english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మీ దైవికమైన దర్శించే కాలమును గుర్తించండి
అనుదిన మన్నా

మీ దైవికమైన దర్శించే కాలమును గుర్తించండి

Saturday, 13th of April 2024
1 0 694
Categories : దైవ దర్శనం (Divine Visitation)
యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారానుగూర్చి చేసెను. (ఆదికాండము 21:1)

"ప్రభువు శారాను దర్శించెను" అని లేఖనం చెబుతోంది. ఇది శారా జీవితంలో ప్రభువు యొక్క దైవ దర్శనం. దేవుడు తన ప్రజలను దర్శించే వ్యక్తి జీవితంలో కొన్ని కాలములను నిర్దేశిస్తాడు. మీరు మరియు నేను అలాంటి కాలములను గుర్తించాలి. ప్రభువైన యేసయ్య ఇశ్రాయేలలో తన ప్రజలను దర్శించినప్పుడు, ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ దర్శించే సమయం వారికి తెలియలేదు. ఆయన తన ప్రజల కొరకు వచ్చాడు మరియు ఆయన స్వంత ప్రజలు ఆయనను గుర్తించలేదు మరియు అంగీకరించలేదు.

సత్యమేమిటంటే, తండ్రి తన ఆత్మ ద్వారా మన దగ్గరికి వస్తే తప్ప మనం ప్రభువు దగ్గరకు రాలేము. మీరు ఒక సభకు, విజ్ఞాపన ప్రార్థన లేదా మీ వ్యక్తిగత ప్రార్థన సమయంలో హాజరైనప్పుడు, తండ్రి చిత్తంతో మీరు ఆ స్థానంలో ఉన్నారనే వాస్తవాన్ని గుర్తించడం నేర్చుకోండి. ఇది దైవ నియామకం ద్వారా. ఈ విధంగా మీరు ప్రభువు నుండి దైవ దర్శన కోసం మిమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుంటారు.

41ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి,42నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి. 43(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి 44నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను. (లూకా 19:41-44)

తన ప్రజల కోసం దేవుని ప్రణాళిక ఎల్లప్పుడూ నాశనానికి బదులుగా రక్షణ, అనారోగ్యానికి బదులుగా ఆరోగ్యం, వినాశనానికి బదులుగా సదుపాయం ఉంటుంది. అయితే, మన సమస్యలకు సమాధానంతో మరియు విపత్తును నివారించే జ్ఞానంతో దేవుడు మనలను దర్శించే సమయాన్ని మనం గుర్తించాలి.

"యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారానుగూర్చి చేసెను" అని లేఖనం ఇంకా చెబుతోంది. ఒక ప్రత్యక్షత ఎల్లప్పుడూ దర్శనను వెంబడిస్తుంది. శారా తన దర్శనను యెహోవా నుండి గుర్తించిందని మరియు దేవుడు దానిని ప్రత్యక్షతగా మార్చాడని నేను నమ్ముతున్నాను. మీరు మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యములను చూడాలనికుంటే, యెహోవా దర్శనాన్ని కలిగి ఉండండి. మీ జీవితం ఇక ఎప్పటికీ ఒకేలా ఉండదు.
ప్రార్థన
తండ్రీ, నా జీవితంలో నీ దైవ దర్శన కాలాన్ని గుర్తించడానికి నా కళ్ళు తెరువు. నాకు అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయి. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● విశ్వాసులైన రాజుల యాజకులు
● ఆరాధనకు వెళ్లకుండా మరియు ఇంటి వద్ద ఆన్‌లైన్‌లో ఆరాధన చూడటం ఇది సరైనదేనా?
● యబ్బేజు ప్రార్థన
● మూల్యం చెల్లించుట
● 21 రోజుల ఉపవాసం: 11# వ రోజు
● కోల్పోయిన రహస్యం
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్