జీవితం ఒక పాఠం, మరియు మనం ఎల్లప్పుడూ నేర్చుకోవలసినది ఉంటుంది. మనం నేర్చుకోవడం మానేసినప్పుడు, మనం చనిపోవడానికి సిద్దపడతాం అని ఒక తెలివైన వ్యక్తి ఒకసారి చెప్పాడు. "నా కుమారుడా, నీవు నేర్చుకోవడం మానేసినప్పుడు, నీకు ఇప్పటికే తెలిసిన వాటిని నీవు త్వరలో విస్మరిస్తావు. (సామెతలు 19:27 GNT) మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అంతే తెలుసు, మరియు మనం నేర్చుకోవడం ఆపివేసినప్పుడు, మరియు మనం నేర్చుకోవడం మానేసినప్పుడు, మనం క్రిములు మరియు దుర్వాసనలను పుట్టించే నిలిచిపోయిన ఉన్న నీటిలా తయారవుతాము.
నేర్చుకోవడం మనకు జ్ఞానం పొందుకోవడానికి సహాయపడుతుంది మరియు సమాజానికి మనల్ని మెరుగుపరిచేలా చేస్తుంది. ఇది ప్రభావానికి అవసరమైన ప్రధాన ఆయుధము. కానీ నేర్చుకోవటానికి గొప్ప అడ్డంకి ఏమిటో మీకు తెలుసా? - అది అహము. నేర్చుకోవడానికి దీనిత్వం అవసరం. దేవుడు కూడా దీనులైన వారికి మాత్రమే నేర్పిస్తాడు. "యెహోవా ఉత్తముడును యథార్థ వంతుడునై యున్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును." (కీర్తనలు 25: 8-9)
తరచుగా, దేవుడు పాపులకు మార్గమును గూర్చి ఉపదేశిస్తాడు, కాని ఆయన కపటులను విడిచిపెడుతాడు. అందుకే అయన పరిసయ్యులు మరియు సద్డుకీయులను విడిచిపెట్టి మరియు వేశ్యలు మరియు పన్ను వసూలు చేసిన వారితో మాట్లాడాడు.
వినియం గల వ్యక్తులు తమ పరిమితులను గుర్తిస్తారు మరియు నేర్చుకోవలసినవి ఎల్లప్పుడూ ఉంటాయని వారికి తెలుసు. నూతన సమాచారం మరియు అనుభవాలకు ఈ నిష్కాపట్యత వ్యక్తిగత పెరుగుదల మరియు అభివృద్ధి అవసరం.
మరోవైపు, తమకు ఇప్పటికే అన్నీ తెలుసని నమ్మే వారికి నూతన ఆలోచనలు మరియు నేర్చుకోవలసిన అవకాశాలు మూసివేయబడ్డాయి. ఈ రకమైన ఆలోచన తరచుగా అహంచే నడపబడుతుంది, ఇది వ్యక్తిగత-ప్రాముఖ్యత యొక్క తప్పుడు భావనగా భావించబడుతుంది. 1 కొరింథీయులకు 8:2-3లో బైబిలు ఇలా చెబుతోంది, "ఒకడు తనకేమైనను తెలియుననుకొని యుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు."
మీరు 30 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ కాలం వ్యాపారవేత్తగా ఉండవచ్చు, కానీ ఈ లేఖనం ఎల్లప్పుడూ నేర్చుకోవలసినది నూతనమైన విషయాలు ఉంటాయని చెబుతుంది. దేవుడు వెల్లడించాలనుకునే నూతన విషయాలు ఎప్పుడూ ఉంటాయి.
కొంతకాలం క్రితం, నేను శ్రీలంక దేశంలో ఉన్నాను మరియు దేవుని సంఘములో ఈ అద్భుతమైన వ్యక్తిని కలిసాను. అతడు మైక్ నా చేతికి అందజేసి, "పాస్టర్ గారు, దయచేసి సంఘములో ప్రసంగించండి." నేను నిజంగా ఊహించలేదు నేను అవాక్కయ్యాను. అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ "చెప్పు, నేను దేవుని దాసుని నుండి నేర్చుకోడానికి వచ్చాను" అని సెలవిచ్చింది. మీరు ఇప్పటికే ప్రవచనములో కదులుతున్నట్లయితే, ప్రవచనములో కదిలే వేరొకరి నుండి నేర్చుకోవలసినది ఎల్లప్పుడూ ఉంటుంది.
దేవుని దాసుడు, పరిచర్య, సంఘము, మరియు వ్యాపారం ఏదీ పరిపూర్ణంగా లేదు, కానీ మీరు మీ అహాన్ని దారిలోకి తెచ్చుకుని, నేర్చుకోవాలనే వైఖరిని కలిగి ఉంటే, మీరు నూతన స్థాయికి వెళతారు. రోమీయులకు 11:33లో బైబిలు ఇలా చెబుతోంది, "ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్య ములు; ఆయన మార్గములెంతో అగమ్యములు."
దేవుని నుండి మనం పొందలేనంతగా అహం మనల్ని నింపుతుంది. అహంభావం ఉన్న మనిషి నీటితో నిండిన కప్పు లాంటివాడు; అందులో పడిన ఏ నీటి బొట్టు అయినా భూమిలోకి ప్రవహిస్తుంది. దేవుడు అలాంటి వ్యక్తితో సంభాషించలేడు మరియు నూతన విషయాలను వెల్లడించలేడు. దేవుడు వస్తువులను విడుదల చేస్తున్నాడు, కానీ మీరు ఆయన నుండి ఏది పొందలేనంతగా నిండుగా ఉన్నారు.
ప్రభువైన యేసయ్య కూడా తన దినాలలో బోధకుల నుండి నేర్చుకునేందుకు ముందుగానే తనను బయలుపరచుకున్నాడు. లూకా 2:46 ఇలా చెబుతోంది, "మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి."
యేసు ఆలకించడం మరియు అడగడం గురించి గమనించండి. ఆలకించడం వినయం మరియు నేర్చుకోవడానికి నిదర్శనం. అవును, ఆయనకు అన్ని విషయాల గురించి పరిపూర్ణ జ్ఞానం ఉన్న దేవుడు. ఆయన ఏమీ నేర్చుకోవలసిన అవసరం లేదు, మరియు ఆయన దేని గురించి మరచిపోలేదు, కానీ ఒక మనిషిగా, ఆయన తనను తాను బయలుపరచుకున్నాడు మరియు నేర్చుకున్నాడు. లూకా 2: 52లో, బైబిలు ఇలా చెబుతోంది, "యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయ యందును వర్ధిల్లు చుండెను." ఇది నిరంతర నేర్చుకోవడం మరియు వ్యక్తిగత అభివృద్ధికి యేసయ్య యొక్క నిబద్ధతను తెలియజేస్తుంది.
ఒక కార్యనిర్వాహకుడిగా, ఒక పారిశ్రామికవేత్తగా మీరు మంచిగా వినే వారిగా ఉండాలి. మీరు మీ ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించిన అభిప్రాయాన్ని స్వీకరించాలి, లేదంటే మీరు కొద్దికాలం మాత్రమే మార్కెట్ ముఖ్యులుగా ఉంటారు.
యేసయ్య బోధకునిగా ఎదిగినప్పుడు, ఆయన మత్తయి 11:28-30లో ఇలా చెప్పాడు, "ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి."
మీరు ఈ వచనాలను శ్రద్ధగా చదివినట్లయితే, మనం ఆయన మార్గాలను నేర్చుకోమని యేసయ్య ప్రాథమిక పిలుపు అని మీరు గమనించవచ్చు. ఆయన మనకు రాజ్యం యొక్క మార్గాలను చూపించడానికి వచ్చాడు, మరియు ఆయన త్వరగా అవసరాలను రూపొందించాడు, "నేర్చుకోవడానికి మీరు నాలా సాత్వికునిగా ఉండాలి." యేసు తాను సాత్వికుడని, అంటే గర్వ పడే వ్యక్తిని తన తరములో చేర్చుకోలేనని చెప్పాడు. శిష్యులు దాదాపు మూడు సంవత్సరాలు ఆయనతో ఉన్నారు, వారు ఆయన నాయకత్వానికి తమను తాము లోబడి దేవుని రాజ్యం యొక్క మార్గాలను నేర్చుకున్నారు. యేసు తన పరిచర్యను ప్రారంభించకముందే వారిలో కొందరికి తెలుసు, అయినప్పటికీ వారు తమ గర్వము మరియు అహంకారాన్ని విడిచిపెట్టారు, తద్వారా వారు సమీప భవిష్యత్తులో అపొస్తలులుగా ఉండడానికి ఏమి అవసరమో తెలుసుకుంటారు.
అహం అనేది ఎవరైనా అతి విశ్వాసం మరియు అజేయంగా భావించేలా చేస్తుంది, వారి స్వంత బలహీనతలను తక్కువగా అంచనా వేయడానికి ఇది దారి తీస్తుంది. అయితే, ఈ అహం-ఆధారిత విశ్వాసం తరచుగా పెళుసుగా ఉంటుంది మరియు చిన్న చిన్న సవాళ్లు లేదా విమర్శల ద్వారా కూడా సులభంగా బద్దలైపోతుంది. మరో మాటలో చెప్పాలంటే, అహం అనేది కవచం వంటిది, అది ఉక్కుతో తయారు చేయబడినట్లు కనిపించవచ్చు కానీ వాస్తవానికి కాగితంతో తయారు చేయబడింది. ఇది బలం మరియు రక్షణ రూపాన్ని అందించినప్పటికీ, అది సులభంగా చొచ్చుకుపోతుంది మరియు ధరించినవారికి హాని కలిగించవచ్చు.
మన బలాల గురించి మనం గర్విస్తున్నప్పుడు, మనం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించడం మానివేయవచ్చు మరియు స్తబ్దుగా మారవచ్చు. ఇది అంతిమంగా మన సామర్థ్యాలలో క్షీణతకు మరియు బలాన్ని కోల్పోయేలా చేస్తుంది. అదేవిధంగా, మన ఆధ్యాత్మికత పట్ల గర్వం మన విశ్వాసములో బహిరంగంగా మరియు వినయపూర్వకంగా ఉండకుండా ఇతరుల పట్ల అహంకారిగా మరియు తీర్పు చెప్పేలా చేస్తుంది.
మనం క్రీస్తు కోసం ప్రజలను చేరుకోలేకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, మనం వారి కంటే చాలా గొప్పవారమనే ఈ ఆధ్యాత్మిక అహంకారాన్ని కలిగి ఉండటం.
లూకా 18:10-13లో ప్రభువైన యేసు దేవాలయానికి ప్రార్థించడానికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాడు, ఒకరు పరిసయ్యుడు మరియు మరొకరు సుంకరి (పన్ను వసూలు చేసేవాడు). పరిసయ్యుడు నిలబడి ఇలా ప్రార్థించాడు, 'దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.' మరియు సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను."
మీరు గమనించండి, పరిసయ్యుడు (ఈ సందర్భంలో, ఉపవాసం మరియు దశమ భాగం) అతని అహం మరియు గర్వం కారణంగా అతనికి సహాయపడే బోధనలు మరియు సిద్ధాంతాలు అతడు దేవుని ముందు సమర్థించబడకపోవడానికి కారణమయ్యాయి. కాబట్టి మీరు గమనించండి, మనం మన ఆధ్యాత్మికత గురించి గర్వంగా మరియు అహంభావంతో ఉన్నప్పుడు, అది చివరికి మన ఆధ్యాత్మికతను నాశనం చేస్తుంది మరియు మనకు మార్గనిర్దేశం చేసే బోధనలు మరియు సిద్ధాంతాల నుండి మనల్ని వేరుపరుస్తుంది. మనం గర్వించే విషయాలు అహంకారంతోనే నాశనం అవుతాయి.
బిలాము వంటి ప్రవక్తకి బోధించడానికి దేవుడు గాడిదను ఉపయోగించగలిగితే, దేవుడు మీకు చిన్న పిల్లవాడి ద్వారా కూడా నేర్పించగలడు. ఒక పక్షి పేతురు వంటి శక్తివంతమైన అపొస్తలుడికి బోధించగలిగితే, మీ చుట్టూ ఉన్న సాధారణ వ్యక్తుల నుండి పొందుకోవడానికి మరియు నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి.
కాబట్టి, "నేర్చుకునే తత్వానికి నాలో ఇంకా స్థలం ఉందా?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. "నేను మూసివున్న పాత్రనా లేక దిగుబడి ఉన్న పాత్రనా?" దేవుడు ఎప్పుడూ ఏదో ఒకటి సెలవిస్తూనే ఉంటాడు. మనుషుల నుంచి నేర్చుకోవడానికి ఎప్పుడూ కొత్తదనం ఉంటుంది. మీరు యధార్థంగా ఉండాలి. మీరు ముఖ్యులు అయినట్లయితే దీని అర్థం ఇక ప్రజల నుంచి నేర్చుకోలేనని కాదు. మీరు ఇంటి పెద్ద అయినట్లయితే దీని అర్థం మీ భార్య మీకు కొన్ని విషయాలు నేర్పించదని కాదు.
అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు 13:9లో ఇలా అన్నాడు, "మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము." మీరు అది గమనించారా? దేవుడు మనిషిని ఆ విధంగా రూపొందించాడు కాబట్టి మనం అహంకారంతో ఉండకూడదు. అన్ని తెలిసిన స్వర జ్ఞాని ఎవరూ లేరు. మీరు కూడా తెలుసుకోవలసిన అవసరం ఉన్నట్లయితే మీరు ఎల్లప్పుడూ ఇతరుల నుండి నేర్చుకోవలసిన అవసరం ఉందని తెలుసుకోవాలి. కాబట్టి, ఆ ఎత్తైన భుజాలను క్రిందికి దించి మరియు నేర్చుకునే అడ్డంకిని అధిరోహించండి.