english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. సాతాను మిమ్మల్ని ఎక్కువగా అడ్డుకునే ఒక రంగం
ಅನುದಿನದ ಮನ್ನಾ

సాతాను మిమ్మల్ని ఎక్కువగా అడ్డుకునే ఒక రంగం

Thursday, 4th of September 2025
0 0 416
Categories : ఆరాధన (Worship)
ఫరో మోషేను పిలిపించి, "మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చును" అని చెప్పెను. (నిర్గమకాండము 10:24)

ఫరో మోషేను పిలిచి, వెళ్లి యెహోవాను సేవించమని చెప్పాడు. పరిస్థితిని బట్టి చూస్తే, ఇక్కడ ఫరో చివరకు వెనుకడుగు వేసి, ఓటమిని అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, మీరు దగ్గరగా గమనించినట్లైతే, ఫరో మందలను మరియు పశువులను తన వెంట ఉంచుకున్నాడు.

కారణం ఏమిటంటే, యెహోవాను ఆరాధించే ఇశ్రాయేలీయుల సామర్థ్యాన్ని ఫరో తగ్గించాలనుకున్నాడు. కాబట్టి మోషే మళ్లీ రాజీ పడేందుకు నిరాకరించాడు.

మీరు యోబు 1 చదివగలిగితే, అక్కడ మళ్ళీ, శత్రువు మొదటిగా పశువులను దాడి చేసినట్లు చూడగలము. దీనికి కారణం ఏమిటంటే, యోబు ప్రతిరోజూ ఉదయం ఆరాధనకు ప్రతీకగా దేవునికి దహనబలులు అర్పించేవాడు. పశువులు లేకపోతే, యోబు దేవుణ్ణి ఎలా ఆరాధించగలడు?

దేవుని ఆరాధించడానికి ఈ రోజు మనకు ఎద్దులు మరియు మేకలు అవసరం లేదని అందును బట్టి నేను దేవునికి కృతజ్ఞతస్తులు తెలుపుచున్నాను. ప్రభువైన యేసు, తన ఏకైక సంపూర్ణ త్యాగం ద్వారా, ముసుగును తెరిచాడు, తద్వారా ఇప్పుడు మనం దేవుని సన్నిధిలోకి ప్రవేశించవచ్చు.

 ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. (హెబ్రీయులకు 10:14)

దేవుడు కోరుకునేది ఏదైనా ఉంటే ఆరాధన. యోహాను 4:23 మనకు సెలవిస్తుంది , "అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను ,సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుతున్నాడు."

దేవుడు అన్నిటికంటే ఎక్కువగా కోరుకునేది ఇదే; ఇదే మనకు అనుకుల సమయం ఆయన సన్నిధిని వెతకడానికి. మరియు శత్రువు (దుష్టుడు) ప్రభువును ఆరాధించకుండా మిమ్మల్ని అడ్డుకోవడానికి వాడు చేయగలిగినదంతా చేస్తాడు. అపొస్తలుడైన పౌలు శత్రువు యొక్క కుయుక్తులను మనం తప్పక తెలుసుకోవాలని హెచ్చరించాడు (2 కొరింథీయులు 2:11 చూడండి).

గర్వం (అహంకారం)
సత్యారాధనకు అహంకారం కంటే మరేదీ అడ్డుకాదు. ఒకడు మెలకువగా లేకుంటే, తన వినయం గురించి కూడా గర్వపడవచ్చు. కొందరు క్రైస్తవులు దేవుడు తమను ఉపయోగిస్తున్న విధానాన్ని చూసి గర్వపడతారు.శయేసును దాని మీద కూర్చోబెట్టి యెరూషలేంలోకి ప్రవేశించిన గాడిదను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

మన సంపదతో దేవుడని ఆరాధించడంలో విఫలమవడం
సామెతలు 3:9-10లో, మనం ఈ ఆదేశాన్ని కనుగొంటాము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘన పరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును.

ఇశ్రాయేలీయులు తమ దేవుణ్ణి ఆరాధించడానికి రిక్తహస్తాలతో ఐగుప్తు నుండి బయటకు వెళ్లడాన్ని ఫరో పట్టించుకోలేదు, ఐగుప్తులో వారి ఆస్తులన్నింటినీ వదిలివేసాడు.

పాత నిబంధన ప్రకారం, దేవుని ఆరాధించడానికి తన సంపద నుండి తన చేతుల్లో ఎటువంటి బహుమతి లేదా అర్పణ లేకుండా ఎవరైనా తన ముందుకు వట్టి చేతులతో రాకూడదని దేవుడు నిషేధించాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, "ఎవరూ వట్టి చేతులతో నా సన్నిధిలో కనిపించకూడదు." (నిర్గమకాండము 34:20).

మన సంపదతో దేవుణ్ణి ఆరాధించడం వల్ల మనకు ఉన్న అన్నింటికీ దేవుడే మూలమని మరియు ఆయన మొదటగా మనకు ఇచ్చిన వాటికి మనం నిర్వాహకులమని అంగీకరిస్తాము. ఇక్కడే ఎక్కువ మంది క్రైస్తవులు పోరాడుతున్నారు.

Bible Reading: Ezekiel 11-13
ಪ್ರಾರ್ಥನೆಗಳು
సజీవ దేవుని ఆరాధించకుండా నన్ను అడ్డుకునే ప్రతి శక్తి యేసు నామంలో నరికివేయబడును గాక. ఆమెన్

Join our WhatsApp Channel


Most Read
● మొలకెత్తిన కఱ్ఱ
● 29 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● విశ్వాసం యొక్క సామర్థ్యము
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #3
● దానియేలు ఉపవాసం
● ఒత్తిడిని జయించడానికి 3 శక్తివంతమైన మార్గాలు
● ఉత్తమము మంచి వాటికి శత్రువు
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್