english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. దేవుడు నిన్ను ఉపయోగించుకోవ లనుకుంటున్నాడు
ಅನುದಿನದ ಮನ್ನಾ

దేవుడు నిన్ను ఉపయోగించుకోవ లనుకుంటున్నాడు

Thursday, 26th of March 2026
0 0 43
Categories : భావోద్వేగాలు (Emotions)
నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. (యెహొషువ 1:9)

దేవునిపై విశ్వాసం ఉంచడం కేవలం కోరికతో కూడిన ఆలోచన కాదు. ఇది క్రియాత్మకంగా మీలో మరియు మీ ద్వారా పని చేయగల దేవుని సామర్థ్యాన్ని విశ్వసించడం. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నీకు శక్తినిచ్చాడు. ఆయన తన వాక్యముతో మనలను సమకూర్చాడు. ఆయన మనకు ఈ దినాన్ని ఇచ్చాడు. మనం కలలో కూడా ఊహించని ద్వారాలను తెరిచాడు. ఆయన ఏ ఉద్దేశ్యం లేకుండా నిన్ను ఇంత దూరం తీసుకువచ్చాడని నీవు అనుకుంటున్నావా? దీని గురించి ఒకసారి ఆలోచించు.

ప్రభువు మిమ్మల్ని తన మహిమ కొరకు ఉపయోగించకూడదనుకుంటే, ఆయన చేసిన విధంగా ఆయన మీకు అధికారం ఇచ్చేవాడా? ఆయన అలా చేస్తాడా?

దేవుడు వేరొకరిని ఉపయోగించుకోబోతున్నాడనే నమ్మకం కలిగి ఉండటం చాలా సులభం, కానీ నిజం ఏమిటంటే మీరు అడగగలిగే లేదా ఊహించిన దానికంటే కూడా ఆయన మిమ్మల్ని ఉపయోగించు కోవలనుకుంటున్నాడు. (ఎఫెసీయులకు 3:20)

చాలా తరచుగా, మన చుట్టూ ఉన్న వ్యక్తుల కంటే మనం ఎక్కువగా విరిగి నలిగి పోయాము, విడిచిపెట్టబడ్డాము అనే భావన మనకు వస్తుంది. మనకంటే ఇతరులే ఆ ఉద్యోగానికి ఎక్కువ అర్హులన్న భావన కలుగుతుంది. ఇది మన జీవితంలో ఉపసంహరించుకునేలా చేస్తుంది. అయితే, మీరు నిజంగా వాక్యాన్ని పరిశీలిస్తే, దేవుడు విరిగి నలిగిన, అసంపూర్ణ వ్యక్తులను ప్రతి సమయాలలో ఉపయోగించుకున్నాడు అది మీరు చూడగలరు! ఆయన మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి మీ జీవితాన్ని సంపూర్ణంగా పొందడం కోసం వేచి ఉండడం లేదు. ఆయన మిమ్మల్ని ఇక్కడే ఉపయోగించు కోవలనుకుంటున్నాడు, ఇప్పుడే!

మనమందరం మనలో ఉపయోగించని తలాంతులు మరియు ప్రతిభను కలిగి ఉన్నాము మరియు మన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆ మార్గంలో విశ్వాసంతో అడుగు పెట్టాలి మరియు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మక ముంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. (సామెతలు 3:5-6)

మీరు ఎంత కలిగి ఉన్నారనేది కాదు, మీ వద్ద ఉన్నవాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారనేది ముఖ్యం. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు మరియు ప్రతిభను మీరు మరి ఎక్కువగా ఉపయోగిస్తున్నారా?

Bible Reading: Judges 10-12
ಪ್ರಾರ್ಥನೆಗಳು

ప్రభువా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నా చేతులు పట్టుకో, నా పాదాలను పట్టుకో, నా హృదయాన్ని తాకు, నాతో మాట్లాడు మరియు నీ మహిమకై నన్ను వాడుకో, యేసు నామంలో, ఆమేన్.


Join our WhatsApp Channel


Most Read
● క్షమించకపోవడం
● అపకీర్తి గల పాపానికి ఆశ్చర్యమైన కృప అవసరం
● ఆయన నీతి వస్త్రమును ధరించుట
● Day 13: 40 Days Fasting & Prayer
● 37 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● జూడస్ జీవితం నుండి పాఠాలు -1
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್