english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. ఇతరుల కోసం ప్రార్థించడం
ಅನುದಿನದ ಮನ್ನಾ

ఇతరుల కోసం ప్రార్థించడం

Friday, 3rd of January 2025
0 0 549
Categories : ప్రార్థన (Prayer) మధ్యస్త్యం (Intercession)
దాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కార ముగా పట్టుకొని, 2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. 3 ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. 4 అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలి యుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెన. 5 పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. (అపొస్తలుల కార్యములు 12:1-5)

పై లేఖనములో, అపొస్తలుడైన యాకోబు చంపబడినట్లు మనకు తెలియజేయబడింది. అయినప్పటికీ, అపొస్తలుడైన పేతురు దేవుని మహా ప్రమేయం ద్వారా రక్షించబడ్డాడు. ప్రభువు యొక్క దూత ఆ జైలు గదిలోకి వచ్చి మరియు పేతురును జైలు నుండి బయటకు తీసుకువెళ్ళింది.

తేడా ఏమిటి?
యాకోబు ఎందుకు చంపబడ్డాడు కానీ పేతురు ఎందుకు రక్షించబడ్డాడు?
ముఖ్యమైన కారణాలలో ఒకటి ఇదని నేను నమ్ముతున్నాను, "పేతురు జైలులో ఉన్నప్పుడు, సంఘమంతా అతని కోసం హృదయపూర్వకంగా ప్రార్థించింది."

ప్రార్థన యొక్క శక్తిని మన జీవితాల కోసం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నవారి కోసం గుర్తించబడడం చాలా ముఖ్యం. మన దేశంలో మరియు మన సంఘంలో మన నాయకుల కోసం ప్రార్థించమని లేఖనాలలో మనకు ఆజ్ఞాపించబడింది. మనము ఒకరికొకరు ప్రార్థించకోవాలని ఆజ్ఞాపించబడ్డాము.

క్రీస్తు శరీరం వలె మనం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాము, మరియు ఆ సవాళ్లలో చాలా వరకు తీక్షమైన మధ్యసత్య ప్రార్థన లేకపోవడం వల్ల కావచ్చు.

సంవత్సరాలుగా, నేను గమనిస్తున్నాను, ఒక ప్రవచనాత్మక, స్వస్థత లేదా విడుదల సభ ఉంటే, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అయితే, అది మధ్యసత్య ప్రార్థన సభ అయినప్పుడు, పాలుగోనేవారు చాలా అరుదుగా ఉంటారు. మన మందరం లోతైన గుంటలలో ఉన్నప్పుడు ఎవరైనా మరియు ప్రతిఒక్కరూ మన కోసం ప్రార్థించాలని మనమందరం కోరుకుంటాము, కానీ పాపం ప్రార్థన కోసం ఇతరులు లైన్‌లో ఉన్నప్పుడు మనము సమాధానం ఇవ్వము.

కాబట్టి, మన పాస్టర్లు, సంఘ నాయకులు, క్రీస్తులోని సోదరులు మరియు సోదరీమణులు లేదా మరెవరికైనా కోసం ప్రభువు మన హృదయాలలో ఏమి ఉంచాడో దాని గురించి ప్రార్థిదాం, మనం ప్రార్థిస్తున మన వ్యక్తిగత జీవితం లాగా, హృదయపూర్వకంగా ప్రార్థిదాం.

మాట్లాడడం చౌకగా ఉంటుంది, కానీ మన కోసం కాకుండా ఇతరుల కోసం మన ప్రార్థన జీవితాన్ని ముందుకు తీసుకు వెళాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన ఆత్మ పిలుపుకు మీరు సమాధానం ఇస్తారా?

Bible Reading : Genesis 8 -11
ಪ್ರಾರ್ಥನೆಗಳು
1. అవమానమునకు బదులుగా, నేను రెట్టింపు ఘనతను పొందుతాను, మరియు నిందకు బదులుగా, నేను నా భాగము గురించి సంతోషిస్తాను. (యెషయా 61:7)

2. నా రక్తసంబంధం ద్వారా సంక్రమించిన పూర్వీకుల శాపాలు యేసు నామంలో యేసు రక్తం ద్వారా శాశ్వతంగా విచ్చినం అవునుగాక.

3. నా సంపద, ఉద్యోగం, వ్యాపార పరిచయాలు, పదోన్నతి లేదా అభివృద్ధి నన్ను గుర్తించకుండా నిరోధించడానికి శత్రువు ప్రతి చీకటి నీడను నా మీద పడేశాడు, నేను దానిని యేసు నామంలో అగ్ని ద్వారా విచ్చినం చేస్తున్నాను.



Join our WhatsApp Channel


Most Read
● అప్పు ఊబి నుండి బయటపడండి: తాళంచెవి # 1
● ముందుగా యూదా వంశస్థులను వెళ్లనివ్వండి
● అసాధారణమైన ఆత్మలు
● శక్తివంతమైన మూడు పేటల త్రాడు
● మూర్ఖత్వం నుండి విశ్వాసాన్ని వేరు చేయడం
● సర్వశక్తిమంతుడైన దేవునితో కలుసుకోవడం
● ఎంత వరకు?
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್