english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. విత్తనం యొక్క గొప్పతనం
ಅನುದಿನದ ಮನ್ನಾ

విత్తనం యొక్క గొప్పతనం

Friday, 12th of September 2025
0 0 388
Categories : శిష్యత్వం (Discipleship) సేవ చేయడం (Serving)
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, "నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతని మీద నీ చెయ్యి యుంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము" (సంఖ్యాకాండము 27:18-19)

మోషే తన నాయకత్వం ముగింపు దశకు చేరుకున్నాడు. ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశము యొక్క సరిహద్దుకు చేరుకున్నారు మరియు మోషే 'అవిధేయత' కారణంగా, ప్రభువు అతన్ని ప్రవేశించడానికి అనుమతించలేదు.

తన నాయకత్వాన్ని యెహోషువకు బదిలీ చేయడాన్ని సూచించడానికి బహిరంగంగా యెహోషువపై చేతులు ఉంచమని దేవుడు మోషేకు సూచించాడు.

అలాగే, కొత్త నిబంధనలో, పరిచారికులను ఎన్నుకున్నప్పుడు (అపొస్తలుల కార్యములు 6:6), వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వారికై ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి. పాత మరియు కొత్త నిబంధనలో ఉన్న ఆలోచన ఒకటే; పరిశుద్ధాత్మ ఈ మనుష్యులలో పనిచేసింది, మరియు మానవుని మీద చేతులు వేయడం దేవుని హస్తం వారిపై ఇప్పటికే ఉందని ధృవీకరించబడింది.

అపొస్తలుడైన పేతురు మనలను ఇలా హెచ్చరిస్తున్నాడు, "దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి" (1 పేతురు 5:6). ఇక్కడ దీనమనస్కులై యొక్క గ్రీకు పదానికి విధేయత గల సేవకుడి వైఖరి అని అర్థం.

యెహోషువ కొన్ని సంవత్సరాల్లో మోషేకు నమ్మకంగా సేవ చేయడం ద్వారా దేవునికి సేవ చేయగలిగాడు, ఆపై తగిన సమయంలో, అతను గొప్ప విషయాలలో ప్రభువును సేవించడానికి సిద్ధంగా ఉన్నాడు.

చిన్న విషయాలలో శక్తివంతమైన ప్రవక్త ఏలీయాకు సేవ చేసిన ఎలీషా విషయంలో కూడా అదే స్థితి ఉంది. ఎలీషా తరచుగా "ఎలీషా చేతులపై నీరు పోసిన" వ్యక్తిగా సూచించబడ్డాడు. (2 రాజులు 3:11) ఇవే కేవలం అతని ఆధారాలు. అతడు బిరుదు లేకుండా కూడా సేవ చేశాడు. నేడు, కొంతమంది వ్యక్తులు తమను సన్మానించనప్పుడు లేదా వేదికపై ప్రస్తావించనప్పుడు మనస్తాపం చెందుతారు. వారిని బహిరంగంగా అంగీకరించకపోతే సంఘం లేదా ఆరాధనకు హాజరుకావడం కూడా మానేస్తారు.

ఎలీషా దేవుని శక్తివంతమైన దాసుడిగా అయ్యాడు, కానీ అతడు సేవకునిగా శిక్షణ పొందాడు! నిజమైన ఆధ్యాత్మిక నాయకులు ఏర్పర్చబడటానికి ఇదొక్కటే మార్గం. ఇతరులకు సేవ చేయడం మరియు మనం సేవ చేసే వారి నుండి నేర్చుకోవడం ద్వారా విధేయత ఇందులో ఇమిడి ఉంటుంది. ఎవరో ఇలా అన్నారు, "మనము వెంబడించడం ద్వారా మాత్రమే నాయకత్వం వహించడానికి సిద్ధపడగలము." ఇది మన కర్తవ్యాల పెద్దతనం లేదా చిన్నతనం కాదు, కాని మన హృదయాల సమర్పణ వైఖరి చాలా ముఖ్యం.

మీరు తదుపరి స్థాయికి వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ నీటి కాడ సిద్ధంగా ఉంచుకోండి మరియు వరుసలో ఉండండి; మీరు తదుపరి ఎలీషా, తదుపరి యెహోషువ కావచ్చు!

Bible Reading: Ezekiel 31-32
ಅರಿಕೆಗಳು
దేవుడు తగిన సమయమందు నన్ను హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద నేను దీనమనస్కులై యుంటాను. యేసు నామంలో. ఆమెన్.




Join our WhatsApp Channel


Most Read
● హన్నా జీవితం నుండి పాఠాలు
● మోసపూరిత లోకములో విచక్షణ సత్యం
● స్తుతి అనేది దేవుడు నివసించే స్థలం
● ఆధ్యాత్మిక ప్రయాణం
● ప్రార్థన యొక్క పరిమళము
● క్రైస్తవులు దేవదూతలను ఆజ్ఞాపించవచ్చా?
● 26 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್