేగము కంటే ఎక్కువైనది. ఇది ప్రేమ యొక్క ఆచరణాత్మక ప్రదర్శన. నిజమైన దయాళుత్వము అనేది ఆత్మ ద్వారా ఉత్పత్తి అవుతుంది (గలతీయులు 5:22 చూడండి).

ఆదికాండము 8:22 లో కనిపించే విత్తనకాలము మరియు కోతకాలము కారణంగా మీరు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో దయాళుత్వము చూపడానికి ఒక మంచి కారణం ఉంది,

"భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును కోతకాలమును 
శీతోష్ణములును వేసవి శీత కాలములును రాత్రింబగళ్లును 
ఉండక మానవని తన హృద యములో అనుకొనెను."

భూమి ఉన్నంత కాలం (మరియు చాలా కాలం), విత్తడము మరియు పంట కోయుట అనే పద్దతి అలాగే ఉంటుంది - ఇది సహజ మరియు ఆధ్యాత్మిక రంగంలోను ఉంటుంది.

విత్తనకాలము మరియు కోతకాలము పద్దతి ప్రకారం మనం కలుసుకున్న వ్యక్తులతో మనం దయాళుత్వముతో ఉన్నప్పుడు, ఎవరైనా తప్పకుండా మన పట్ల కూడా దయతో వ్యవహరిస్తారు - తప్పనిసరిగా మనం దయ చూపిన వ్యక్తే కాకపోవచ్చు.

సామెతలు 11:17 మనకు ఇలా సెలవిస్తుంది, "దయగలవాడు తనకే మేలు చేసికొనును క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును" కాబట్టి మీరు దయతో ఉన్నప్పుడు, మీ స్వంత ప్రాణం మెరుగుపరచబడింది. మీరు కూడా ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందుతారు.

దావీదు మరియు అతని జనులు అమాలేకీయులను వెంబడిస్తుండగా, వారికి ఒక ఐగుప్తీయుడు పొలంలో కనబడెను, అతడు అనారోగ్యానికి గురైనందున అతనిని అమాలేకీయుడైన యజమానుడు వదిలిపెట్టాడు. అతడు చాలా దీన స్థితిలో ఉన్నాడు, ఎందుకంటే అతడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చు కొనలేదు. (1 సమూయేలు 30:11-12)

'నా దారిని నాది' గురించి మాత్రమే ఆలోచించే లోకములో, దయ నిలుస్తుంది మరియు ఎల్లప్పుడూ ఇతరుల మంచిని కోరుకుంటుంది. దావీదు మరియు అతని జనులు ఆ వ్యక్తి పట్ల దయను చూపించారు మరియు అతడిని ఆరోగ్యంగా చూసుకున్నారు. దావీదు మరియు అతని జనులు అమాలేకీయులు తమ నుండి దొంగిలించినవన్నీ తిరిగి పొందడంలో దావీదుకు సహాయపడి మరియు కీలకమైన సమాచారాన్ని అందించిన వ్యక్తే ఇతను. (1 సమూయేలు 30:13-15)

దయ మరియు పునరుద్ధరణ సిధ్ధాంతం చాలా లోతుగా ముడిపడి ఉన్నాయి. ఈ సత్యాన్ని నుండి వైదొలగవద్దు.

చివరిగా, మన దయ మన తండ్రి హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. "ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి" (ఎఫెసీయులు 4:32).

Bible Reading: Palms 143-150; Proverbs 1
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, నేను నీ దైవిక స్వభావాన్ని ఆచరణాత్మకంగా ప్రతిబింబించేలా నేను కలుసుకున్న ప్రతి ఒక్కరి పట్ల దయగలిగి ఉండటానికి నాకు నీ కృపను దయచేయి. యేసు నామంలో. ఆమెన్.
 


Join our WhatsApp Channel


Most Read
● క్రీస్తు రాయబారి
● ప్రార్థనలో వచ్చే కలవరముపై ఎలా విజయం సాధించాలి
● మతపరమైన ఆత్మను గుర్తించడం
● ఇటు అటు సంచరించడం ఆపు
● 25 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 13 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● సమాధానము కొరకు దర్శనం
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್