english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. మీ విడుదల మరియు స్వస్థత యొక్క ఉద్దేశ్యం
ಅನುದಿನದ ಮನ್ನಾ

మీ విడుదల మరియు స్వస్థత యొక్క ఉద్దేశ్యం

Sunday, 3rd of August 2025
0 0 485
Categories : ఆరోగ్యం మరియు స్వస్థత (Health & Healing) విడుదల (Deliverance)
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; 
ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిరపరచెను 
నిరాకారముగా నుండునట్లు ఆయన దాని సృజింప లేదు 
నివాసస్థల మగునట్లుగా దాని సృజించెను 
ఆయన సెలవిచ్చునదేమనగా 
యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు. (యెషయా 45:18)

దేవుడు భూమిని వ్యర్థముగా సృష్టించ లేదు. దేవుడు ఉద్దేశ్యముగల దేవుడు. దేవుడు ఏది చేసినా, ఆయన ఒక ఉద్దేశ్యం కోసం చేస్తాడు. ఆయన ఉద్దేశ్యం లేకుండా ఏమీ చేయడు.

మీరు దీన్ని చదువుతున్నారనే వాస్తవం మీరు మీ కోసం లేదా మీ ప్రియమైన వ్యక్తుల కోసం విడుదల కోసం ప్రయత్నిస్తుండవచ్చు. బహుశా మీలో కొందరు స్వస్థత కోరుకుంటున్నారు - శారీరకంగా లేదా భావోద్వేకంగా. కానీ, నేను మీకు తెలియజేస్తున్నాను, స్వస్థత మరియు విడుదలకి కూడా ఒక ఉద్దేశ్యం ఉంది.

దైవికమైన స్వస్థత మరియు విడుదల యొక్క ఉద్దేశ్యాన్ని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దేవుడు ఎందుకు స్వస్తపరుస్తాడు మరియు విడుదలనిస్తాడని, మీరు ఆ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు, మీరు దానిని విలువైనదిగా నేర్చుకుంటారు మరియు దానిని నిర్వహించడం (కాపాడటానికి) కూడా నేర్చుకుంటారు.

దేవుడు దేని నుండి అయినా మనలను విడిపించాడనే ఉద్దేశ్యం ఉందంటే అది మనం ఏదో ఒకదానిలోకి ప్రవేశించడం కోసమే. దైవిక విడుదల అంటే, మీరు ఉన్న చోట ఉండడానికి దేని నుండైనా బయటపడడం కాదు గాని ఏదైనా పొందుకోవడం కోసం. దురదృష్టవశాత్తు, చాలా మంది దేని నుండో బయటకు వస్తారు కానీ వారు ఉన్న చోట ఉంటారు; వారు దేనిని పొందుకో లేరు మరియు వారి విమోచనను కోల్పోతారు.

ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తు దాసత్యంలో ఉంది. (నిర్గమకాండము 12:40, గలతీయులు 3:15) దేవుడు వారిని ఒక్క రాత్రిలో బయటకు తీసుకొచ్చాడు. ఆయన వారిని బయటకు తీసుకురావడం మాత్రమే కాదు. ఆయన వారిని వాగ్దాన దేశములోనికి తీసుకువచ్చాడు. వారు లోపలికి ప్రవేశించడానికి వీలుగా బయటకు వచ్చారు.

ఒక వ్యక్తి ఒక రోజు నా దగ్గరకు వచ్చి, "పాస్టర్ గారు," నేను మద్యం నుండి విడుదల పొందాను" అని చెప్పాడు. "చాలా మంచిది" అని నేను జవాబిచ్చాను. అతడు చెప్తూ, "ఇప్పుడు నేను రుచికరమైన పొగాకును మాత్రమే నములుతున్నాను". కొంతమంది ఒక వ్యసనం నుండి బయటపడి మరొక వ్యసనం లోకి ప్రవేశిస్తారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది దాని గురించి కాదు.

ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేసెను. (కొలొస్సయులకు 1:13)

అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు మనలను విడుదలచేసి (మమ్మల్ని బయటకు తీసుకువచ్చాడని) మరియు ఆయన కుమారుడగు - ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యనివాసులనుగా చేసెనని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది.

మీ విడుదల మరియు స్వస్థత యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం మీకు దేవుడు అప్పగించిన పనిలోకి ప్రవేశించడం కోసం.

Bible Reading: Isaiah 38-41
ಅರಿಕೆಗಳು
1. నేను క్రీస్తు యేసులో నూతన సృష్టిని. (2 కొరింథీయులు 5:17)

2.  నేను ఆయన దైవ స్వభావము నందు పాలిభాగస్తుడను. (2 పేతురు 1:4) నేను యేసు నామంలో అంధకార సంబంధమైన శక్తుల నుండి విడుదల పొందాను. (కొలొస్సయులకు 1:13) (రోజంతా పై ఒప్పుకోలు చెబుతూ ఉండండి)


Join our WhatsApp Channel


Most Read
● పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం - 2
● దేవుని రకమైన విశ్వాసం
● ఎస్తేరు యొక్క రహస్యం ఏమిటి?
● అంతిమ భాగాన్నిగెలవడం
● వాగ్దాన దేశములోని బలగాలతో వ్యవహరించడం
● మంచి నడవడిక నేర్చుకోవడం
● దేవుడు సమకూరుస్తాడు
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್