english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. యూదా జీవితం నుండి పాఠాలు - 2
ಅನುದಿನದ ಮನ್ನಾ

యూదా జీవితం నుండి పాఠాలు - 2

Thursday, 24th of October 2024
0 0 734
Categories : పాపం (Sin)
మనము మన సిరీస్‌లో కొనసాగుతాము: యూదా జీవితం నుండి పాఠాలు
లేఖనము దేనినీ గురించి దాచదు. బైబిల్ స్పష్టంగా తేలియాజేస్తుంది "వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి" (రోమీయులకు 15:4)

యూదా జీవితం నుండి నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి - చివరి అంచున, ద్రోహం చేసిన యేసు ప్రభువుకు అత్యంత సన్నిహితుడైన అపొస్తలులలో ఒకడు.

యూదా పడిపోవడానికి మరొక కారణం:
2. ఒప్పుకోని పాపం
ఒప్పుకోని పాపం మన ఆత్మల శత్రువు - సాతానుకు ఎల్లప్పుడూ ద్వరామును తెరిచి ఉంచుతుంది.

అచ్చం జటామాంసి అత్తరు గల స్త్రీ యేసు తలపై నూనె పోసినప్పుడు, ఇస్కరియోతు యూదా మనస్తాపం చెందాడు మరియు అలాంటి వ్యర్థమైన వాటిని నివారించవచ్చని మరియు పేదలకు ఆ డబ్బు నుంచి ఇయవచ్చని ఒక ప్రకటన చేశాడు.

(యూదా) వాడీలాగు చెప్పినది బీదల మీద శ్రధ్ధకలిగి కాదుగాని వాడు దొంగయై యుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. (యోహాను 12:6)

నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, లేఖనము మానవుని బలహీనతలను ఎన్నడూ దాచదు కానీ వాటిని బహిర్గతం చేస్తుంది, తద్వారా మానవుడు పశ్చాత్తాపం చెంది మరియు అతని మార్గాము నుండి తిరగడానికి వీలుంటుందని. స్పష్టంగా, యూదాకు 'డబ్బు-ప్రేమ (ధనాపేక్ష)' సమస్య ఉంది. (1 తిమోతి 6:10), దాని నుండి, దుష్టుడు తన జీవితంలో ఒక బలమైన కోటను నిర్మించాడు.

వ్యభిచారంలో జీవిస్తున్న సమరయ స్త్రీతో యేసు మాట్లాడటం మరియు ఆమె జీవిత మార్పును యూదా చూశాడు. పాపులతో యేసయ్య ఎంత కృపతో వ్యవహరించాడో కూడా అతడు చూశాడు. అతడు తన బలహీనత గురించి యేసయ్యతో సులభంగా మాట్లాడగలడు, మరియు దానిని అధిగమించడానికి ఖచ్చితంగా ప్రభువు అతనికి సహాయపడేవాడు. కానీ యూదా ఈ విషయాన్ని దాచిపెట్టాడు మరియు ఎప్పుడూ తాను ఎవరో కాదు అన్నటుగా నటించాడు.

బైబిల్ దాని గురించి స్పష్టంగా తేలియాజేస్తుంది. "తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును" (సామెతలు 28:13)

యూదా ఒప్పుకోని పాపం సాతానుకు ద్వరామును తెరిచి ఉంచింది. అప్పుడు సాతాను ఇస్కరియోతు యూదాలోకి ప్రవేశించాడు. (లూకా 22:3–4)
సిమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాను ద్రోహం చేయడానికి దుష్టుడు అప్పటికే అతని హృదయంలో ఆలోచన పుట్టించాడు. (యోహాను 13:2)
 సాతానుకు ద్వరామును తెరిచి ఉంచి, ప్రభువుకు ద్రోహం చేసిన ఇస్కరియోతు యూదా.

మొదటి యోహాను 1:9 ఇలా సెలవిస్తుంది, "మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును." ఈ రోజు, మీ బలహీనతలను యేసయ్యకు ఎందుకు చెప్పకూడదు. వాటిని జయించడానికి ఆయన ఖచ్చితంగా కృపను ఇస్తాడు.
ಪ್ರಾರ್ಥನೆಗಳು
1. తండ్రీ, నా బలహీనతను నీ యందు ఒప్పుకుంటున్నాను. (దీనిని చేస్తు ఉండగా కొంత విలువైన సమయాన్ని గడపండి)

2. తండ్రీ, రేపు రాబోయే వాటి కోసం ఈరోజు నుండే సిద్ధం అవ్వడానికి నీ జ్ఞానం మరియు కృపను నాకు దయచేయి. నీవు యోసేపుకు సమృద్ధిగా ఉన్న సమయాల్లో కరువు నుండి దూరంగా ఉండడానికి సహాయం చేసినట్లే; చీమ సిద్ధం చేసిన ధాన్యమును శీతాకాలం కోసం నిల్వ చేసినట్లే, నాకు అలాంటి దూరదృష్టిని ప్రసాదించు తండ్రి భవిష్యత్ వ్యయంతో ఈనాటి ఉత్కంఠ భరితమైన జీవితాన్ని నేను నిరాకరిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్

Join our WhatsApp Channel


Most Read
● కృప చూపించడానికి క్రియాత్మకమైన మార్గాలు
● 7 అంత్య దినాల యొక్క ప్రధాన ప్రవచనాత్మక సూచకక్రియలు: #1
● 03 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● శూరుల (రాక్షసుల) జాతి
● హామీ గల సంతృప్తి
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #14
● దేవుని ప్రేమను అనుభవించడం
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್