english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. అగ్ని తప్పక మండుచుండాలి
ಅನುದಿನದ ಮನ್ನಾ

అగ్ని తప్పక మండుచుండాలి

Tuesday, 20th of August 2024
0 0 1373
Categories : దేవునితో సాన్నిహిత్యం (Intimacy with God) ప్రార్థన (Prayer)
లేవీయకాండము 6:12-13 మనకు సెలవిస్తుంది, "బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలువేసి, దానిమీద దహనబలి ద్రవ్యమును ఉంచి, సమాధానబలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠముమీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు."  

బలిపీఠం అంటే ఏమిటి?

ఒక బలిపీఠం అంటే మార్పిడి స్థానం. ఇది ఆధ్యాత్మిక మరియు సహజ మధ్య జరిగే సమావేశ స్థానం, దైవత్వం మరియు మానవత్వం మధ్య జరిగే సమావేశ స్థానం. బలిపీఠం అంటే దేవుడు మానవుని కలుసుకునే ప్రదేశం. బలిపీఠం అంటే గమ్యస్థానాలు మార్చే ప్రదేశం.

పాత నిబంధనలో, బలిపీఠం అనేది భౌతిక స్థలం. మీరు దేవుని కలవవలసి వస్తే, మీరు ఎక్కడ పడితే అక్కడ కలువలేరు; మీరు ఖచ్చితంగా ఈ బలిపీఠం వద్దకు వెళ్ళవలసి ఉంటుంది. మీరు బలి అర్పణలు చేయవలసి వస్తే, మీరు ఈ ప్రదేశానికి బలి ఇవ్వడానికి వెళ్ళవలసి ఉంటుంది.

అయితే, క్రొత్త నిబంధనలో, బలిపీఠం ఒక ఆధ్యాత్మిక స్థలం. మానవుని ఆత్మ దేవుని ఆత్మను కలుసుకునే స్థలం. ప్రభువైన యేసు ఈ రకమైన బలిపీఠాన్ని మత్తయి 18:20 లో స్పష్టంగా వివరించాడు, "ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను." మరో మాటలో చెప్పాలంటే, మీరు యెహోవా నామాన్ని ఏ స్థలం నుండి మొఱ్ఱపెట్టిన, ఆ స్థలం ఒక బలిపీఠం అవుతుంది.

ఒక బలిపీఠం కోసం మరొక అవసరత ఉంది. దేవుడు ఇలా అన్నాడు, "బలిపీఠం మీద ఎప్పుడూ అగ్ని మండుచుండాలి" అగ్ని లేని బలిపీఠం దేవునికి అయిష్టంగా ఉంటుంది.

ఇశ్రాయేలు ప్రభువు నుండి దూరమయ్యాక, ప్రభువు యొక్క బలిపీఠం నిర్లక్ష్యం చేయబడింది మరియు విచ్ఛిన్నమైంది. దేవుని బలిపీఠాలపై తాజా అగ్ని లేదు. దీని ప్రభావం ఏమిటంటే దేశం మొత్తం పాపంగా మారిపోయింది.

దేవుడు అగ్ని ద్వారా సమాధానం చెప్పి ఇశ్రాయేలు జాతిని తన వైపుకు తిప్పుకొవడానికి ముందు, బలిపీఠం బాగు చేయవలసి వచ్చింది. "మరియు ఏలీయా క్రింద పడి ద్రోయబడియున్న యెహోవా బలిపీఠాన్ని బాగు చేశాడు." (1 రాజులు 18:30) దేవుని అగ్ని ఎప్పుడూ క్రింద పడి ద్రోయబడియున్న బలిపీఠం మీద మండదు.

బలిపీఠం బాగు చేయడం అంటే ప్రభువుతో మనకున్న సంబంధం. ప్రభువుతో మన సంబంధం దేవుని వాక్యం మరియు ప్రార్థన ద్వారా నిర్మించబడి ఉంది.

బలిపీఠాన్ని బాగు చేయడం అనేది మన జీవితాలలో, కుటుంబాలలో మరియు సంఘాలలో నిజమైన ఆరాధనను పునరుద్ధరించడం ద్వారా ప్రతి రకమైన రాజీలను శుద్ధికరించడం ద్వారా మరియు ప్రభువైన యేసుకు మనల్ని తిరిగి సిఫార్సు చేయడం ద్వారా ఉంటుంది. హోషేయ 6:1 మనకు ఇలా ఉపదేశిస్తుంది: "మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును."
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, యేసు నామములో, నీ అగ్ని నాపై వచ్చును గాక మరియు నా జీవితంలో అవాంఛనీయమైన ప్రతి వస్తువును తిసివేయును గాక. దేవుని మహిమ ఇప్పుడు యేసు నామంలో వెల్లడిపరుచును గాక.

తండ్రీ, యేసు నామంలో, నా ప్రార్థన బలిపీఠాన్ని నీ అగ్ని ద్వారా శక్తివంతం చేయి. పరిశుద్ధాత్మ అగ్ని, యేసు నామంలో నింద మరియు అంధకార గొలుసుల యొక్క ప్రతి వస్త్రాన్ని నాశనం చేయి.

పరిశుద్ధాత్మ యొక్క అగ్ని యేసు నామంలో నాకు వ్యతిరేకంగా ప్రతి సాతాను వ్యతిరేకతను తిసివేబడును గాక.

తండ్రీ, యేసు నామములో, కరుణ సదన్ పరిచర్యతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తిపై నీ పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఉండును గాక.

Join our WhatsApp Channel


Most Read
● అంతిమ రహస్యము
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #1
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 4
● కలవరము యొక్క ప్రమాదాలు
● శూరుల (రాక్షసుల) జాతి
● క్రీస్తు కేంద్రంగా ఉన్న ఇల్లును (గృహం) నిర్మించడం
● 12 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್