english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. నిరుత్సాహం యొక్క బాణాల మీద విజయం పొందడం - I
ಅನುದಿನದ ಮನ್ನಾ

నిరుత్సాహం యొక్క బాణాల మీద విజయం పొందడం - I

Tuesday, 11th of June 2024
0 0 1214
Categories : విడుదల (Deliverance)
దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. (1 సమూయేలు 30:6)

ఏదో ఒక రూపంలో నిరాశను ఎదుర్కోనని వ్యక్తి ఈ భూమి మీద ఉండడు. మన ప్రణాళికల ప్రకారం విషయాలు జరగనప్పుడు, మనము నిరాశ మరియు నిరుత్సాహానికి గురవుతాము. నిరుత్సాహాన్ని మొగ్గలో తుంచేయకపోతే త్వరలో నిరుత్సాహం అనేది పెరుగుతుంది. నిరుత్సాహానికి మూలం నిరాశ. ఈ అంత్య దినాలలో, నిరుత్సాహం అనేది తన ప్రధాన శత్రువులైన దేవుని పిల్లలను కుంగదీయడానికి దుష్టుడు ఉపయోగించే ప్రధాన ఆయుధం.

అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును (ఆయన కుమారుని) పరిశుద్ధాత్మతోను మరియు బలం మరియు సామర్థ్యం మరియు శక్తితో అభిషేకించి, ప్రతిష్ఠించెను. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు, అపవాదిచేత (శక్తి ద్వారా) పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. (అపొస్తలుల కార్యములు 10:38)

తన లోకసంబంధమైన పరిచర్య సమయంలో, యేసుప్రభువు ప్రజలను అపవాది యొక్క శక్తి నుండి విడిపించడానికి చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. మంచి శుభవార్త ఏమిటంటే, నిరుత్సాహానికి దూరంగా నిలబడే ఇదే శక్తి మనందరికీ అందుబాటులో ఉంది. మీరు నిరుత్సాహంలో కూరుకుపోవడం దేవుని చిత్తం కాదని తెలుసుకోండి. మీరు అణచివేయబడటం మరియు నిరాశ చెందడం దేవుని చిత్తం కాదు.

నిరుత్సాహం యొక్క ప్రధాన ప్రమాదాలలో ఒకటి ఏమిటంటే, ఒక వ్యక్తి నిరుత్సాహానికి గురైనప్పుడు, అతడు లేదా ఆమె అదే స్థలంలో; అదే స్థాయిలో ఉంటారు. స్తబ్దత (చలనములేమి) మరియు పరిమితులు త్వరలో ఏర్పడతాయి. అలాంటి వ్యక్తి దేవుడు తనలో నిక్షిప్తం చేసిన కల మరియు దర్శనం కొనసాగించలేడు. నా పరిచర్యలో, నిరుత్సాహం అనే బాణాల దాడికి గురైన అనేక మంది వ్యక్తులను నేను చూశాను.

మీరు ఈ సందేశాన్ని చదువుతున్నప్పుడు ఇప్పుడే యేసు నామంలో విజయం పొందే అభిషేకం మీ మీదికి వచ్చును గాక.

ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, యేసు నామంలో, నాకు వ్యతిరేకంగా నిరుత్సాహపరిచే ప్రతి బాణం యేసు నామంలో అగ్నిచే నరికివేయబడును గాక.

యేసు నామంలో, నాకు వ్యతిరేకంగా ప్రతి విధమైన నిరుత్సాహాన్ని మరియు వైఫల్యాన్ని నేను తిరస్కరిస్తున్నాను.

తండ్రీ, యేసు నామంలో, నీవు నన్ను చేయమని పిలిచిన కార్యములను కొనసాగించడానికి ధైర్యం మరియు సాహసం యొక్క ఆత్మకై నేను నిన్ను వేడుకుంటున్నాను.


Join our WhatsApp Channel


Most Read
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 4
● గతం యొక్క సమాధిలో భూస్థాపితం కావద్దు
● అంతిమ భాగాన్నిగెలవడం
● ఉపవాసం యొక్క జీవితాన్ని మార్చే ప్రయోజనాలు
● దేనికి కాదు డబ్బు
● ఆయన్ని వెతకండి మరియు మీ యుద్ధాన్ని ఎదుర్కోండి
● కొండలు మరియు లోయల దేవుడు
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್