english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. మాట్లాడే వాక్యం యొక్క శక్తి
ಅನುದಿನದ ಮನ್ನಾ

మాట్లాడే వాక్యం యొక్క శక్తి

Friday, 5th of April 2024
0 0 1350
Categories : వాక్యాన్ని ఒప్పుకోవడం (Confessing the Word)
బైబిల్లో ఆదికాండము 1:1లో, "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను." ఇంకా చెబుతూ, "మరియు భూమి నిరాకారము గాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను." (వచనం 2)

ఆదికాండము 1:1-2లో వివరించబడిన పరిస్థితి గందరగోళంగా వ్యక్తీకరించబడింది. మీరు దీన్ని చదివేటప్పుడు కూడా మీ జీవితం, మీ గృహం మరియు మీ వివాహం గందరగోళ పరిస్థితిలో ఉండవచ్చు. మీలో లోతైన ప్రశ్న ఇలా మొర్రపెడుతుంది, "నేను ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడగలను? నా కష్టాలకు ఎప్పటికైనా ముగింపు ఉంటుందా?" మంచి శుభవార్త ఏమిటంటే, మనం పరిష్కారాల కోసం వాక్యాన్ని చూడాలి.

అప్పుడు, "దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. (ఆదికాండము 1:3)

గమనించండి, దేవుడు మాట్లాడాడు మరియు అది వాస్తవికతలోకి వచ్చింది. ఇక్కడ ఒక శక్తివంతమైన సిద్ధాతం వైపు మీ దృష్టించాలని కోరుకుంటున్నాను.

సహజ మనిషి తాను చూడగలిగినవి, వినగలిగేవి, అనుభూతి చెందగలవి మొదలైనవాటిని మాట్లాడుతాడు. సహజ మనిషి తన నోటి నుండి ఇవన్నీ వ్యక్తపరుస్తాడు. అప్పుడు విత్తడం మరియు కోయడం యొక్క సిధ్ధాంతం ప్రకారం, అతడు ఏమి మరియు ఎలా భావిస్తాడు అనే దాని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే, అతడు అంత ఎక్కువగా దానిని పొందుతాడు.

అయితే, ఆధ్యాత్మిక మనిషి తన ఆత్మీయ మనిషిలోకి దేవుని వాక్యాన్ని పొందుతాడు మరియు అతని నోటి నుండి దానిని విడుదల చేస్తాడు. ఈ మాట్లాడే వాక్యానికి పరిస్థితులను మార్చే సృజనాత్మక శక్తి ఉంది. విశ్వాన్ని సృష్టించిన, రోగులను స్వస్థపరిచిన మరియు చనిపోయినవారిని లేపిన అదే సృజనాత్మక శక్తి. మాట్లాడే వాక్యానికి మన పరిస్థితులను మార్చగల మరియు మన అస్తవ్యస్తమైన లోకాలను పునఃసృష్టించే శక్తి ఉంది.

అయితే, దుష్టునికి ఈ సిధ్ధాంతం గురించి పూర్తిగా తెలుసునని మరియు దేవుడు చెప్పేది కాకుండా మీరు చూసే మరియు అనుభూతి చెందే వాటిని చెప్పేలా చేయడం ద్వారా వాడు మిమ్మల్ని అడ్డుకోవడానికి వాడు చేయగలిగినదంతా చేస్తాడని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ సమయంలో, చాలా మంది దేవుని వాగ్దానాల మీద ఆధారపడకుండా తమ భావాలను ప్రదర్శించడం ప్రారంభిస్తారు.

దుష్టుడు యొక్క ఈ తంత్రమును మనం ఎలా ఎదుర్కోవాలి?
మనం దీనిని ఎదుర్కోవడానికి మార్గం దేవుని వాక్యంలో మునిగిపోవాలి. మత్తయి 12:34-35లో పరిసయ్యులతో మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసయ్య ఇలా అన్నాడు, "సర్పసంతానమా, మీరు చెడ్డవారై యుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయ మందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. సజ్జనుడు తన మంచి ధన నిధిలో నుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధన నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును.

దేవుని వాక్యాన్ని మాట్లాడటం ఇది కొత్త వ్యామోహం మేమి కాదు మరియు దాని ప్రభావం మన స్థిరత్వంలో ఉంది. పరిణతి చెందిన క్రైస్తవులుగా మనం కేవలం ఉదయాన్నే మరియు ఆ తర్వాత రోజులో దేవుని వాగ్దానాలను మాత్రమే మాట్లాడకూడదు; ఒత్తిడి వచ్చినప్పుడు, మనకు అనిపించినది మాట్లాడాలి. బదులుగా, పరిస్థితిని గూర్చి దేవుడు చెప్పేది మాత్రమే నిమిష నిమిషానికి, గంట గంటకు, రోజు వారీగా నిలకడగా మాట్లాడేందుకు మనం నిరంతరం మన నోటికి కాపలా పెట్టుకోవాలి.
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, నాశనాన్ని తెచ్చే మాటలకు బదులుగా జీవాన్ని ఇచ్చే మాటలను ఎల్లప్పుడూ ఎంచుకోవడానికి నాకు సహాయం చేయి. నిస్సహాయ పరిస్థితుల్లో కూడా, విషయాలను మార్చగల శక్తి నీ వాక్యానికి ఉందని నేను నమ్ముతున్నాను.


Join our WhatsApp Channel


Most Read
● మీ ఆశీర్వాదాన్ని అభివృద్ధిపరిచే ఖచ్చితంగా మార్గం
● మీ అభివృద్ధిని పొందుకోండి
● అనిశ్చితి సమయాలలో ఆరాధన యొక్క శక్తి
● 19 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఇది ఒక్క పని చేయండి
● గుర్తింపు లేని వీరులు
● వివేకం పొందుట
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್