english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. ప్రభువును సేవించడం అంటే ఏమిటి - II
ಅನುದಿನದ ಮನ್ನಾ

ప్రభువును సేవించడం అంటే ఏమిటి - II

Wednesday, 20th of March 2024
1 0 1408
Categories : సేవ చేయడం (Serving)
"ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును" అని ప్రభువైన యేసు అన్నాడు. (యోహాను 12:26)

#3 అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును
దేవుడు ఎక్కడ ఉన్నాడో, అక్కడ ఆయన సేవకుడు ఉండాలి, ఇది అందుబాటులో ఉండడం గురించి మాట్లాడుతుంది. నెహెమ్యా తెలిసిన వ్యక్తి కాకముందు ఎవరో తెలియని వ్యక్తిగా ఉన్నాడు. అతడు నెహెమ్యా 1:1లో ఎలా పరిచయం అయ్యాడో గమనించండి: "హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు."

నెహెమ్యా ఎలాంటి అలౌకిమైన అద్భుతాన్ని పొందలేదు, మరియా వంటి దేవదూతల దర్శనం లేదా అపొస్తలుడైన పౌలు వంటి దమస్కు రోడ్ అనుభవాన్ని పొందలేదు. అతడు కేవలం చేతిలో ఉన్న పనికై చేరుకున్నాడు. తనను తాను అందుబాటులోకి తెచ్చుకున్నాడు. అతడు తనను తాను ఉపయోగకరంగా చేసుకున్నాడు. అతడు చేయగలిగినదంతా చేశాడు. కార్యమును పూర్తి చేయడానికి మీకు ఎలాంటి పదవులు అవసరం లేదు. మీకై మీరు అందుబాటులో ఉంచుకోండి.

ప్రార్థన సమయం వచ్చినప్పుడు, నెహెమ్యా హృదయపూర్వకంగా ప్రార్థించాడు. కట్టడానికి సమయం వచ్చినప్పుడు, అతడు గోడలు కట్టేవారికి చేయి నందించాడు.

దేవుని గొప్ప దాసురాలైన కాథరిన్ ఖుల్మాన్ ఇలా చెప్పడం నేను విన్నాను: "దేవుడు వెండి మరియు బంగారు పాత్రలను ఉపయోగించడు. ఆయన అందుబాటులో ఉన్న ఆ పాత్రలను ఉపయోగిస్తాడు" ఈ మాటలు ఎంత నిజం. దేవునికి సామర్థ్యం కంటే అందుబాటులో ఉండడం పైన ఎక్కువ ఆసక్తి. మీకై మీరు అందుబాటులో ఉంచుకోగలిగితే, ఆయన మీకు శక్తినిస్తాడు.

కష్టాలు, వ్యతిరేకతలు ఎదురైనా నమ్మకంగా ఉండగలిగే నెహెమ్యా సామర్థ్యం అతడు దేవునికి ఉపయోగపడేలా చేసింది.

#4 మనం సంతోషముతో ప్రభువును సేవించాలి
సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. (కీర్తనలు 100:2)

గొణుగుడు సేవ, నీరసమైన సేవ, అలసత్వ సేవ ప్రభువుకు నచ్చదు. ప్రభువును సేవిస్తున్నామని చెప్పుకునే వ్యక్తులు ఉన్నారు, కానీ ఆరాధనకు ఎప్పుడూ సమయానికి రారు. మనం ప్రభువును సమర్థతతో సేవించాలి మరియు కేవలం చేయడం కోసమే పనులు చేయకూడదు.

మన దేవుడు తన సింహాసనాన్ని చేరుకోవడానికి బానిసలు అవసరం లేదు; ఆయన ప్రేమ గల వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు మరియు ఆయన సేవకులు సంతోషం మరియు ఆనందం యొక్క రూపాన్ని ధరించాలి.

అపొస్తలుడైన పౌలు ఇలా సెలవిచ్చాడు, "ప్రేమతో ఒకరికొకరు సేవించండి." ఇది ఒక ముఖ్యమైన తాళం చెవి. 1 కొరింథీయులకు 13:3 ఇలా సెలవిస్తుంది, "నేను ఏమి చెప్పినా, నేను ఏమి నమ్మిన మరియు నేను ఏమి చేసినను, నేను ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు." (MSG)

దేవుని దూతలు ఆయనను నిట్టూర్పులు మరియు మూలుగులతో కాక, పాటలతో సేవిస్తారు. ప్రభువు హృదయాన్ని చూస్తాడు, మనం ఆయనకు ఇష్టపూర్వకమైన హృదయం నుండి సేవ చేస్తున్నామా లేదా బలవంతంగా సేవిస్తున్నామా అని గమనిస్తాడు. ఉల్లాసంతో అలంకరించబడిన సేవ హృదయ సేవ మరియు కాబట్టి అది దేవునికి నిజమైన సేవ.

ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, నేను నీకు అందుబాటులో ఉంటాను. నేను ఇక్కడ ఉన్నాను, యెహోవా నన్ను పంపుము.

తండ్రీ, నేను నీకు సరైన వైఖరితో సేవ చేయని సమయాల కోసం నన్ను క్షమించు. నేను ఎల్లప్పుడూ నీ నామాన్ని మహిమపరిచేలా సమర్థత గల ఆత్మను నాకు దయచేయి. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● యేసు నిజంగా ఖడ్గము పంపడానికి వచ్చాడా?
● 21 రోజుల ఉపవాసం: 4# వ రోజు
● 09 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● 05 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● ఒక కల దేవుని నుండి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి
● అనిశ్చితి సమయాలలో ఆరాధన యొక్క శక్తి
● మీరు ఒంటరితనంతో పోరాడుతున్నారా?
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್