అనుదిన మన్నా
0
0
111
దేవుడు ఎల్ షద్దాయి
Tuesday, 1st of July 2025
Categories :
దేవుని పేరు (Name of God)
అబ్రాము తొంబదితొమి్మది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను.. (ఆదికాండము 17:1-2)
దేవుడు అబ్రాహాముతో తన నిబంధనను ధృవీకరించాడు. ప్రభువు తనను తాను అబ్రహాముకు ఒక నూతన పేరుతో పరిచయం చేసుకున్నాడు, ఇది మునుపు మానవాళికి తెలియదు.
"సర్వశక్తిమంతుడైన దేవుడు" అనే పేరు ఎల్-షద్దాయి అనే హీబ్రూ పదాలను కలిగి ఉంటుంది. ఎల్ అనే పదానికి "బలవంతుడు లేదా పరాక్రమవంతుడు" అని అర్ధం. షద్దాయి అనే పదానికి "రొమ్ముగలవాడు" లేదా "పోషించేవాడు" అని అర్థం.
షద్దాయి కూడా స్త్రీ పదం. దేవుడు అబ్రాహాముతో ఇలా బయలుపరచాడు, "తల్లి తన బిడ్డను పోషించినట్లే, రాబోయే కాలంలో నేను నీకు పూర్తి ప్రదాతగా ఉంటాను." మనలో చాలామంది సర్వశక్తిమంతుడైన దేవుని బలవంతుడు మరియు శక్తివంతుడిగా చిత్రీకరిస్తారు, కానీ నేటి లేఖనం (ఆదికాండము 17:1-2) ఆయన కూడా తల్లిలాగా మృదువుగా ఉంటాడని చెబుతుంది (వాస్తవానికి, తల్లి కంటే చాలా ఎక్కువ)
ఒక తల్లి తన పిల్లల పట్ల చూపే ప్రేమ మరియు శ్రద్ధ వారిలో మానసిక స్థిరత్వాన్ని మరియు ఆరోగ్యకరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ మహమ్మారి సమయంలో, మీలో కొందరు ప్రియమైన వ్యక్తిని లేదా విలువైనదేదో కోల్పోయి ఉండవచ్చు,
అంటే ఉద్యోగం, వ్యాపారం మొదలైనవి. ఆయన ప్రేమ గతం నుండి వచ్చిన ప్రతి బాధను బాగు చేయగలదు, మీ హృదయాన్ని పునరుద్ధరించగలదు మరియు మీ ఆత్మలో మీరు కలిగి ఉన్న ఏదైనా భావోద్వేగ శూన్యతను పూరించగలదు..
ఈ రోజు మీరు ఏమి అనుభవిస్తున్నప్పటికీ, దేవుడు ఎల్ షద్దాయి-సమస్తమును కలిగినవాడు అనే సత్యాన్ని మీరు గుర్తించుకోవచ్చని తెలుసుకోండి. మీకు ఏది అవసరమో అది దేవుడే. "యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా?" (ఆదికాండము 18:14)
Bible Reading: Psalms 56-63
ఒప్పుకోలు
"నాకు 'సర్వశక్తిమంతుడైన దేవుడు' తెలుసు, నేను ఆయన యందు నడుస్తాను మరియు నేను పరిపూర్ణత వైపు పయనిస్తాను."
Join our WhatsApp Channel

Most Read
● ఆత్మ చేత నడిపించబడడం అంటే ఏమిటి?● బహుగా అభివృద్ధిపొందుచున్న విశ్వాసం
● గొప్ప ఉద్దేశాలు జరగడానికి చిన్న చిన్న కార్యాలు
● విత్తనం యొక్క శక్తి - 3
● ఒక ఇవ్వగల (అవును గల) హామీ
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● దేవుని శక్తివంతమైన హస్తము యొక్క పట్టులో
కమెంట్లు