english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. 06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
ಅನುದಿನದ ಮನ್ನಾ

06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన

Thursday, 27th of November 2025
0 0 301
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)

నేను వృథాగా ప్రయాసపడను


ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణములు. (సామెతలు 14:23)

ఫలించడం ఒక ఆజ్ఞ. మానవుని సృష్టించిన తర్వాత దేవుడు అతనికి ఇచ్చిన ప్రధాన అజ్ఞాలలో ఇది ఒక ఆజ్ఞా. లాభాపేక్షలేని ప్రయాసము మీ జీవితంలో శత్రువు పని చేస్తున్నాడు అనే దానికి చిహ్నము.

ఈ శక్తులు ప్రజల మీద దాడి చేసినప్పుడు, వారి ప్రయాసము చూపించడానికి వారి దగ్గర ఏమీ ఉండదు. కొన్నిసార్లు, ఈ శక్తులు వారిని పని చేయడానికి మరియు కొంత ఫలితం పొందడానికి అనుమతించవచ్చు, కానీ రాత్రికిరాత్రే, వారి సంవత్సరాల తరబడి ప్రయాసను తుడిచిపెట్టే ఇబ్బంది మరియు నష్టం ఉంటుంది.

అనేకమంది విశ్వాసులు వృథాగా ప్రయాసపడుతున్నారు; వారికి అపవాది యొక్క కార్యము గురించి తెలియదు. ఈ విశ్వాసులు వరములు పొందినవారు కానీ అభివృద్ధి చెందరు; వారికి ఉద్యోగం లేని అర్హతలు మరియు డబ్బు లేని తెలివితేటలు ఉన్నాయి. వీరిలో కొందరు బహుళ ఉద్యోగాలు, ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తూ అప్పులపాలై జీవిస్తున్నారు. కొంతమంది విశ్వాసులు తమ వ్యాపారాలలో ఇప్పటికే విజయం సాధించారు, కాబట్టి వారు ఈ రకమైన ప్రార్థనలు చేయవలసిన అవసరం లేదని వారు భావిస్తారు. అపవాది విజయవంతంగా దాడిని ప్రారంభించిన తర్వాత కాకుండా దాడి చేసే ముందు ప్రార్థన చేయడం ఉత్తమమని వారు గ్రహించలేరు. మనం అజాగ్రత్తగా ఉంటే అపవాది ఎప్పుడైనా దాడి చేయవచ్చు కాబట్టి, నేటి విజయం రేపటి దినమున పోతుంది. ఉదాహరణకు, యోబును తీసుకోండి. అతడు అప్పటికే ఫలించబడ్డాడు మరియు బాగా స్థిరపడ్డాడు, కానీ అపవాది అతని మీద దాడి చేసినప్పుడు, అతడు ఒక రోజులో ప్రతిదీ కోల్పోయాడు. దేవుడు అతనికి తోడుగా ఉండకపోతే యోబు మరల ఫలించే వాడు కాదు.

ప్రజలు వృథాగా ప్రయాసపడటానికి గల కొన్ని ప్రధాన కారణాలు

1. బానిసత్వం

ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారు, వారి శ్రమ అంతా వారి కార్యనిర్వాహకుల కోసమే.

9 అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది. 10 వారు విస్తరింప కుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడుకూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను. 11 కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి. 13 ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి; 14 వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. (నిర్గమకాండము 1:9-11, 13-14)

2. దుర్మార్గుల దుర్మార్గం

మిద్యానీయులు, ఇశ్రాయేలీయులు విత్తనములు నాటడానికి మరియు విత్తనాలు పెరగడానికి వేచి ఉన్నారు, మరియు పంట సమయంలో, వారు తమకు లాభాన్నిచ్చే వాటన్నిటిని నాశనం చేయడానికి ఉన్నారు; శత్రువు ఈ విధంగా కార్యము చేస్తాడు.

శ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్ప గించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధన మైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయ లేదు. వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను. దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱ పెట్టిరి. (న్యాయాధిపతులు 6:1-6)

కొన్నిసార్లు, వారు ఒక యువకుడి యవ్వన వయస్సులో విజయం సాధించడానికి అనుమతించవచ్చు మరియు వృద్ధాప్యంలో, వారు అతని ఆర్థిక స్థితిని హరించే అనారోగ్యంతో అతన్ని బాధ పెట్టవచ్చు. 
కొన్నిసార్లు, వారు పిల్లలు చనిపోయేలా చేస్తారు మరియు పిల్లల మీద తల్లిదండ్రుల వెచ్చించి అంతా వృధా అవుతుంది. వారు మిమ్మల్ని ఆపడానికి ముందు వారిని ఆపండి; వారు మీతో పోరాడకముందే వారితో పోరాడండి. మీ శత్రువు భౌతికమైనది కాదు, మీ శత్రువు అపవాది, కానీ వాడు మీ మీద ప్రజలను ప్రభావితం చేయగలడు మరియు ఉపయోగించగలడు. ఆ ప్రజలు మీ నిజమైన శత్రువు కాదు, కానీ వారు సాతాను ప్రభావంలో ఉన్నారు. ఆధ్యాత్మిక శత్రువును ఆపడానికి మీరు ప్రార్థించిన క్షణం, మానవ ఆధారం ద్వారా వాని ప్రభావం కూడా ఆగిపోతుంది.

3. పాపభరితమైన జీవనశైలి

పాపం శత్రువుకు చట్టపరమైన ప్రాప్యతను ఇస్తుంది.

మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. (యిర్మీయా 5:25)

లాభరహిత ప్రయాసమును అనుభవించిన వారికి బైబిలు ఉదాహరణలు

1. మరచిపోబడిన జ్ఞానము గల బీదవాడు.

ప్రసంగి 9:15 లో, జ్ఞానము గల బీదవాడు ఒక నగరం మొత్తాన్ని నాశనం నుండి రక్షించాడు, కానీ అతడు పరచిపోబడ్డాడు. అతని శ్రమకు ప్రతిఫలం లభించలేదు. ఈ వ్యక్తి తెలివైనవాడు, కానీ అతడు బీదవాడు ఎందుకంటే అతడు ప్రజలకు సహాయం చేసినప్పుడల్లా, వారు అతన్ని పరచిపోయే వారు. జ్ఞానం మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది, కానీ ప్రజలను వృథాగా ప్రయాసపడేలా చేసే ఈ ఆత్మతో మీరు వ్యవహరించనప్పుడు, మీరు "జ్ఞానము గల బీదవాడైన వ్యక్తి" అవుతారు.

2. యాకోబు

యాకోబు చాలాసార్లు మోసపోయాడు మరియు అతని ప్రయాసకు పూర్తి ప్రతిఫలం లభించలేదు. అతని జీవితాన్ని దేవుని నిబంధన అతనిని రక్షించింది.


38 ఈ యిరువది యేండ్లు నేను నీయొద్దనుంటిని. నీ గొఱ్ఱలైనను మేక లైనను ఈచు కొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. 39 దుష్ట మృగములచేత చీల్చబడినదానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటియందు దొంగిలింపబడిన దాని నేమి రాత్రియందు దొంగి లింపబడినదాని నేమి నాయొద్ద పుచ్చుకొంటివి; నేను ఈలాగుంటిని. 40 పగటి యెండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని; నిద్ర నా కన్నులకు దూర మాయెను. 41 ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలు గేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి. 42 నా తండ్రి దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడైయుండనియెడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి యుందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి, పోయిన రాత్రి నిన్ను గద్దించెనని లాబానుతో చెప్పెను. (ఆదికాండము 31:38-42)

మన సమాజాలలో చాలా మంది లాబాను వంటివారు; వారు ప్రజలను మోసం చేస్తారు మరియు వారి పూర్తి ఆశీర్వాదాన్ని తిరస్కరిస్తారు. మీరు ప్రార్థన చేసిన యెడల, దేవుడు మీకు సంపూర్ణాంగా ఇవ్వడానికి అడుగు వేయగలడు.

తదుపరి అధ్యయనం: లూకా 5:5-7, యెషయా 65:21-23, 1 కొరింథీయులకు 15:10

Bible Reading Plan :  Mark : 1 - 6
ಪ್ರಾರ್ಥನೆಗಳು
ప్రతి ప్రార్థన క్షిపణిని కనీసం 2 నిమిషాలు లేదా మీ ఆత్మలో విడుదలను అనుభవించే వరకు ప్రార్థించండి.

1. యేసు నామములో నా పంటను నాశనం చేయడానికి కేటాయించిన ప్రతి శక్తిని నేను చెదరగొడుతున్నాను.

2. యేసు నామములో నా చేతుల కష్టార్జితానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దుష్ట శక్తిని నేను నాశనం చేస్తున్నాను.

3. దేవుని అభిషేకం ద్వారా మరియు యేసు రక్తం ద్వారా, యేసు నామములో నా జీవితంలో మంచి సంగతుల మీద దాడి చేసే ప్రతి శక్తిని నేను నాశనం చేస్తున్నాను.

4. యేసు నామములో నా ఆరోగ్యం, వ్యాపారం మరియు కుటుంబమును మ్రింగేవారిని, దొంగలను మరియు పాడు చేసేవారిని నేను తిరస్కరిస్తున్నాను.

5. యేసు నామములో నా శ్రమను వ్యర్థం చేయడానికి కేటాయించిన ఏదైనా అధికారాన్ని నేను నిషేదిస్తున్నాను.

6. తండ్రీ, నా చేతుల కష్టార్జితమును దీవించు మరియు యేసు నామములో 100 అంతలా పంటను కోయు.

7. నేను దొంగిలించబడిన ప్రతి దీవెనలు, నీతి, అవకాశాలు మరియు సంపదలను యేసు నామములో తిరిగి పొందుతున్నాను.

8. యేసు రక్తం ద్వారా, నేను యేసు నామములో నా పునాదిలో ఉండే ప్రతి చెడును ఆపివేస్తున్నాను.

9. నా జీవితంలో నా పరలోకపు తండ్రి నాటని ఏ తోటనైనా యేసు నామములో నిర్ములించబడును గాక.

10. యేసు నామములో నా పునాది నుండి నా జీవితంలోకి కార్యము చేయబడిన ఏదైనా శాపం మరియు వైఫల్యాన్ని నేను నాశనం చేస్తున్నాను.


Join our WhatsApp Channel


Most Read
● ఆయన ద్వారా ఏ పరిమితులు లేవు
● దేవుని 7 ఆత్మలు: ప్రభువు యొక్క ఆత్మ
● ఇక నిలిచి ఉండిపోవడం చాలు
● మీ జీవితాన్ని మార్చుకోవడానికి బలిపీఠానికి ప్రాధాన్యత ఇవ్వండి
● ఇతరులకు సేవ చేయడం ద్వారా మనం అనుభవించే దీవెనలు
● పురాతన మార్గములను గూర్చి విచారించుడి
● 21 రోజుల ఉపవాసం: 19# వ రోజు
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್