english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. స్తుతి ఫలములను తెస్తుంది
ಅನುದಿನದ ಮನ್ನಾ

స్తుతి ఫలములను తెస్తుంది

Saturday, 25th of January 2025
0 0 714
Categories : స్తుతి (Praise)
దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. (కీర్తనలు 67:5-6)

జాగ్రత్తగా గమనించండి, దేవుని ప్రజలు ఆయనను స్తుతించినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే భూమి దాని ఫలమును తీసుకురాగలదు.

మన ఫలము వచ్చేవరకు దేవుని స్తుతించడానికి మనం వేచి ఉండకూడదు; దానికి బదులుగా, మనం దానిని అనుభవించకముందే మనం ఆయనను స్తుతించాలి. స్తుతి ఫలాలకు కారణమవుతాయి.

నిరంతరం గొణుగుతూ మరియు సణుగుతూ ఉండేవారు ప్రభువు నుండి వచ్చే ఈ ఫలాలను అనుభవించలేరు. గొణుగడం మరియు ఫిర్యాదు చేయడం ఫలాలకు అడ్డంకి. దైవిక సదుపాయాలు ఎల్లప్పుడూ దేవుని ప్రజల స్తుతులకు ప్రతిస్పందిస్తాయి.

యేసు తండ్రికి స్తుతులు మరియు కృతజ్ఞతాస్తుతులు అర్పించినప్పుడు మరియు రొట్టెలు మరియు చేపలను ఆశీర్వదించినప్పుడు, విస్తారం యొక్క అద్భుతం వేలాది మందికి ఆహారం ఇచ్చింది.

అప్పుడాయన (యేసు ప్రభువు) నేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడ వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడ వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తిపొందిన మీదట, మిగిలిన ముక్కలు ఏడు గంపలనిండ ఎత్తిరి. (మార్కు 8:6-8)

అదేవిధంగా, మనం మన జీవితంలో విస్తరించడం లేదా ఫలాలను చూడాలనుకుంటే, మన దగ్గర ఉన్న సమస్తం నుండి దేవుని స్తుతించడం మరియు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి.

యోవేలు 3:13 ఇలా సెలవిస్తుంది: "​పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి.…"

కొడవలి లేకుండా మీరు పంటను తీసుకురాలేరు. కొతకాలములో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. (యెషయా 9:3). స్తుతి మరియు సంతోషం కలిసిపోతాయి. అందువల్ల, స్తుతి అనేది పంటను కోయడానికి ఉపయోగించే కొడవలి.

ఈ రోజు నుండి, ఈ ప్రత్యేక్షతతో దేవుని స్తుతించండి మరియు అద్భుతమైన ఫలితాలను పొందండి.

Bible Reading: Exodus 21-22
ಅರಿಕೆಗಳು
ప్రభువు నా కాపరి. ఆయనే నన్ను నడిపించేవాడు. అందువల్ల సంపద యొక్క ఫలములకు ప్రతి మార్గాలు నేడు నాకు తెరిచి ఉన్నాయి. యేసు నామంలో. ప్రభువు, ఆయన ఒక్కడే దేవుడు. అందువలన, ఫలము మరియు అభివృద్ధిని తెచ్చే దైవ ప్రేరేపిత ఆలోచనలు ఇప్పుడు నాకు వచ్చును గాక. యేసు నామంలో.

Join our WhatsApp Channel


Most Read
● శీర్షిక: అదనపు సామాను వద్దు
● క్షమించకపోవడం
● 08 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● మీ ఇంటిలోని వాతావరణాన్ని మార్చడం - 5
● కోపం (క్రోధం) యొక్క సమస్య
● మీరు యేసు వైపు ఎలా చూచు చున్నారు?
● రాజ్యానికై మార్గాన్ని స్వీకరించడం
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್