english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. కృప చూపించడానికి క్రియాత్మకమైన మార్గాలు
అనుదిన మన్నా

కృప చూపించడానికి క్రియాత్మకమైన మార్గాలు

Sunday, 23rd of June 2024
0 0 1101
Categories : కృప (Grace)
కృపతో ఇతరుల పట్ల ప్రతిస్పందించడం అంటే ప్రజలను "భరించడం" (లేదా కృపతో సహించడం). ప్రతి ఒక్కరికి బలహీనత గల రంగాలు ఉన్నాయని మరియు మనమందరం "ఒక కార్యం అభివృద్ధిలో ఉంది" అని అంగీకరించడం దీని అర్థం. కృప చూపించడం అనేది మనం పెంపొందించుకోవాల్సిన కీలకమైన వైఖరి.

కృప చూపడానికి క్రియాత్మకమైన మార్గాలను మీతో పంచుకోవడానికి నన్ను అనుమతించండి.

మాటలతో కృప చూపడం
ఇతర వ్యక్తుల పట్ల చిరాకు లేదా కలత చెందడం సర్వసాధారణం, కానీ ప్రతిస్పందించడానికి మనం వేరే మార్గం నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. క్రైస్తవులము కాకపోయినా ప్రజలతో వ్యవహరించేటప్పుడు మనం దయగా మరియు మృదువుగా ఉండే మాటలను ఉపయోగించాలి.

ఇప్పుడు ప్రజలను సరిదిద్దాల్సిన అవసరం ఉన్న సందర్భాలు ఉన్నాయి, కానీ అది ఎప్పుడూ నీచమైన స్వరంలో (మాటలతో) చేయవలసిన అవసరం లేదు.

కొలొస్సయులకు 4:6 "ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్య వలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి."

కృప ద్వారా ప్రతిస్పందించండి
మిమ్మల్ని ఎవరైనా అన్యాయంగా విమర్శించారా? ఇప్పుడు మీరు డోర్‌మాట్‌గా ఉండాల్సిన అవసరం లేదు మరియు ప్రజలు మీ మీద నుండి వెళ్ళును గాక. అయినప్పటికీ, మీరు ఇప్పటికీ కృప ద్వారా ప్రతిస్పందించవచ్చు. మీరు ప్రతిస్పందించడానికి లేదా కృప ద్వారా వ్యవహరించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రజల మీద గొప్ప ప్రభావాన్ని సృష్టిస్తుంది మరియు యేసు నామాన్ని మహిమపరుస్తుంది.


ప్రశాంతమైన ఆత్మతో ప్రతిస్పందించడం వలన మీరు సత్యాన్ని చూడగలుగుతారు మరియు తదుపరి స్థాయికి వెళ్లడానికి అవసరమైన మార్పులు చేస్తారు.

"నన్ను క్షమించండి" అని చెప్పడం నేర్చుకోండి.
నేడు 'క్షమించండి' అనే పదం చాలా అరుదుగా వినబడుతుంది మరియు అది మరింత ప్రత్యేకమైనది. మీరు తప్పు చేసినప్పుడు, మీ అహంకారాన్ని వదిలేయండి మరియు క్షమించమని అడగండి. గుర్తుంచుకోండి, కృప అనేది అవతలి వ్యక్తికి వారు అర్హత లేని వాటిని ఇవ్వడం. మనం ఇలా చేస్తే, క్రైస్తవుల మధ్య విడాకులు తగ్గుతాయి మరియు సమస్యలు కూడా తగ్గుతాయి.


ఇతరుల పట్ల కృప చూపడానికి ధన్యవాదాలు (వందనాలు) చెప్పండి
"వందనాలు" అని చెప్పడానికి సమయాన్ని వెచ్చించండి. దీనికి ఎటువంటి ఖర్చు లేదు, కానీ ఇది ఇతరుల పట్ల కృతజ్ఞత మరియు కృపను చూపుతుంది.


చాలా ఏళ్ల క్రితం ఈ క్రైస్తవ సినిమా 'ఫైర్‌ప్రూఫ్‌' చూశాను. ఒక మనిషి తన భార్యను తిరిగి గెలుచుకుంటాడు మరియు ఆమె పట్ల కృపతో వ్యవహరించడం ద్వారా తన వివాహాన్ని సరిదిద్దుకుంటాడు. ఆమె క్రియలు మరియు ప్రక్రియలు చాలా భయంకరంగా ఉన్నాయి, అయినప్పటికీ అతడు కృపతో కొనసాగుతున్నాడు. భర్త యొక్క కృపగల క్రియల కారణంగా వారి వివాహం పునరుద్ధరించబడింది.

4 నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవు చుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను. 5 నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను. (నిర్గమకాండము 23:4-5) 

నా తొలిదినాళ్లలో, పైవాటికి సమానమైన అంశాలు నాకు అర్థం కాలేదు. కానీ దేవునికి వందనాలు, ఇప్పుడు అవి అర్థమవుతున్నాయి!

మన శత్రువులు మరియు మనల్ని ద్వేషించే వారి ఆస్తి పట్ల మనం కృప ద్వారా వ్యవహరించాలని దేవుడు కోరుకుంటున్నాడని జాగ్రత్తగా గమనించండి.

మీరు ఇతరుల పట్ల కృప చూపడం ప్రారంభించినప్పుడు మీ జీవితంలో గొప్ప పునరుద్ధరణ ఉంటుందని నేను నమ్ముతున్నాను.

ప్రార్థన
1. తండ్రీ, యేసు నామంలో, మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప మరియు జ్ఞానంలో నేను ఎదగాలని నేను నిన్ను వేడుకుంటున్నాను.

2. దేవుని గూర్చిన మరియు నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానములో నాకు కృప మరియు సమాధానము వృద్ధి చెందును గాక.

3. ఇప్పటి నుండి, నేను యేసు నామంలో అపరిమితమైన దయను మరియు కృపను పొందినందున నా ఆనందం వుద్ది అవుతుంది.

4. ఓ దేవా, నీ ఆత్మ ద్వారా యేసు నామంలో రాబోయే రోజులు, వారాలు మరియు నెలల్లో అపరిమిత విజయం మరియు కృపతో నన్ను నడిపించు.

5. ప్రభువా, యేసు నామములో నన్ను సరైన సమయంలో సరైన స్థలంలో ఉండేలా చేయి.

6. నేను ఎక్కడికి వెళ్లినా, యేసు నామంలో నేను బ్రదుకు దినములన్నియు కృపా క్షేమములే నా వెంట వచ్చును.


Join our WhatsApp Channel


Most Read
● దోషానికి సంపూర్ణ పరిష్కారం
● 21 రోజుల ఉపవాసం: 9# వ రోజు
● స్వతహాగా చెప్పుకునే శాపాల నుండి విడుదల
● మీరు దేవుని తదుపరి రక్షకుడు కావచ్చు
● దేవునికి మీ కొరకు ఒక ప్రణాళిక ఉంది
● దైవ రహస్యాల ఆవిష్కరణ
● భాషలలో మాట్లాడుట మరియు ఆధ్యాత్మికంగా విశ్రాంతి పొందడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్