english हिंदी मराठी తెలుగు മലയാളം தமிழ் Contact us ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ Download on the App StoreiOS ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ Get it on Google Play ಆಂಡ್ರಾಯ್ಡ್ ನಲ್ಲಿ ಆಪ್ ನ್ನು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿ
 
ಲಾಗಿನ್
ಆನ್ಲೈನ್ ಮೂಲಕ ಕಾಣಿಕೆ ನೀಡಲು
ಲಾಗಿನ್
  • ಮೂಲತಾಣ
  • ಕಾರ್ಯಕ್ರಮಗಳು
  • ನೇರಪ್ರಸಾರ
  • ದೂರದರ್ಶನ
  • ನೋಹಾಟ್ಯೂಬ್
  • ಸ್ತೋತ್ರಗಳು
  • ಸುದ್ದಿಗಳು
  • ಮನ್ನಾ
  • ಪ್ರಾರ್ಥನೆಗಳು
  • ಅರಿಕೆಗಳು
  • ಕನಸುಗಳು
  • ವಿದ್ಯುನ್ಮಾನ -ಪುಸ್ತಕಗಳು
  • ವ್ಯಾಖ್ಯಾನ
  • ಶ್ರದ್ದಾಂಜಲಿ
  • ಓಯಸಿಸ್
  1. ಮೂಲತಾಣ
  2. ಅನುದಿನದ ಮನ್ನಾ
  3. రాజభవనం వెనుక ఉన్న వ్యక్తి
ಅನುದಿನದ ಮನ್ನಾ

రాజభవనం వెనుక ఉన్న వ్యక్తి

Tuesday, 11th of February 2025
0 0 470
Categories : ఎస్తేరు యొక్క రహస్యం: క్రమము (Secrets of Esther:Series)
"దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు." (కీర్తనలు 1:1-2)

ఈ ఆధునిక ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన అందాల పోటీలో (ఇందులో ఎస్తేరు ఒక భాగం) చాలా మంది యువ కన్యలు రాజు భవనముతో ఆకర్షితులవ్వడం ఆశ్చర్యం కలిగించదు. నేను వారిని నిందించను. షూషను నగరం అహష్వేరోషు రాజు కుటుంబ శ్రేణిలో పర్షియా యొక్క కోట రాజధానికి నిలయంగా ఉంది. రాజా తోటలోని ప్రాంగణం యొక్క వివరణాత్మక విషయమును బైబిలు మనకు అందిస్తుంది.

బైబిలు ఇలా చెబుతోంది, "ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్రవర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభ ములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను. అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి" (ఎస్తేరు 1:5-7).

మీరు రాజభవనం యొక్క అలంకారాన్ని ఊహించవచ్చు. ఇది కేవలం రాజు యొక్క "పెరడు" యొక్క వివరణ అయితే, అతని సింహాసన గది మరియు రాజభవనం ఎలా ఉండేదో మీరు ఊహించగలరా? రాజభవనం చూడడానికి ఎవరైనా తమ గుర్తింపును మరచిపోతారు.

నేడు చాలా మంది క్రైస్తవులు దాని రాజు కంటే దేవుని రాజ్యం యొక్క పరిమిత సొగసు మరియు భూసంబంధమైన ప్రయోజనాలతో ఆకర్షితులయ్యారు. మనము భవనం వెనుక ఉన్న వ్యక్తిని విస్మరిస్తాము. మనము దృశ్యం వెనుక ఉన్న ముఖాన్ని నిర్లక్ష్యం చేస్తాము. దేవుడు ఏమి ఇస్తాడో అది మనకు కావాలి మరియు ఆయనతో సంబంధాన్ని కోరుకోము. వాగ్దానాన్ని ఇచ్చిన దేవునికి లోబడడం కంటే లేఖనంలోని వాగ్దానాలను పొందుకోవడానికి మనము ఇష్టపడతాము.

మిత్రమా, దేవుడు నీతో చెప్తున్నాడు, నన్ను వెతకండి, నీవు కోరుకునేదంతా నేను నీకు ఇస్తాను. సామెతలు 23:26లో బైబిలు ఇలా చెబుతోంది, “నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము.” మీ హృదయం ఆయన చేతిలో ఉన్నది మాత్రమే కాక దేవుని వెంట పడనివ్వండి. మీరు చూసేవన్నీ మీకు ఇవ్వడములో ఆయనకు ఏ సమస్య లేదు, కానీ మీరు ఆయనకు మీ హృదయాన్ని ఇస్తారా?

Bible Reading: Leviticus 24-25
ಪ್ರಾರ್ಥನೆಗಳು
తండ్రీ, యేసు నామములో, ఈ రోజు నీవు నా హృదయాన్ని నింపాలని నేను ప్రార్థిస్తున్నాను. నేను ఈ రోజు నీ కంటే వస్తువులను కోరుకునే ప్రతి కోరికను పరిత్యజిస్తున్నాను. నా హృదయం నీకు దూరంగా ఉన్నప్పుడు ఒంటరిగా నా పెదవులతో నిన్ను వెతకకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి. నీ బలమైన హస్తం నన్ను నీకు దగ్గరగా ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసు నామములో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● యేసు తాగిన ద్రాక్షారసం
● ప్రేమతో ప్రేరేపించబడ్డాము
● మార్పు చెందడానికి ఇంకా ఆలస్యం చేయకు
● మనస్సులో నిత్యత్వముతో జీవించడం
● 24వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● దేవుని కృపకై ఆకర్షితులు కావడం
● మార్పు యొక్క వెల
ಅನಿಸಿಕೆಗಳು
ನಮ್ಮನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ
Phone: +91 8356956746
+91 9137395828
WhatsApp: +91 8356956746
ಇಮೇಲ್ ವಿಳಾಸ: [email protected]
ವಿಳಾಸ :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
ಸ್ಪೋರ್ಟಿಫೈ ನ್ನು ಆಲಿಸಿರಿ
Download on the App Store
Get it on Google Play
JOIN MAILING LIST
EXPLORE
ಕಾರ್ಯಕ್ರಮಗಳು
ನೇರಪ್ರಸಾರ
ನೋಹಾಟ್ಯೂಬ್
ದೂರದರ್ಶನ
Donation
ಮನ್ನಾ
ಸ್ತೋತ್ರಗಳು
ಅರಿಕೆಗಳು
ಕನಸುಗಳು
ಸಂಪರ್ಕ
© 2026 Karuna Sadan, India.
➤
ಲಾಗಿನ್
ಈ ಜಾಲದಲ್ಲಿರುವ ವಿಷಯದ ಕುರಿತು ನಿಮ್ಮ ಅನಿಸಿಕೆ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ತಿಳಿಸಲು ಲೈಕ್ ಮಾಡಲು ದಯಮಾಡಿ ನಿಮ್ಮ ನೋಹ ಖಾತೆಗೆ ಲಾಗಿನ್ ಆಗಿರಿ
ಲಾಗಿನ್