english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. పరిశుద్ధత గురించి స్పష్టంగా తెలియజేయబడింది
ಅನುದಿನದ ಮನ್ನಾ

పరిశుద్ధత గురించి స్పష్టంగా తెలియజేయబడింది

Friday, 26th of September 2025
0 0 338
Categories : పరిశుద్ధత (Sanctification)
1. పరిశుద్ధత అనేది దేవునితో యోగ్యమైన ఆధ్యాత్మిక నడకను కొనసాగించడం మరియు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవడం.

2. పరిశుద్ధత అంటే దైవభీతితో జీవించే జీవన విధానం.
పోతీఫరు భార్య యోసేపును మోసగించడానికి ప్రయత్నించింది. యోసేపు ప్రియమైనవారికి మరియు కుటుంబ సభ్యులకు దూరంగా, విదేశీ దేశంలో ఒంటరిగా ఉన్నాడు, ఖచ్చితంగా లొంగిపోయేందుకు ప్రేరేపించబడేవాడు. అతడు చెప్పినది ఒక్కసారి గమనించండి, "నీవు అతని భార్యవై నందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టు కొందును? (ఆదికాండము 39:9) యోసేపు జీవితం దేవుని భయంతో నిర్దేశించబడింది.

3. పరిశుద్ధత అనేది ఎల్లవేళలా దేవుని సంతోషపెట్టాలని చూస్తుంది.
లూకా 6:26 యొక్క మెసేజ్ అనువాదంలో, మనకు ఇలా సెలవిస్తుంది: ""ఇతరుల ఆమోదం కోసం మీరు జీవించడం, వారికి నచ్చినది చెప్పడం, వారు ఇష్టపడేది చేయడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రజాదరణ పోటీ నిజమైన పోటీ కాదు. మీ కర్తవ్యం నిజాయితీగా ఉండాలి , ప్రజాదరణ కాదు."

ఒక క్రైస్తవ స్త్రీ నాకు ఇలా వ్రాసింది, "నేను నా పెళ్లిలో మద్యం పెట్టకపోతే, ప్రజలు ఏమనుకుంటారు?" నేను ఖచ్చితంగా ఆమెతో ఏమీ అనలేదు. మీకు తెలిసి ఉండవచ్చు, దేవుడు చెప్పేదాని కంటే ప్రజలు చెప్పేదానిపై ఎక్కువ శ్రద్ధ వహించే వ్యక్తులు ఉన్నారు.

కానీ ఇప్పుడు ఇంకొక జాతి కూడా ఉంది (అది తక్కువ సరఫరాలో ఉంది), "నేను మానవుని సంతోషపెట్టేవాని కంటే దేవుని సంతోషపెట్టేవాడిని."

ప్రభువైన యేసుక్రీస్తు మాటలలో పరిశుద్ధత యొక్క నిర్వచనం. "నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు." (మత్తయి 5:6).

నీతి కొరకు మీ ఆకలిదప్పులు లోకంలోని వస్తువుల ఆకలిదప్పులు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, మీరు పరిశుద్ధతలో నడుస్తారు. ఈ ఆకలిదప్పులు మీకు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు.

కాబట్టి, ఆయన సన్నిధి కోసం, ఆయన మార్గాల కోసం ఈ ఆకలిదప్పులు కోసం ప్రతిరోజూ ఆయనను అడగడం ఒక అంశముగా పెట్టుకోండి. మీరు ఇలా చేసినప్పుడు, మీరు పరిశుద్ధపరచబడతారు మరియు మరింత ఎక్కువగా ఆయనలా అవుతారు.

Bible Reading: Hosea 5-10
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, నిన్ను మరింత ఎక్కువగా తెలుసుకోవాలని నాకు ఆకలిదప్పులను ఇవ్వు. యేసు నామంలో. ఆమెన్.



Join our WhatsApp Channel


Most Read
● ఊహించని సామర్థ్యం: ఉపయోగించని వరముల ప్రమాదం
● గొప్ప క్రియలు
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● అశ్లీలత
● కార్యం చేయండి
● శత్రువు మీ మార్పుకు (రూపాంతరమునకు) భయపడతాడు
● ప్రభువైన యేసయ్య ద్వారా కృప
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್