english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు?
ಅನುದಿನದ ಮನ್ನಾ

మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు?

Tuesday, 2nd of July 2024
0 0 979
Categories : భావోద్వేగాలు (Emotions)
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా? ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యాకాండము 23:19)

"మీ మనసు (హృదయం) మాట వినండి", "మంచిది అనిపిస్తే అదే చేయండి" పిల్లల కార్టూన్‌ల నుండి లౌకిక పాటల వరకు సినిమాల వరకు ఇలాంటి సందేశాలను మనం నిరంతరం వింటుంటాము. ఈ రోజు మనం జీవిస్తున్న సమాజం మనల్ని బాగా ప్రోత్సహిస్తుంది మరియు మనం ఎలా భావిస్తున్నామో దాని ఆధారంగా మన ఎంపికలు మరియు జీవిత-నిర్ణయాలను తీసుకోవాలనే వాస్తవాన్ని ప్రోత్సహిస్తుంది.

ఇవన్నీ మంచివిగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, అలాంటి మనస్తత్వాన్ని అవలంబించడం మన ఆధ్యాత్మిక శ్రేయస్సుకు వినాశకరమైనది. బైబిలు మనల్ని ఇలా హెచ్చరిస్తోంది, "హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోర మైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?" (యిర్మీయా 17:9)

మన భావాలు మరియు భావోద్వేగాలు మన జీవితాలను శాసించటానికి అనుమతించినప్పుడు, మనం చాలా తెలివితక్కువ, భక్తిహీనమైన, వ్యక్తిగత-కేంద్రీకృత నిర్ణయాలు తీసుకుంటాము మరియు మన జీవితాలను గందరగోళానికి గురిచేస్తాము. మన హృదయాను సారంగా నడుచుకోవడం ద్వారా లొంగిపోవడానికి బదులుగా స్వార్థపూరిత వైఖరిని మాత్రమే అది పెంపొందిస్తుంది.

మన భావాలు మరియు భావోద్వేగాలచే మనం నియంత్రించబడితే మనం క్రీస్తుకు నిజమైన దాసులు కాలేము. యాకోబు 1:6-8 తన జీవితాన్ని పూర్తిగా భావోద్వేగాలు మరియు భావాలతో నడిపించే వ్యక్తి గురించి స్పష్టంగా వివరిస్తుంది. "అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి యెగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచు కొనరాదు."

భావాలు మరియు భావోద్వేగాలచే నడిపించబడిన వ్యక్తి ఎప్పటికీ స్థిరత్వాన్ని సాధించలేడు. అలాంటప్పుడు దానికి పరిష్కారం ఏమిటి?తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును (సామెతలు 28:6). ఈ రోజు నుండి, దేవుని జ్ఞానంలో (అది ఆయన వాక్యాను సారంగా) నడవడానికి ప్రతి ప్రయత్నం చేయండి.

మీ జీవితం దీవించబడుతుంది మరియు అతి త్వరలో, మీరు చాలా మందికి దీవెనకరంగా అవుతారు.
ಪ್ರಾರ್ಥನೆಗಳು
యెహోవా, నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. యేసు నామంలో. (కీర్తనలు 5:8 ఆధారంగా)

Join our WhatsApp Channel


Most Read
● మనస్తాపం ఆధ్యాత్మిక దృష్టిని వక్రీకరిస్తుంది
● ఇది ఒక్క పని చేయండి
● గొప్ప విజయం అంటే ఏమిటి?
● కలవరాన్ని అధిగమించడానికి క్రియాత్మకమైన మార్గాలు
● సంపూర్ణ బ్రాండ్ మేనేజర్
● మంచి మనస్సు ఒక బహుమానం
● లైంగిక శోధనపై ఎలా విజయం పొందాలి
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್