english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. మరొక అహాబు కావద్దు
ಅನುದಿನದ ಮನ್ನಾ

మరొక అహాబు కావద్దు

Tuesday, 23rd of September 2025
0 0 324
Categories : దేవుని వాక్యం (Word of God) మోసం (Deception)
రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొనెను. (2 రాజులు 22:11)

దేవుని ప్రజలు విగ్రహారాధనలో దేవునికి దూరమయ్యారు. దేవుని మందిరం (దేవుని గృహము) నిర్లక్ష్యం చేయబడింది. అటువంటి ఆధ్యాత్మిక చీకటి సమయంలో, దేవుడు యోషీయా అనే యువ రాజును లేవనెత్తాడు.

పై వచనానికి నేపథ్యం ఏమిటంటే, ప్రధాన యాజకుడు హిల్కియా మందిరానికి మరమ్మతులు చేస్తున్నప్పుడు మందిరంలో ధర్మశాస్త్ర గ్రంథము దొరికింది. అతడు యోషీయా రాజు వద్దకు ధర్మశాస్త్ర గ్రంథాన్ని (దేవునిచే వ్రాయబడిన మాటలు) తీసుకువస్తాడు. యోషీయా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, అతడు దోషిగా నిర్ధారించబడ్డాడు మరియు పశ్చాత్తాపానికి సూచనగా తన బట్టలు చింపుకున్నాడు.

అలాగే, మీరు వాక్యాన్ని విన్నప్పుడు, మీ వైపు నుండి వాక్యానికి ప్రతిస్పందన ఉండాలి. మీరు కేవలం వాక్యాన్ని విని వదిలేయడం సరిపోదు. "నేను దేవుని వాక్యాన్ని నమ్ముతాను" అని చెప్పడం మాత్రమే సరిపోదు, మీరు దానిపై కార్యం చేయాలి. లేఖనము సెలవిస్తుంది, "దయ్యాలు కూడా నమ్ముతాయి మరియు వణుకుతున్నాయి" (యాకోబు 2:20), కానీ వారు తమ విశ్వాసాన్ని ఎప్పుడూ వెంబడించరు.

మీరు వినువారు మాత్రమై యుండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించు వారునైయుండుడి. (యాకోబు 1:22)

ఒక వ్యక్తి కేవలం వాక్యం విని ఏమీ చేయనప్పుడు, అలాంటి వ్యక్తి తనను తాను మోసానికి దారితీస్తాడు.

ఈ అంత్య దినాలలో మోసం అనేది అతి పెద్ద ప్రమాదం. మోసానికి ఒకరి దుర్బలత్వాన్ని తిరస్కరించే ఎవరైనా ఇప్పటికే మోసపోయారు. మోసం అంటే మీరు వినాలనుకున్నది వినాలనుకోవడం.

అహాబు తాను వినాలనుకున్నది ప్రవచించే ప్రవక్తలతో తన కోసం ఏరపర్చుకున్న దుష్ట రాజు.

ఇశ్రాయేలు రాజు (అహాబు) దాదాపు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించి, "యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా" అని వారి నడిగెను. "అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును" గనుక పొండని వారు చెప్పిరి. (1 రాజులు 22:6)

లోతుగా పరిశీలిస్తే, వారు చెప్పేది నిజం కాదని అతనికి తెలుసు, కానీ అతడు ఇప్పటికీ ఆ అబద్ధాన్ని నమ్ముతాడు, ఎందుకంటే అతడు అప్పటికే మోసపోయాడు. అతడు దేవుని యొక్క నిజమైన వాక్యాన్ని చాలాసార్లు విన్నాడు, కానీ అతడు దానిని వింటూనే ఉన్నాడు మరియు దాని గురించి ఏమీ చేయలేదు. మరొక అహాబు కావద్దు.

Bible Reading: Daniel 8-9
ಪ್ರಾರ್ಥನೆಗಳು
1. తండ్రీ, యేసు నామంలో, నీ కృప మరియు జ్ఞానంతో, నేను, నా కుటుంబ సభ్యులు, నా సంఘము మరియు నాకు సంబంధించిన వారందరూ నీ నుండి బాగా బోధించబడ్డారని నేను ప్రకటిస్తున్నాను. దీనికై నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను.

2. తండ్రీ, యేసు నామంలో, పరిశుద్దమైన మరియు అపరిశుద్దమైన, అపవిత్రమైన వాటి నుండి పవిత్రమైన మరియు అసత్యం నుండి సత్యమైన వాటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి మాకు వివేచన దయచేయి.

3. తండ్రీ, ఎల్లప్పుడూ నీ వాక్యమును వినేవాడిగా మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ వాక్యప్రకారము ప్రవర్తించు ఉండేలా నాకు అధికారం దయచేయి. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● అంతిమ భాగాన్నిగెలవడం
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #2
● జీవితపు తుఫానుల మధ్య విశ్వాసాన్ని కనుగొనడం
● కాపలాదారుడు
● విశ్వాసం: ప్రభువును సంతోషపెట్టడానికి ఖచ్చితమైన మార్గం
● 21 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● జీవితం నుండి పాఠాలు- 3
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್