english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. దేవుడు ఇచ్చిన ఉత్తమ వనరు
ಅನುದಿನದ ಮನ್ನಾ

దేవుడు ఇచ్చిన ఉత్తమ వనరు

Wednesday, 15th of January 2025
0 0 578
Categories : సంబంధాలు (Relationships) స్వభావం (Character)
మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, 
ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.......
సమస్తమును నీవలననే కలిగెను గదా? (1 దినవృత్తాంతములు 29:13-14)


దేవుడు మనకు ఇచ్చిన ఉత్తమ వనరులలో ఒకటి ప్రజలు. ఈ సున్నితమైన మరియు విలువైన వనరును మీరు ఎలా నిర్వహిస్తారో అది మీ గురించి చాలా విషయాలు వెల్లడిస్తాయి.

ప్రభువైన యేసు పరస్పర సంబంధాలపై చాలా మాట్లాడారు. ఒక సందర్భంలో, ఆయన ఇలా అన్నాడు, "నీవు ఒక విందు ఏర్పాటు చేసినప్పుడు, నీ స్నేహితులు, బంధువులు లేదా ధనవంతులైన పొరుగువారిని ఆహ్వానించవద్దు - ఎందుకంటే వారు ఆ ప్రత్యుపకారము తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఆహ్వానం లేని వారిని ఆహ్వానించడం మంచిది.

బహిష్కృతులు, వికలాంగులు మరియు అంధులతో పాటు పేదలను నీ విందుకి ఆహ్వానించు - నీకు ఎన్నడూ ప్రత్యుపకారము చేయలేని వారు. అప్పుడు నీవు ఈ జీవితంలో గొప్ప దీవెనను అనుభవిస్తావు, మరియు నీతిమంతుల పునరుత్థాన మందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను." (లూకా 14:12-14)

ధనవంతులు మరియు ప్రసిద్ధులు మన చుట్టూ ఉన్నప్పుడు, మనము మన ఉత్తమ ప్రవర్తనను చూపిస్తాము. మీరు వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తారో, ప్రత్యేకించి మీ కోసం లేదా మీ కోసం ఏమీ చేయలేని వారు - సాధారణ వ్యక్తుల పట్ల మీ స్వభావము కనిపిస్తుంది. మీరు పేదలు, నిస్సహాయుల పట్ల ఎలా వ్యవహరిస్తారనే దానిలో నిజమైన స్వభావము కనిపిస్తుంది.

మీరు అనుదిన వ్యక్తులతో మాట్లాడే విధానంలో మరొక స్వభావము కనిపిస్తుంది - మీ జీవిత భాగస్వామి, మీ తల్లిదండ్రులు. మనలో చాలా మంది దీనిని ఒప్పుకోకపోవచ్చు, కానీ మనం సాధారణ వ్యక్తులతో ఉన్నప్పుడు మన ప్రవర్తన మరియు మాటలలో చాలా సాధారణంగా ఉంటుంది. తెలిసి లేదా తెలియకుండానే వారు చుట్టూ లేనప్పుడు మనం వారిని తీవ్రంగా మిస్ అవుతున్నామని మాత్రమే మనం అర్థం చేసుకుంటున్నామా?

సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై యుండకుడి. ఏలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన యొకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన యెడల, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి, ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండుమని చెప్పిన యెడల, మీ మనస్సులలో భేదములు పెట్టుకొనిమీరు దురాలోచనతో విమర్శచేసినవారగుదురు కారా? (యాకోబు 2:1-4)

బహుశా మీరు వ్యాపారంలో ఉండవచ్చు, లేదా కార్యనిర్వాహకుడు లేదా సంఘా నాయకుడు కూడా కావచ్చు. మీరు ఎవరైతే నేమి, ప్రజలతో మంచిగా వ్యవహరించడాన్ని ఒక బిందువుగా చేసుకోండి. వారు మీ మంచితనానికి ప్రతిస్పందించవచ్చు లేదా ఉండకపోవచ్చు; అది పెద్ద విషయమే కాదు. మీరు మారుతున్నారు, అది చాలా ముఖ్యం.

Bible Reading : Genesis 42 - 44
ಪ್ರಾರ್ಥನೆಗಳು

తండ్రీ దేవా, ఇతరుల పట్ల ప్రేమ, నిరీక్షణ మరియు చిత్తశుద్ధితో ఉండడానికి నన్ను ఒక ఉదాహరణగా చేయి. నీ మార్గాములను నాకు బొంధించు. ఇతరుల పట్ల దయాళుత్వముతో, మంచితనముతో మరియు గౌరవంగా ఉండేలా నీ ఆత్మ ద్వారా నన్ను శక్తివంతం చేయి. సరైన వ్యక్తులతో నన్ను చుట్టుముట్టు. యేసు నామంలో. ఆమెన్.


Join our WhatsApp Channel


Most Read
● యేసు ప్రభువు: సమాధానమునకు (శాంతికి) మూలం
● ఇతరులతో శాంతియుతంగా జీవించండి
● 22వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● రెండవసారి చనిపోవద్దు
● మాటల శక్తి
● ఇతరులకు సేవ చేయడం ద్వారా మనం అనుభవించే దీవెనలు
● గొప్ప ప్రతిఫలము ఇచ్చువాడు
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್