english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. అత్యంత సాధారణ భయాలు
ಅನುದಿನದ ಮನ್ನಾ

అత్యంత సాధారణ భయాలు

Tuesday, 19th of November 2024
0 0 1053
Categories : భయం (Fear) విడుదల (Deliverance)
మీరు దేనికి ఎక్కువగా భయపడుతున్నారు?
కొన్ని సంవత్సరాలుగా, ఆరాధన తర్వాత, 'భయం' అనే అంశంపై నేను బోధించినప్పుడల్లా, నేను తరచుగా ప్రజలను అడుగుతాను, "మీరు దేనికి ఎక్కువగా భయపడుతున్నారని?"

నేను విభిన్న సమాధానాలను అందుకున్నాను - కొన్ని హాస్యమైనవి మరియు కొన్ని చాలా ఆలోచనాత్మకమైనవి. ప్రజలు భయపడే అనేక విషయాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మూడు అత్యంత సాధారణ భయాలు ఉన్నాయి:

అత్యంత సాధారణ భయాలు
1. బహిరంగంగా మాట్లాడటం
వృత్తి లేదా భౌగోళిక స్థానంతో సంబంధం లేకుండా, వాస్తవంగా చాలా మంది ప్రజలు ఒక గుంపు ముందు మాట్లాడటానికి భయపడతారు.

ఒక కాపరిగా, నాయకులను తయారు చేయడం నాకు చాలా ఇష్టం. ఏదేమైనా, నేను ముందుకు వచ్చి ప్రార్థన చేయమని, వాక్యం మొదలైన వాటిని పంచుకోవాలని ప్రజలను ఆహ్వానించినప్పుడు, కొందరు ఈ భయం కారణంగా పూర్తిగా తిరస్కరించారు. ఈ రకమైన భయం వారి ఆధ్యాత్మిక ఎదుగుదలను నిర్వీర్యం చేసింది.

2. నిరాకరించుట అనే భయం

నిరాకరించుట అనే భయం ప్రాథమికంగా 'లేదు' (కుదరదు) అనే పదాన్ని వినడం ద్వారా లేదా కలిగి ఉన్న ఆలోచనలు నిరాకరించడం ద్వారా వస్తుంది.

జీవిత భాగస్వామి కోసం చూస్తున్న వ్యక్తులలో ఈ ప్రతిస్పందన చాలా ప్రబలంగా ఉంది. వివాహ ప్రతిపాదన కోరుతూ 11 సార్లు నిరాకరించబడ్డాను అని తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని ఒక యువతి నాకు వ్రాసినట్లు నాకు గుర్తుంది.

ఆమె కోసం ప్రార్ధించిన తర్వాత, ఆమె భయాన్ని ఎదుర్కోమని నేను ఆమెకు సలహా ఇచ్చాను. మంచి శుభవార్త ఏమిటంటే, ఈరోజు ఆమె సంతోషంగా వివాహం చేసుకుంది.

నిరాకరించుట అనే భయం కూడా అమ్మకదారులలో, ముఖ్యంగా కాల్‌లు చేసేవారిలో కూడా చాలా సర్వ సాధారణం.

3. వైఫల్యం యొక్క భయం

యేసు బోధించిన తలాంతులు యొక్క ఉపమానం నాకు గుర్తుకు వచ్చింది. యజమాని తన ప్రతి పనివారికి "తన సామర్థ్యానికి అనుగుణంగా" పెట్టుబడి పెట్టడానికి తలాంతులను ఇచ్చాడు.

ఇద్దరు వ్యక్తులు తెలివిగా పెట్టుబడి పెట్టారు. అయితే, మూడవ వ్యక్తి తన తలాంతులను పాతిపెట్టాడు. యజమాని తిరిగి వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ఇలా అన్నాడు:

తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి -- "అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగుదును గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను." (మత్తయి 25:24-25)

ఆ వ్యక్తి ఎందుకు పెట్టుబడి పెట్టలేదని జాగ్రత్తగా గమనించండి - అతడు వైఫల్యానికి భయపడ్డాడు.

మనం దేవుని శక్తిని ఎక్కువగా అనుభవించకపోవడానికి మరియు ఆయన అద్భుతాలను చూడక పోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, మనం వైఫల్యానికి భయపడతాం. దుర్మార్గపు సేవకుడిలాగే, మనము మన అవకాశాలను భూమిలో పాతిపెడతాము మరియు తరువాత ఏమీ జరగదు కాబట్టి సణుగుతాము.

వైఫల్యం భయం చాలా మంది విద్యార్థులను వేధించింది మరియు వారి గమనములో ఎదగకుండా ఆపింది.

నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి. మీరు సంపూర్ణులును, అనూ నాంగులును,ఏ విషయములోనైనను కొదువ లేనివారునై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. (యాకోబు 1:2-4)

వైఫల్యంతో నిరుత్సాహపడకండి. మీరు నిష్క్రమించినప్పుడు మాత్రమే విజయం అసాధ్యం - కాబట్టి వెనుకకు తిరుగవద్దు. ప్రభువు మన పక్షాన ఉన్నాడు.
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, యేసు నామంలో, భావోద్వేగాలపై ఆధారపడకుండా విశ్వాసం ద్వారా నడవడానికి నీ కృపకై నేను నిన్ను వేడుకుంటున్నాను.

Join our WhatsApp Channel


Most Read
● పరీక్షలో విశ్వాసం
● 40 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● పరధ్యానం యొక్క గాలుల మధ్య స్థిరంగా (ఉండుట)
● సర్పములను ఆపడం
● క్రైస్తవులు దేవదూతలను ఆజ్ఞాపించవచ్చా?
● 17 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మీ ఆధ్యాత్మిక బలాన్ని ఎలా నూతనముగా చేయాలి - 1
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್