english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. మీరు వారిని ప్రభావితం చేయాలి
ಅನುದಿನದ ಮನ್ನಾ

మీరు వారిని ప్రభావితం చేయాలి

Tuesday, 26th of August 2025
0 0 471
Categories : నాయకత్వం (leadership) ప్రభావం (Influence)
మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలను బట్టి నడవకూడదు. (లేవీయకాండము 18:3)

వారు తమ జీవితాలను భిన్నంగా జీవించాలని దేవుని ప్రజలకు చెప్పమని మోషేకు సూచించబడింది. వారు తమ బానిసలుగా ఉన్నప్పుడు ఐగుప్తులు ప్రత్యక్షంగా చూసినట్లు వారు జీవించకూడదు. కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, దేవుడు వారిని స్వాధీన పరచుకొనుచున్నాడు.

సిద్ధాంతం స్పష్టంగా ఉంది. మీరు ఉండే ప్రదేశం మరియు మీతో పాటు నివసించే వ్యక్తులు మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు, కానీ మీరు వారిని సానుకూలంగా ప్రభావితం చేయాలి.

ప్రభువైన యేసయ్య ఇలా సెలవిచ్చాడు, "మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు" (మత్తయి 5:13). సరైన పరిమాణంలో ఉప్పు తీసుకోవడం వల్ల ఆహారానికి రుచి మరియు విలువ పెరుగుతుంది. మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులను సానుకూలంగా ప్రభావితం చేయాలి.

విచారకరంగా, నేడు క్రైస్తవులు తరచూ దేవుని మరియు ఆయన వాక్యం నుండి కాక తమ ప్రవర్తనా ప్రమాణాలను లోకం నుండి స్వికరిస్తున్నారు. స్పష్టంగా, క్రైస్తవులు తమ నైతికతలో లోకానికి భిన్నంగా ఉండాలి మరియు వారు బైబిలు నైతిక ప్రమాణాన్ని అనుసరించాలి.

మనము థర్మోస్టాట్‌లుగా (ఉష్ణోగ్రత నిలుపు పరికరము) ఉండాలి, థర్మామీటర్లుగా కాదు. థర్మామీటర్ దాని పరిసరాల యొక్క ప్రస్తుత ఉష్ణోగ్రతను ప్రతిబింబిస్తుంది. కానీ థర్మోస్టాట్ ఉష్ణోగ్రతను నమోదు చేస్తుంది మరియు దానిని ప్రమాణానికి మార్చడానికి ప్రయత్నిస్తుంది.

ప్రభువు యిర్మీయా ప్రవక్తతో, "వారు నీతట్టునకు తిరుగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు" (యిర్మీయా 15:19)

ఆదిమ సంఘంలో, క్రైస్తవులకు చెప్పె క్రైస్తవ మతం యొక్క సత్యం కోసం ఒక వాదన ఏమిటంటే, "మా జీవితాలను పరిశీలించి అది నిజమో కాదో అని మీరు తెలుసుకోవచ్చు." నేడు, క్రైస్తవ ప్రపంచం, "నన్ను చూడవద్దు; యేసు వైపు చూడు."

అపొస్తలుడైన పౌలు రోమీయులకు ఇలా సెలవిచ్చాడు, "మీరు ఈ లోక( లేక, ఈ యుగ) మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.. (రోమీయులకు 12:2)

Bible Reading: Jeremiah 43-45
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, యేసు నామంలో, ఈ లోకం మర్యాదను అనుసరింపక, నీ చిత్తం ప్రకారంగా జీవించడానికి నాకు సహాయం చేయి. పరిశుద్ధాత్మ దేవా, నా చుట్టూ ఉన్నవారికి క్రీస్తును పొలి నడుచుకొనుటకు నాకు సహాయం చెయ్యి. ఆమెన్



Join our WhatsApp Channel


Most Read
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #4
● మాకు కాదు
● 18 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● సుదీర్ఘ రాత్రి తర్వాత సూర్యోదయం
● మీ మనసును పోషించుడి
● తన్నుతాను మోసపాచుకోవడం అంటే ఏమిటి? - II
● స్వేచ్ఛ మరియు పరిణతిలో నడవడం
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್