english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. భిన్నమైన యేసు, విభిన్న ఆత్మ మరియు మరొక సువార్త - I
ಅನುದಿನದ ಮನ್ನಾ

భిన్నమైన యేసు, విభిన్న ఆత్మ మరియు మరొక సువార్త - I

Monday, 22nd of April 2024
1 0 1532
Categories : మోసం (Deception) సిద్ధాంతం (Doctrine)
ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. (2 కొరింథీయులకు 11:4)

పై లేఖనంలో, అనుసరించడానికి దారి తప్పడం గురించి మనం హెచ్చరించబడ్డామని గమనించండి:
  • మరియొక యేసు
  • భిన్నమైన ఆత్మ
  • భిన్నమైన సువార్త

ఈరోజు, సంఘ ఆరాధనలు కూడా హాజరుకాని కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎందుకంటే వారు కొన్ని విదేశీ బోధనలతో తమ చెవులకు చక్కిలిగింతలు పెట్టడానికి చుట్టుపక్కల ఎవరినీ చూడలేకపోతున్నారు. కాబట్టి బదులుగా, వారు వాటిని "లోతుగా" తీసుకువెళ్లే కొన్ని బోధనల కోసం YouTubeని చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం!

ఇటీవల, ఒక పాస్టర్ గారు నన్ను సంప్రదించి, తన సభ్యుల ఇళ్లలో మోసపూరితంగా జరిగిన ఒక బోధకుల సెమినార్‌కు హాజరైన తర్వాత చాలా మంది తన సంఘాన్ని విడిచిపెట్టారని కన్నీళ్లతో చెప్పాడు. వాళ్ళ పాస్టర్ గారు అన్ని తప్పుడు విషయాలను బోధిస్తున్నాడని మరియు అతను మాత్రమే 'నిజమైన ప్రత్యక్షత'తో బోధిస్తాడని ఆ బోధకుడు వారికి చెప్పాడు.

కొత్త తప్పుడు సిద్ధాంతాలు, కొత్త తప్పుడు ప్రత్యక్షతలు మరియు కొత్త సువార్తలు దాదాపు ప్రతిరోజూ పుట్టుకొస్తున్నాయి. మరియు అది మరింత దిగజారబోతుంది. బైబిలు స్పష్టంగా హెచ్చరిస్తుంది అంత్య దినాలలో, మరొక యేసు, మరొక ఆత్మ, మరొక సువార్త యొక్క పరిచయం - వింత సిద్ధాంతాలు ముందుకు వస్తాయి. (2 కొరింథీయులు 11:4)

నేటికీ, యేసుక్రీస్తు ఒక ప్రధాన దూత మిఖాయేలు అని బోధించే ఒక సంస్థ (సిద్ధాంతం) ఉంది - దీనినే మరొక యేసును గురించి బోధించడం అని అంటారు.

లక్షలాది మంది అనుచరులను కలిగి ఉన్న మరొక సంస్థ, మన పాపాలన్నిటి నుండి మనల్ని రక్షించడానికి యేసు సిలువ త్యాగం సరిపోదని బోధిస్తుంది, కాబట్టి ఎవరైనా మరణించిన వ్యక్తి

'పుర్గేటరీ (పాప ప్రాయశ్చిత్త స్థలం)'కి వెళ్లి ప్రాయశ్చిత్తం చేసి వారి ఆత్మలను శుద్ధి చేసుకోవాలని - దీనినే మరొకటి సువార్త అని అంటారు.

"మరియొక సువార్త" అనే పదానికి అర్థం వక్రీకరించడం (ఒక విషయాన్ని తప్పుదారి పట్టించడం). సువార్తను వక్రీకరించే వారు, వ్యక్తి యొక్క స్వభావాన్ని మరియు క్రీస్తు యొక్క కార్యమును వక్రీకరిస్తూ, మార్పులు చేర్పులు చేయడం ద్వారా దానిని నాశనం చేస్తారు.

మళ్ళీ, పరిశుద్ధాత్మ అనేది సర్వశక్తిమంతుడైన దేవుని అదృశ్య 'శక్తి' అని అది ఒక వ్యక్తి కాదని బోధించే ఈ సంస్థ ఉంది - దీనినే భిన్నమైన ఆత్మ అని అంటారు.

ఈ రోజు, "పరిశుద్దాత్మ నన్ను ఇలా చేయడానికి నడిపించింది, పరిశుద్దాత్మ నన్ను ఇలా నమ్మేలా చేసింది..." అని ప్రజలు చెప్పడం చాలా సాధారణం. ఇలాంటి కలవరం అనేది ప్రజలు తమ స్వంత "మానవ ఆత్మ" వినడం వల్ల మాత్రమే జరిగే పరిమాణం, మనం చేయవలసింది ఏమిటంటే, పరిశుద్దాత్మ మొదటి స్థాయిలో వెల్లడించిన దేవుని వాక్యానికి తిరిగి చేరుకోవడమే. మీరు వింటున్నది దేవుని వాక్యానికి అనుగుణంగా లేకుంటే, మీరు మరియొక ఆత్మను వింటున్నారు.

ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, నీ వాక్యం నా హృదయాన్ని బలపరచి మరియు నా హృదయాన్ని మార్చును గాక. సరైన వ్యక్తులతో జతపరచడానికి నాకు సహాయం చేయి. నన్ను మరియు నా కుటుంబాన్ని తప్పుడు సిద్ధాంతాల నుండి కాపాడు. యేసు నామంలో. ఆమెన్!


Join our WhatsApp Channel


Most Read
● ఆత్మలను సంపాదించుట – ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది?
● దుష్టాత్మల ప్రవేశ ద్వారాన్ని మూసివేయడం - III
● నిరుత్సాహం యొక్క బాణాల మీద విజయం పొందడం - II
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
● దేవుడు ప్రతిఫలము ఇచ్చువాడు
● స్వతహాగా చెప్పుకునే శాపాల నుండి విడుదల
● దేవుని పరిపూర్ణ చిత్తానికై ప్రార్థించండి
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್