english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. నిందలు మోపడం
ಅನುದಿನದ ಮನ್ನಾ

నిందలు మోపడం

Tuesday, 22nd of July 2025
0 0 625
Categories : నాయకత్వం (leadership) నిందలు మోపడం (Blame shifting)
ఏదెను తోటకు వెళ్దాం రండి - ఎక్కడ ఇదంతా ప్రారంభమైంది. అందుకు ఆదాము, "నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను."

 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, "నీవు చేసినది యేమిటని అడుగగా?" స్త్రీ "సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను"(ఆదికాండము 3:12-13)

ఆదాము స్త్రీని నిందించాడు, మరియు ఆ స్త్రీ పామును నిందించింది.

మనిషి పాపం చేసిన వెంటనే, ఆ వ్యక్తి వెంటనే ఇతరులను నిందించడం ప్రారంభిస్తాడు. (నేను మనషి అని చెప్పినప్పుడు, అందులో స్త్రీ కూడా ఉందని దయచేసి అర్థం చేసుకోండి).

పాపం యొక్క విచారకరమైన ప్రభావాలలో ఒకటి మన కార్యాలకు బాధ్యత వహించడానికి నిరాకరించడం. ఈ వైఖరి, నేడు పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఎక్కువగా ఉంది.

ప్రజలు తమ కార్యాలకు ఇతరులను ఎందుకు నిందిస్తారు?

1. వారి కార్యాల నుండి వచ్చిన అపరాధభావంతో వారు జీవించడానికి ఇష్టపడరు
2. వారి కార్యాల పర్యవసానాలను వారు అనుభవించకూడదనుకుంటారు. 
ఇతరులను నిందించడం అనేది తప్పించుకునే విధానం లాంటిది

ఇతరులను నిందించడం యొక్క ప్రభావాలు
• తమ వైఫల్యాలకు ఇతరులను నిందించే వ్యక్తులు ఎన్నటికీ వాటి మీద విజయం పొందరు.
• వారు కేవలం సమస్య నుండి సమస్యలోకి వెళతారు, మరియు వారి సమస్యకు వ్యక్తులను నిందించాలని కూడా వారు కనుగొంటారు.

అలాంటి వారిలాగా ఉండకండి. మీకు దేవుడిచ్చిన పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి, మీరు ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి మార్గాలను వెతకాలి, మరియు మీరు మీ స్వంత కార్యాలకు బాధ్యత వహించకపోతే మరియు మీ తప్పుల నుండి నేర్చుకోగలిగితే మీరు దీనిని చేయలేరు.

బలహీనమైన నాయకుడి లక్షణాలలో ఒకటి
అందుకు సౌలు, "అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసికొనివచ్చిరి; నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి; మిగిలిన వాటినన్నిటిని మేము నిర్మూలముచేసితిమి" (1 సమూయేలు 15:15)

నాయకుడు తన ప్రజ పట్ల బాధ్యత వహిస్తాడు. అతడు నిందను ప్రజలపై మోపలేడు.

సౌలు బలహీనమైన నాయకుడు మరియు ప్రభువు యొక్క ఆదేశాన్ని అమలు చేయడంలో విఫలమైనందుకు తన ప్రజలను నిందించాడు. బలహీనమైన నాయకుడు తరచుగా ఇతరులు, పరిస్థితులు, విధి లేదా వారి వైఫల్యాలకు/అసమర్థతలకు కారణమవుతాడు. లేఖనం ఇలా సెలవిస్తుంది, "అయితే తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు" (దానియేలు 11:32)

ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆదాము తన భార్యపై నిందలు మోపాడు మరియు హవ్వ సర్పం మీద నిందలు మోపింది, దేవుడు వారి కార్యాలకు జవాబుదారీగా ఉన్నాడు మరియు వారి అవిధేయతకు వారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.

ఆయన ఆదాముతో, "నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు" (ఆదికాండము 3:17)

తీర్పు దినమున, నిందలు మోపడానికి అవకాశాలు ఉండవు.

కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ దేవునికి తన గురించి లెక్క అప్పగింప వలసి వస్తుంది [తీర్పుకు అనుగుణంగా ఒక సమాధానం చెప్పాలి]

గనుక మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను. కాగా మనమిక మీదట ఒకనికొకడు తీర్పు తీర్చకుందము. ఇదియుగాక, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చ యించుకొనుడి (రోమీయులకు 14:12-13)

Bible Reading: Ecclesiastes 7-10
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, యేసు నామంలో, నన్ను నేను సమర్థించుకోవడానికి నేను తరచుగా ప్రజలను నిందించానని ఒప్పుకుంటాను. దయచేసి ఈ అడ్డంకిని అధిగమించడానికి నాకు సహాయం చేయండి. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● 19 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ఏదియు దాచబడలేదు
● అవిశ్వాసం
● సుదీర్ఘ రాత్రి తర్వాత సూర్యోదయం
● విశ్వాసులైన రాజుల యాజకులు
● దేవుని 7 ఆత్మలు: వివేకము గల ఆత్మ
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್