అనుదిన మన్నా
21 రోజుల ఉపవాసం: 17# వ రోజు
Tuesday, 28th of December 2021
2
0
1155
Categories :
Fasting and Prayer
సహజసిద్ధమైన నూనె ఎండిపోయి మాసిపోయినట్లే, అది సరిగ్గా పొందకపోతే మనలో అభిషేకం వాడిపోయి తగ్గిపోతుంది.
పరిశుద్ధాత్మతో తాజా సహవాసం తాజా నూనెను ఉత్పత్తి చేస్తుంది. ఆయన గురించి మాత్రమే కాకుండా ఆయనతో నేరుగా మాట్లాడాలి.
ధ్యానించుటకు కొన్ని లేఖనాలు
కీర్తనలు 45:7
మత్తయి 9:17
అపొస్తలుల కార్యములు 2:1-4
బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును. (ప్రసంగి 10:1)
కీర్తనలు 92:10-15: గురుపోతు కొమ్మువలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచినవారి గతి నా కన్నులు ఆశతీర చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వు వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితన మందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు.
అభిషేకం మన కోసం చేసే 7 పనులు (కార్యములు):
1. నా కన్నులు . . . చూచును.
అభిషేకం మనకు నూతన దర్శనాన్ని ఇస్తుంది. దేవుని రాజ్యంలో లక్ష్యాలను స్థాపించడానికి మరియు మన విధిని నెరవేర్చడానికి మనకు దేవుని దర్శనం అవసరం. దర్శనం లేకుండా నా ప్రజలు నశించిపోతారని బైబిలు సెలవిస్తుంది (సామెతలు 29:18).
2. నా చెవులకు వినబడును.
మీరు దేవుని స్వరాన్ని వినగలిగేలా అభిషేకం మీ చెవులను తెరిచి ఉంచుతుంది.
3. నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వు వేయుదురు (వర్ధిల్లుదురు).
ఖర్జూర వృక్షముకు లోతైన మూలాలు ఉంటాయి, ఇవి ఎడారి ప్రదేశాలలో నీటిని అన్వేషిస్తాయి. మనం పరిశుద్ధాత్మతో లోతైన సాంగత్యాన్ని పెంపొందించుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తే, అది "నిత్యజీవమునకై వచ్చే నీటి బావి" (యోహాను 4:14) లాగా ఉంటుంది. ఈ అభిషేకం వల్ల మీరు ఎక్కడ నాటినా వర్ధిల్లుతారని, ఫలిస్తారనే విశ్వాసం కలుగుతుంది.
4. లెబానోను మీది దేవదారు వృక్షమువలె అతడు ఎదుగుదురు
లెబానోనుకు సుదీర్ఘ జీవితం ఉంటుంది. దేవుని రాజ్యంలో సిద్ధాంతాలు ఉన్నాయి, మనం వాటిని పాటిస్తే, అది దినాలను పొడిగిస్తాయి =, సంపద మరియు మర్యాదను తెస్తుంది.
5. యెహోవా మందిరములో నాటబడినవారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు.
మనం చాలా ఫలాలను ఫలించాలని మరియు మన ఫలాలు అలాగే ఉండాలని దేవుని చిత్తం. దీనికి అంకితభావం మరియు ఓపిక అవసరం, మనకు ఇవ్వబడిన పనికి మరియు మనం పిలువబడిన చోటికి కట్టుబడి ఉండాలి. చాలా మంది ఎప్పుడూ ఫలించకపోవడానికి గల కారణం వారు నిబద్ధత నుండి పరుగెత్తడం మరియు వైఫల్యం తిరస్కరణకు భయపడటం.
6. వారు ముసలితన మందు ఇంక చిగురు పెట్టుచుందురు
అభిషేకం ద్వారా దేవుడు మనలను వర్థిల్లింపజేస్తూన్నందున, మనం ఎక్కువ కాలం జీవిస్తాము మరియు మరింత ఫలవంతంగా ఉంటాము.
7. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై.
అభిషేకం మీ జీవితానికి పరిశుద్దతను తెస్తుంది.
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అంశాన్ని పునరావృతం చేస్తూ ఉండండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అంశానికి వెళ్లండి.
తండ్రీ, నేను ఇప్పుడే నా జీవితంలోని ప్రతి ప్రదేశాన్ని యేసు నామంలో నీకు అప్పగిస్తున్నాను.
(దయచేసి ఈ ప్రార్థన అంశములో కొంత యోగ్యమైన సమయాన్ని వెచ్చించండి. ఆ ప్రదేశాలను అప్పగించడం ప్రారంభించండి, ముఖ్యంగా మీరు వైఫల్యం, ఓటమి మొదలైన వాటిని ఎదుర్కొన్న చోట.)
పరిశుద్దాత్మ పట్ల ఏదైనా పాట పాడండి (మీరు ఇలా చేస్తున్నప్పుడు మీ చేతులు ఎత్తి మరియు కళ్ళు మూసుకోండి)
యేసు నామంలో నా కుటుంబ సభ్యుల మీద మరియు నా మీద పరిశుద్దాత్మ యొక్క అగ్ని వచ్చును గాక (ఈ ప్రార్థన అంశములో కనీసం రెండు నిమిషాలు గడపండి)
నా పునాదిలో విగ్రహారాధన మరియు అనైతికత యొక్క ఏదైనా వేరు, యేసు రక్తంలోని శక్తి ద్వారా నిర్మూలించబడును గాక.
నేను యేసు రక్తాన్ని నా కుటుంబ సభ్యుల మీద మరియు నా మీద యేసు నామంలో చిలకరింపజేస్తాను (మీ కుటుంబ సభ్యుల పేరును పేర్కొనండి)
దేవుని కాంతి మరియు అగ్ని యేసు నామంలో నా చుట్టూ మరియు నా కుటుంబ సభ్యుల చుట్టూ ఉన్న చీకటి యొక్క ప్రతి రూపాన్ని కరిగించును గాక (రద్దు చేయును గాక).
దేవుని కాంతి మరియు అగ్ని యేసు నామంలో నా ఇంటిలో మరియు నా ఇంటి చుట్టూ ఉన్న చీకటి యొక్క ప్రతి రూపాన్ని కరిగించును గాక (రద్దు చేయును గాక). (మీకు ఏదైనా అనుభవం వచ్చేంత వరకు ఇలాగే చెబుతూ ఉండండి)
భాషలలో ప్రార్థించండి
కనీసం 10 నిమిషాలు ప్రార్థించండి. మీరు ఆరాధన పాట వింటున్నప్పుడు కూడా దీన్ని చేయవచ్చు. మీకు భాషల వరం లేకుంటే, 10 నిమిషాల పాటు ఆయనను స్తుతిస్తూ మరియు ఆరాధిస్తూ సమయాన్ని వెచ్చించండి.
ఒప్పుకోలు (దీన్ని బిగ్గరగా చెప్పండి)
యేసు నామంలో, నేను పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాను.
యేసు నామంలో, నేను తాజా అభిషేకంలోకి వెళ్తున్నాను.
యేసు నామంలో, నేను దేవుని వాగ్దానాలను అనుభవిస్తున్నాను.
యేసు నామంలో, నేను దర్శనం గలవాడిని మరియు కలలు కనేవాడిని.
యేసు నామంలో, నేను ప్రభువు నామాన్ని మొఱపెడుతున్నాను మరియు ప్రతి పరిస్థితిలో రక్షింపబడతాను.
యేసు నామంలో, నేను దీవించబడుటకు అభిషేకించబడ్డాను.
దయచేసి పాస్టర్ మైఖేల్ గారు, ఆయన కుటుంబం, నాయకులు & కరుణా సదన్ పరిచర్యపై తాజా అభిషేకం కోసం ప్రార్థనలో కొంత సమయం గడపండి. మీరు ఇలా చేస్తున్నట్లయితే యెహోవా మిమ్మును ఘనపరుస్తాడు.

Join our WhatsApp Channel
Most Read
● పవిత్రునిగా చేసే నూనె● మాట్లాడే వాక్యం యొక్క శక్తి
● ఏడంతల ఆశీర్వాదములు (దీవెనలు)
● తన్నుతాను మోసపాచుకోవడం అంటే ఏమిటి? - II
● దేవునికి మీ పగను ఇవ్వండి
● దేవుని రకమైన విశ్వాసం
● 02 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
కమెంట్లు