english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. దెబోరా జీవితం నుండి పాఠాలు
ಅನುದಿನದ ಮನ್ನಾ

దెబోరా జీవితం నుండి పాఠాలు

Monday, 28th of July 2025
0 0 392
Categories : దేవునితో సాన్నిహిత్యం (Intimacy with God) విశ్వాసయోగ్యత (Faithfulness) శిష్యత్వం (Discipleship)
"ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను." (న్యాయాధిపతులు 21:25)

దెబోరా నివసించిన కాలం ఇది. మీరు మరియు నేను జీవించే కాలం మాదిరిగా ఇది అనిపించట్లేదా?

ఇజ్రాయేలు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి దెబోరా అని న్యాయాధిపతులు 4 మరియు 5 కూడా చెబుతున్నాయి. మహిళలను అప్రధానంగా భావించే కాలంలో, ఆమె తన రోజులో అత్యున్నత నాయకత్వానికి ఎదిగింది. దెబోరా యొక్క వైఖరి మరియు కార్యాలు జాగ్రత్తగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది, అలాగే, ఆమె జీవితం నుండి నేర్చుకోవలసిన శక్తివంతమైన పాఠాలు ఉన్నాయి.

#1: దెబోరా బుద్ధిమంతురాలు (తెలివైనది)
ఆ కాలమున లప్పీదోతునకు భార్యయైన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామా కును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రా యేలీయులు ఆమెయొద్దకు వచ్చు చుండిరి. (న్యాయాధిపతులు 4:4-5)

బైబిలు ఆమెను ప్రవక్త్రి అని పిలుస్తుంది. ఒక ప్రవక్త్ర కేవలం దేవుని ముఖకవళిక లాంటివాడు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నాణ్యమైన సమయాన్ని గడిపినప్పుడు ఇది జరుగుతుంది. స్పష్టంగా, ఆమె జ్ఞానం దేవునితో ఆమె ఐకమత్యము నుండి వచ్చింది. ఇక్కడ దేవునితో ఐకమత్యము ఆమెకు ఇశ్రాయేలు ప్రజలకు నమ్మదగిన పరిష్కారాలను తెచ్చే జ్ఞానాన్ని అందించింది.

ఎవరో ఒకసారి ఇలా అన్నారు, "నీవు సమస్యలో ఒక భాగం లేదా పరిష్కారం యొక్క ఒక భాగం" స్పష్టంగా, దెబోరా ప్రజల జీవితాలలో పరిష్కారంలో ఒక భాగం లాంటిది. మీరు కూడా మీ కుటుంబంలో, మీ సంఘంలో, మీ కార్యాలయంలో పరిష్కారంలో ఒక భాగం కావచ్చు. నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి, మరియు ఇలా జరగడం మీరు ఖచ్చితంగా చూస్తారు.

#2: దెబోరా అందుబాటులో ఉంది
బైబిలు ఇలా చెబుతోంది, "దెబోరా ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామా కును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద కూర్చుంది". 

ఒక రోజు ఒక యువతి నన్ను అడిగింది, "పాస్టర్ మైఖేల్ గారు, దేవుని చేత ఎక్కువగా వాడబడే యొక్క రహస్యం ఏమిటి?" నేను ఆమెకు సాదాసీదాగా చెప్పాను; "ఇది సామర్థ్యం కాదు, అందుబాటులో ఉండడం"

బహుశా మీరు చుట్టూ ఉన్న వాళ్లకంటే అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తి కాకపోవచ్చు, కానీ మీ వద్ద ఉన్నదాన్ని మీరు దేవునికి అర్పించగలిగితే, ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. దేవుని రాజ్యంలో చాలా మంది ప్రతిభావంతులైన వ్యక్తులు ఉన్నారు, కానీ దురదృష్టవశాత్తు, వారు ఎప్పుడూ లేరు. పట్టణంలో ఒక ప్రసిద్ది గాంచిన ప్రవక్త లేదా బోధకుడు ఉన్నప్పుడు మాత్రమే వారు సంఘములో కనిపిస్తారు.

వారి లాగా ఉండకండి. ప్రసిద్ది గాంచిన బోధకుడు లేదా ప్రవక్త లేనప్పుడు కూడా ఆరాధనకు హాజరు కావాలి. లైట్లు మరియు పొగ లేనప్పుడు కూడా ఆరాధనకు హాజరవ్వండి మరియు మీ ప్రతిభను కనబర్చండి. దేవుడు మీ కోసం ప్రణాళిక వేసిన దానిలో మిమ్మల్ని రూపకల్పనగా చేస్తాడు.

ఇంకొక విషయం ఏమిటంటే, చిన్న చిన్న కార్యాలను కూడా చేయమని ఆయన మీకు చెప్పినప్పుడు మీరు ఆయనను సేవించగలిగేంత వినయంగా ఉన్నారని ప్రభువు కనుగొన్నప్పుడు, పెద్దవి మరియు ముఖ్యమైన కార్యాలు చేయడానికి ఆయన మీపై విశ్వసం ఉంచగలడు! (లూకా 16:10 చదవండి)

Bible Reading: Isaiah 14-18
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రి, యేసు నామములో, నన్ను నీ యొద్దకు మరింత దగ్గరకు తీసుకురా.
తండ్రీ, నీవు నాకు సామర్ధ్యాలు ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు, నాకు చిత్తాన్ని నెరవేర్చే హృదయాన్ని దయచేయి, తద్వారా నా సామర్థ్యాలను తీసుకొని వాటిని నీకు అందుబాటులో ఉంచడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● విశ్వాసంతో నడవడం
● యేసు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు?
● సమాధానము కొరకు దర్శనం
● నేటికి కనుగొనగలిగే అరుదైన విషయం
● కృప యొక్క వరము (బహుమతి)
● సమయాన్ని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి
● అంతిమ రహస్యము
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್