english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. యేసయ్య ఇప్పుడు పరలోకములో ఏమి చేస్తున్నాడు?
ಅನುದಿನದ ಮನ್ನಾ

యేసయ్య ఇప్పుడు పరలోకములో ఏమి చేస్తున్నాడు?

Sunday, 10th of August 2025
0 0 545
Categories : ప్రధాన యాజకుడు (High Priest) ప్రార్థన (Prayer) మధ్యస్త్యం (Intercession)
ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడని, మీ కోసం మరియు నా కోసం మధ్యస్తం (విజ్ఞాపన) చేస్తున్నాడని ఇప్పుడు మీకు తెలుసా?

హెబ్రీయులు 7:25 మనకు ఇలా సెలవిస్తుంది, "ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు."

మరియు రోమీయులకు ​​8:34 మనకు ఇలా సెలవిస్తుంది, "శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయేసే; అంతే కాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్న వాడును మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే"

యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైన తరువాత, యేసయ్య పరిచర్య విజ్ఞాపన చేయడం. విజ్ఞాపన చేయడం యేసు యొక్క పరిచర్య అయితే, అది మన పరిచర్యయి కూడా ఉండాలి. విజ్ఞాపన పరిచర్య అంత్య దినాల పరిచర్య.

యేసయ్య సింహాసనం ముందు విజ్ఞాపన చేస్తున్నాడనేది వాస్తవం, యేసయ్య సజీవంగా ఉన్నాడని మరియు మన సంపూర్ణ ప్రధాన యాజకునిగా తండ్రి నుండి అధికారాన్ని పొందాడని స్పష్టంగా సూచిస్తుంది.

పాత నిబంధనలో, ప్రధాన యాజకులు ప్రజల తరపున పనిచేయడానికి నియమించబడ్డారు.
1. వారు ఇశ్రాయేలీయుల తరపున పాపం కోసం బలులు తీసుకురావాలి మరియు వారి కోసం ప్రార్థించాలి (హెబ్రీయులకు 5:1).
2. కానీ అది పదే పదే చేయాల్సి వచ్చేది. 
3. యాజకులు మరణిస్తే, కొత్త యాజకులను నియమించాల్సి వచ్చేది (హెబ్రీయులకు 7:23).

తేడా ఏమిటంటే…
1. యేసయ్యకు ఒక్కసారి మాత్రమే బలిని తీసుకురావాలి. అప్పుడు ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు. ఇది ఆయన త్యాగ మరణం యొక్క శాశ్వతమైన విలువను మనకు చూపుతుంది.

2. ఆయన నిరంతరము ఉన్నవాడు గనుక, ఆయన మన కోసం అంతం లేకుండా విజ్ఞాపన చేయగలడు. ఆయన ఎప్పటికీ కొనసాగిస్తాడు (హెబ్రీయులు 7:24).

అపవాది దేవుని యెదుట మన మీద నేరము మోపువాడు గనుక, యేసయ్య విజ్ఞాపన పరిచర్య సాతాను కార్యాలను వ్యతిరేకిస్తుంది (ప్రకటన 12:10).

బహుశా ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది, మరియు మీరు సమాధానముగా లేరు. ఇప్పుడే తెలుసుకోండి, యేసయ్య మీ కోసం మరియు మీ ప్రియమైనవారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ వాస్తవం మీ ఆత్మకు సమాధానము నిస్తుంది.

Bible Reading: Isaiah 65-66 ; Jeremiah 1
ಪ್ರಾರ್ಥನೆಗಳು
ప్రభువైన యేసయ్య, తండ్రి యెదుట నా పక్షమున విజ్ఞాపనము చేస్తునందుకు నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా కోసం విజ్ఞాపన చేస్తున్నావు. ఈ సౌకర్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి నాకు కూడా బోధించు. నాకు విజ్ఞాపన చేయడానికి నేర్పించు. ఆమెన్

Join our WhatsApp Channel


Most Read
● పరిశుద్ధాత్మ పట్ల సున్నితత్వాన్ని పెంపొందించుకోవడం - 2
● 19 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● గొప్ప పురుషులు మరియు స్త్రీలు ఎందుకు పతనమవుతారు -2
● జీవితం నుండి పాఠాలు- 3
● మీరు ఇంకా ఎందుకు వేచి ఉన్నారు?
● విశ్వాసం యొక్క సామర్థ్యము
● ఆయన పునరుత్థానానికి సాక్షిగా ఎలా మారాలి? - II
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್