english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. బైబిలు వ్యాఖ్యానం
  3. అధ్యాయం 14
బైబిలు వ్యాఖ్యానం

అధ్యాయం 14

Book / 2 / 3007 chapter - 14
112
ఒకరోజు పదిమంది కుష్ఠురోగులు యేసు యొద్దకు వచ్చారు:
ఆయన వారిని చూచి మీరు వెళ్లి, మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్లు చుండగా, శుద్ధులైరి. (లూకా 17:14)

యాజకునికి తమను తాము కనుపరచుకొవడం అనేది వారు నిజంగా కుష్టు వ్యాధి నుండి స్వస్థత పొందారని సరిచూచుకోవడానికి ధృవీకరించడానికి ఒక మార్గం. అందుకే వారి స్వస్థత గురించి, వారి విముక్తి గురించి నివేదికను పొందడానికి వైద్యుడి వద్దకు వెళ్లమని కూడా నేను ప్రజలకు చెప్తున్నాను. ప్రజలు మిమ్మల్ని నన్ను ప్రశ్నించవచ్చు కానీ వారు వైద్య సాక్ష్యాలను తిరస్కరించలేరు.

యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, "కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను." (లేవికాండం 14:1-2)

కుష్టు వ్యాధిని సహజ మార్గాల ద్వారా బాగు చేయలేనందున ఈ ఆచారం ఆ కాలంలో చాలా అరుదుగా జరిగి ఉండవచ్చు. కాబట్టి స్వస్థత పొందిన కుష్టురోగికి వెళ్లి యాజకుడికి చూపించి మోషే కోరిన నైవేద్యాన్ని అర్పించమని ప్రభువైన యేసు చెప్పాడు. ఇది చూడడానికి అరుదైన దృశ్యం అయి ఉండాలి.

పాత నిబంధనలో, క్రైస్తవులుగా మనకు ప్రతీకగా ఉండే మూడు రకాల అభిషేకాలు ఉన్నాయి.
మూడు అభిషేకాలు
1. కుష్ఠురోగులు
2. యాజకుడు
3. రాజాభిషేకం

యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన యెడల యాజకుడు పవిత్రత పొంద గోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. (లేవికాండం 14:3-4)

1. సజీవమైన రెండు పవిత్ర పక్షులు,
2. దేవదారు కఱ్ఱ
3. నూలు
4. హిస్సోపు

ఈ ప్రక్రియ పాపాత్ముని ప్రక్షాళనకు ప్రతీక. కుష్ఠురోగి అభిషేకంలో ఉన్న అంశాలు, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వద్ద మన కోసం ఏమి చేసాడో అవి ఈ చిత్రాలే.

అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించెను. (లేవికాండం 14:5)

ఇది మన ప్రభువైన యేసు శరీరములో వచ్చి, నీటిలో బాప్తిస్మము పొంది మన కొరకు చనిపోవడానికి గల ప్రతీక.

సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచెను. (లేవికాండం 14:6)

కఱ్ఱ సిలువను సూచిస్తుంది. నూలు పాపానికి ప్రతినిధి. యెషయా 1:18 ఇలా చెబుతోంది, "ఇప్పుడు రండి మన వివాదము తీర్చుకొందము, అని ప్రభువు చెప్పుచున్నాడు." అప్పుడు పక్షిని రక్తంలో ముంచాలి. ఇది పాపాత్ముడు యేసు రక్తం ద్వారా శుద్ధి చేయబడటానికి చిహ్నం.

కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలి వేయవలెను. (లేవికాండం 14:7)

యాజకుడు హిస్సోపు తీసుకొని కుష్టురోగి రక్తాన్ని ఏడుసార్లు చిలకరించి, అతన్ని శుభ్రంగా ప్రకటించేవాడు. పాత నిబంధనలో, హిస్సోపు శుభ్రపరచడం (రక్తం చిలకరించడం లేదా పూయడం)తో సంబంధం కలిగి ఉంటుంది. కీర్తనలు 51:7 ఇలా చెబుతోంది, "నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమముకంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము."

సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలి వేయవలెను.
ఈ చిత్రం బైబిలు అంతటా ఉంది
ఇది విముక్తి చిత్రం. ఒకరి స్థానంలో మరొకరు చనిపోతున్నారు
యేసుకు బదులు బరాబాను విడిపించాడు
బరబ్బా అంటే 'తండ్రి కుమారుడు' యేసు కూడా తండ్రి కుమారుడే.

అప్పుడు పవిత్రత పొందగోరు వాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను. (లేవికాండం 14:8)

- తిరిగి జన్మించిన అనుభవం. శిశువుకు వెంట్రుకలు లేనట్లే మనిషి కూడా.
మరియు నీళ్లలో స్నానం చేసి, అతడు శుభ్రంగా ఉంటాడు.
నీరు దేవుని వాక్యాన్ని గురించి సూచిస్తుంది
ఒక వ్యక్తిని శుభ్రపరిచే దేవుని వాక్యం గురించి మాట్లాడుతుంది
నేను నీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పటికే పరిశుభ్రంగా ఉన్నారు. (యోహాను 15:3)

అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైనదాని రక్త ములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను. (లేవికాండం 14:14)

కుడి చెవి కొన  మీదను (చెవి - వినడం)
వాని కుడి చేతి బొటనవ్రేలి మీదను (చేతి - మన చేతుల పని)
వాని కుడి కాలి బొటనవ్రేలి మీదను (కాలు - మన నడక)

మనం రక్షణ బహుమానం అంగీకరించడానికి ముందు, మనం వినాశనానికి మార్గంలో ఉన్నాం. సామెతలు 14:12 ఇలా చెబుతోంది, "ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును." మనం యేసు యొద్దకు వచ్చినప్పుడు, ఆయన మన నడకను శుభ్రపరుస్తాడు మనలను జీవమార్గంలో ఉంచుతాడు.

యాజకుడు తన అరచేతిలో నున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలి మీదను, వాని కుడికాలి బొటనవ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తము మీద చమరవలెను.(లేవికాండం 14:17)

చెవి - ఇది వినికిడి పవిత్రమైనదని సూచిస్తుంది.
బొటనవ్రేలు అతని పనులు కూడా పవిత్రం చేయబడ్డాయి. మన పనులు దేవునిచే అభిషేకించబడకపోతే, అవి తిరస్కరించబడతాయని బైబిలు మనకు చూపిస్తుంది.
కాలి బొటనవ్రేలు మన నడకకు అభిషేకం చేయకపోతే, మనం తడబడతాము. శరీర కోరికలను నెరవేర్చకుండా ఉండాలంటే మనం ఆత్మలో నడుచుకోవాలని దేవుడు చెప్పాడు (రోమీయులకు 8:13).
అదే స్థానంలో మొదట రక్తం వచ్చి ఆ తర్వాత నూనె రావడం గమనించండి

అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొంద గోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. (లేవికాండం 14:18)

అప్పుడు యాజకుడు తన చేతిలో మిగిలిన నూనె తీసుకుని కుష్ఠురోగి తలపై పోస్తాడు. నాకు, ఇది దేవుని అధికారానికి లోబడేతత్వాని గురించి సూచిస్తుంది.

కుష్ఠురోగిని శుద్ధి చేసేది గొర్రెపిల్ల రక్తం మాత్రమే కాదు, అభిషేక తైలం (పరిశుద్దాత్మ చిహ్నం) అతన్ని పునరుద్ధరించింది.

Join our WhatsApp Channel

Chapters
  • అధ్యాయం 1
  • అధ్యాయం 2
  • అధ్యాయం 3
  • అధ్యాయం 4
  • అధ్యాయం 5
  • అధ్యాయం 6
  • అధ్యాయం 7
  • అధ్యాయం 8
  • అధ్యాయం 9
  • అధ్యాయం 10
  • అధ్యాయం 11
  • అధ్యాయం 12
  • అధ్యాయం 13
  • అధ్యాయం 14
మునుపటి
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్