english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. నూతనముగా మీరు
ಅನುದಿನದ ಮನ್ನಾ

నూతనముగా మీరు

Saturday, 3rd of September 2022
2 0 1642
Categories : దేవునితో సాన్నిహిత్యం (Intimacy with God)
మీరు ఒక పురుషుడు లేదా స్త్రీ అయినా, మీరు నిన్న చేసిన ఎంపికల వల్ల ఈ రోజు మీరేమై ఉన్నారు. మీరు పనిచేసిన లేదా బహుశా నివసించిన వాతావరణం కారణంగా మీరు ఈ రోజు మీరేమై ఉన్నారు.

"విశ్వాసం నుండి విశ్వాసం" వరకు మన విశ్వాస స్థాయికి ఎదగాలని బైబిల్ స్పష్టంగా చెబుతుంది (రొమియులకు 1:17). మనం రోజూ మహిమ నుండి మహిమగా రూపాంతరం చెందాలి (2 కొరింథీయులకు 3:18). కాబట్టి మన విశ్వాసం పెరగడానికి మరియు మహిమ యొక్క తదుపరి స్థాయికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నట్లు స్పష్టమవుతుంది.

మీరు గతంలో తప్పు ఎంపికలు చేసి ఉంటే ఇప్పుడు చింతించకండి. మీ సహవసాలు లేదా వాతావరణం అంతగా కావాల్సినవి కాకపోతే మిమ్మల్ని మీరు నిందించుకొకండి.

మంచి శుభవార్త ఏమిటంటే, మీరు పరిశుద్ధాత్మ సహాయంతో మరియు మీ సంకల్పంతో పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా మారవచ్చు. దేవుడు మీరు ఉండాలని కోరుకునేవన్నీ మీరు కావచ్చు.

ముఖ్యమైన అంశం క్రింది వాక్యంలో ఉంది:
ప్రవక్త సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు, యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును, అప్పుడు మీరు నూతన వ్యక్తిగా అవుతారు (1 సమూయేలు 10:6)

అపొస్తలుడైన యోహాను మరియు అతని సోదరుడు యాకోబు ఉరుము పుత్రులుగా పిలువబడ్డారు, బహుశా వారి కోపం వల్ల. ఒక రోజు, ప్రభువైన యేసు మరియు ఆయన శిష్యులు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు సమరయ గ్రామం గుండా ప్రయాణిస్తున్నప్పుడు, సమరయలు ఆయనను స్వీకరించలేదు. కాబట్టి సోదరులు, కోపంతో, గ్రామాన్ని నాశనం చేయడానికి పరలోకం నుండి అగ్నిని పిలవడానికి అనుమతి కోసం యేసును సంప్రదించారు (లూకా 9:52-54).

ప్రభువైన యేసు వారిని తీవ్రంగా మందలించాడు. అయినప్పటికీ, యేసు యొక్క నిరంతర సహవాసం మరియు పరిశుద్ధాత్మతో నింపబడం ద్వారా వారు తమను తాము మార్చుకున్నారు. ఈ రోజు మనం యోహానును ప్రేమ ఎలా అపొస్తలుడిగా చూస్తూన్నాము. (1 యోహాను, 2 యోహాను, 3 యోహాను). ఎంత తీవ్రమైన మార్పు! ఇది మీకు కూడా జరుగుతుంది. ప్రతి రోజు పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యంతో సహవాసం చేయడం, మరియు అతి త్వరలో, మీరు పూర్తిగా నూతనముగా ఉంటారు.

ఒప్పుకోలు
తండ్రీ, యేసు నామములో, నేను క్రీస్తులో ఉన్నాను మరియు నేను నూతన సృష్టిగా ఉన్నందుకు మీకు వందనాలు. పాత వన్నీ గతించేను, నా జీవితంలో సమస్తము నూతనముగా జరిగాయని నేను ఆజ్ఞాపిస్తున్నాను మరియు ప్రకటిస్తున్నాను. తండ్రీ, నేను మీ స్వంత చేతిపనిని అని మీకు వందనాలు. మీ పనితనం, మంచి పనుల కోసం క్రీస్తు యేసులో పునః సృష్టి చేయబడింది. యేసు నామంలో. ఆమెన్.
ಪ್ರಾರ್ಥನೆಗಳು
నేడు, దానియేలు ఉపవాసం యొక్క 7వ రోజు(నేడు దానియేలు ఉపవాసం యొక్క చివరి రోజు)

లేఖన పఠనము 
యెహొషువ 2:17-21
1 యోహాను 1:7
1 యోహాను 5:8

ప్రార్థన క్షిపణులు (అంశములు)
మీ ఆత్మీయ మనిషిలో విడుదల అనుభూతిని చెందే వరకు ప్రతి ప్రార్థన అంశమును పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అంశమునకు వెళ్లండి. తొందరపడకండి.

[కొంచెం నూనె తీసుకొని మీ ఇంటిలోని ప్రతి భాగాన్ని మరియు మీ ఇంట్లోని ఇతర వస్తువుల మీద రాయండి లేదా పూయుండి మరియు మీరు మీ ఇల్లు మరియు స్వాధీనాని అభిషేకిస్తున్నప్పుడు కూడా ఈ క్రింది అంశములను పలకండి లేదా చెబుతూ ఉండండి]

1. నేను నా ఇంటిలోని ప్రతి భాగాన్ని మరియు నా స్వాధీన్నాని యేసు క్రీస్తు రక్తంతో కప్పి ఉంచుతున్నాను (నిర్గమకాండము 12:13)

[మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను నూనెతో అభిషేకించండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా చెబుతూ ఉంటే బాగుంటుంది]

2. నేను నా ప్రాణాని: స్పృహను, ఉప-చేతన మరియు అపస్మారక స్థితిని: మనస్సు, సంకల్పం, భావోద్వేగాలు మరియు తెలివిని యేసు రక్తంతో కప్పి ఉంచుతున్నాను.

3. నేను నా ఐదు ఇంద్రియాలు: చూపు, వినికిడి, వాసన, రుచి మరియు స్పర్శను యేసు రక్తంతో కప్పి ఉంచుతున్నాను.

4. నేను యేసుక్రీస్తు రక్తం ద్వారా విడుదల పొందుతున్నాను (యెషయా 54:5).

5. నేను యేసు క్రీస్తు రక్తం ద్వారా స్వస్థత మరియు ఆరోగ్యాన్ని పొందుతున్నాను (1 పేతురు 2:24).

6. యేసు రక్తం. యేసు రక్తం. యేసు రక్తం. నా రక్తంలోకి వచ్చును గాక మరియు యేసు నామంలో ప్రతి చెడు కాలుష్యాన్ని తొలగించబడును గాక. (మీరు ఇలా చెబుతున్నప్పుడు మీ శరీరం మీద చేతులు ఉంచండి)

7. తండ్రీ, యేసు నామంలో, ఈ దానియేలు ఉపవాసంలో చేరిన ప్రతి ఒక్కరూ అసాధారణమైన మహాత్కార్యములు మరియు అద్భుతాలను పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. వారి సాక్ష్యాలకై చాలా మందిని యెహోవా వైపు మళ్లించబడును గాక.
 
ఆరాధనలో కొంత సమయం గడపండి 

Join our WhatsApp Channel


Most Read
● 08 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● వాక్యాన్ని పొందుకొవడం
● మీ భవిష్యత్తుకు పేరు పెట్టడానికి మీ గతాన్ని అనుమతించవద్దు
● యేసు తాగిన ద్రాక్షారసం
● వాగ్దాన దేశములోని బలగాలతో వ్యవహరించడం
● సాకులు చెప్పే కళ
● వివేకం పొందుట
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್