english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ప్రభువును సేవించడం అంటే ఏమిటి - I
అనుదిన మన్నా

ప్రభువును సేవించడం అంటే ఏమిటి - I

Tuesday, 19th of March 2024
1 0 2053
Categories : సేవ చేయడం (Serving)
"ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించిన యెడల నా తండ్రి అతని ఘనపరచును" అని ప్రభువైన యేసు అన్నాడు. (యోహాను 12:26)

#1 ఒకడు నన్ను (యేసయ్య) సేవించిన యెడల 
ఎవరైనా దేవున్ని సేవించవచ్చు. మీరు ధనవంతులు లేదా పేదవారు, చదువుకున్నవారు లేదా చదువుకోనివారు అనే తేడా లేదు. చాలా తరచుగా, నాకు ఉత్తరాలు మరియు ఇమెయిల్‌లు వస్తాయి, "పాస్టర్ గారు, నేను ఇంగ్లీష్ మాట్లాడలేను; కాబట్టి నేను ప్రభువును సేవించడం లేదు. అదేమీ పెద్ద సమస్య కాదు. మీకు ఇంగ్లీషులో మాట్లాడటం తెలియకపోయినా దేవున్ని సేవించవచ్చు.

నేను ఎక్కడికి వెళ్లినా, నేటికి నేను ఒక పెద్ద సమస్యను చూస్తున్నాను, ప్రజలు సేవ చేయించుకోవడానికి ఇష్టపడతారు కాని వారు సేవ చేయకూడదనుకుంటున్నారు.

అయితే, మనం యేసయ్యజీవితాన్ని పరిశీలించినట్లైతే, ఆయన సేవకుడనడంలో సందేహం లేదు. "ఆలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని" ఆయనే చెప్పెను (మత్తయి 20:28)

బంధింపబడిన రాత్రి, ప్రభువైన యేసయ్య తన శిష్యుల పాదాలను కడిగి, ఒకరికొకరు సేవ చేయమని వారికి చివరి బోధనను చేసాడు: "నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని" (యోహాను 13:12–17 గమనించండి). కాబట్టి, యేసయ్య సేవ చేయగలిగితే, మరియు దేవుడు మనల్ని ఆయనలా చేయాలనుకుంటే, మనం కూడా సేవ చేయాలనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

ఒక చిన్న కొద్దిమంది (అల్పసంఖ్యాకవర్గం) ప్రజలు మాత్రమే ప్రభువుకు మరియు ఆయన ప్రజలకు సేవ చేయడానికి తమ జీవితాలను ఉపయోగించుకుంటారు. ప్రభువైన యేసయ్య ఇలా అన్నాడు, "తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును." (మార్కు 8:35)

#2 ఒకడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడింపవలెను
ప్రభువును సేవించాలనుకునేవారు తప్పనిసరిగా యేసయ్యను వెంబడించాలి మరియు కేవలం యేసయ్య అభిమానులుగా మాత్రమే ఉండకూడదు. మరో మాటలో చెప్పాలంటే, వారు యేసయ్య శిష్యులు అయి ఉండాలి. నేను వ్యక్తులను వారి అర్హతలు, రూపాలు మొదలైన వాటి ఆధారంగా ఎన్నడూ పనిలో పెట్టుకొను (వాస్తవానికి ఇవి ఏమి చెడ్డవి కావు). ఒక వ్యక్తి యేసయ్యను వంబడిస్తున్నాడా లేదా అని నేను ఎప్పుడూ గమనిస్తుంటాను.

అలాగే, మీరు నిజంగా ప్రభువును సేవించాలనుకుంటే, మీరు దేవుని వాక్యాన్ని క్రమం తప్పకుండా చదివి మరియు అధ్యయనం చేసే వ్యక్తి అయి ఉండాలి. అటువంటి వ్యక్తి మాత్రమే దేవున్ని సమర్ధవంతంగా సేవించగలడు.

దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. (2 తిమోతికి 3:16-17)

(ఇంకా ఉంది)
ప్రార్థన
తండ్రీ, నేను నీకు సేవ చేయవలసిన విధంగా చేయనందుకు క్షమించు. నీ ఆత్మ ద్వారా సరైన సేవా యొక్క దృక్పధాన్ని నాలో పుట్టించు.

తండ్రీ, నన్ను వాక్యము ద్వారా సిద్ధపరచుము. నీ మార్గాలను నాకు బోధించుము. యేసు నామంలో. ఆమెన్


Join our WhatsApp Channel


Most Read
● ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు: పరిశుద్దాత్మ
● ఇది సాధారణ అభివందనము కాదు
● వ్యక్తిగత మహిమ యొక్క ఉచ్చు
● 10 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● మీరు దేవుని ఉద్దేశ్యము కొరకు ఏర్పరచబడ్డారు
● దేవుని వాక్యాన్ని చదవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు
● Day 13: 40 Days Fasting & Prayer
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2026 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్