english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. మరణించిన వ్యక్తి జీవించడం కోసం ప్రార్థిస్తున్నాడు
అనుదిన మన్నా

మరణించిన వ్యక్తి జీవించడం కోసం ప్రార్థిస్తున్నాడు

Friday, 11th of October 2024
0 0 387
Categories : నరకం (Hell)
ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. (లూకా 16:19)

ఈ వ్యక్తి పేరు మనకు తెలియదు. అతడు ప్రతిరోజూ తన వ్యక్తిగత డైనింగ్ హాల్‌లో విందులను ఆస్వాదించే ధనవంతుడు అని మనకు తెలుసు. ఈ వ్యక్తికి ఐదుగురు సోదరులు ఉన్నారని కూడా మనకు తెలుసు (లూకా 16:27)

లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి, అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. (లూకా 16:20-21)

అప్పుడు లాజరు అనే ఈ దరిద్రుడు ఈ ధనవంతుడి యింటి వాకిట కూర్చున్నాడు. అయితే, యేసు ప్రభువు మృతులలో నుండి లేపిన లాజరు ఇతను కాదు.

ఈ వ్యక్తి యొక్క శరీరం అంతా కురుపులతో నిండినది మరియు కుక్కలు వచ్చి అతని కురుపులు నాకడం మాత్రమే అతనికి ఉన్న ఏకైక ఓదార్పు. ధనవంతుడు లేదా అతని ఐదుగురు సోదరులు ఈ దరిద్రుని పట్టించుకోలేదు.

ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచెను. (లూకా 16:22-23)

ధనవంతుడు మరియు దరిద్రుడు దాదాపు ఒకే సమయంలో మరణించినట్లు తెలుస్తుంది. ధనవంతుడు మరణంతో కళ్ళు మూసుకున్నాడు మరియు వేడి, మంటలు మరియు హింసల లోకంలో మేల్కొన్నాడు. మరోవైపు, దరిద్రుడు తనకు ఓదార్పునిచ్చే స్థలంలో వ్యక్తిగత దూతలను పొందుకున్నాడు. అక్కడ అతడు వ్యక్తిగతంగా విశ్వాసులకు తండ్రి అయినా అబ్రహమును కలుసుకున్నాడు.

అయితే, ధనవంతుడు లేఖనంలో స్మశానవాటిక లేదా నిలువు వరుసలో గుర్తించబడిన వింత పరిధిలో తనను తాను కనుగొన్నాడు.

తండ్రివైన అబ్రాహామా, "నాయందు కనికరపడి, తన వ్రేలికొనను--నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడు చున్నానని కేకలువేసి చెప్పెను." అప్పుడతడు తండ్రీ, "ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నా ననెను." (లూకా 16:24,27,28)

తన జీవితకాలంలో, ఈ పూర్వ కులీ వానికి దేవుడి కోసం సమయం లేదు లేదా పేదల పట్ల కనికరం లేదు. కానీ నశించిపోతున్న ఆత్మల లోకంలో, అతడు ప్రార్థించడం ప్రారంభించాడు. ఆసక్తికరంగా, వేడి మరియు మంటల యొక్క ఈ భూగర్భ జైలు నుండి అతడు బయటపడగలడా అని అతడు ఎప్పుడూ అడగలేదు. ఈ స్థలం నుండి తప్పించుకోలేనని అతనికి బహుశా తెలుసు.

ఈ వ్యక్తి తన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించాడు. తన జీవితకాలంలో, అతడు తన కోసం మరియు తన కుటుంబ సభ్యుల కోసం ప్రార్థించటానికి చాలా బిజీగా ఉన్నాడు. ఈ రోజు కూడా, ఈ లోకంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు. దయచేసి వారిలా ఉండకండి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధనవంతుడి శరీరం పాతిపెట్టినప్పటికీ, అతని ప్రాణం మరియు ఆత్మ మొత్తం ఐదు ఇంద్రియాలతో పనిచేస్తున్నాయి. అతడు ఈ క్రింది వాటిని అనుభవించాడు:

i) పూర్తిగా చీకటి (నలుపు).
ii) మండుతున్న అగ్ని (వేదన కలిగించే బాధ).
iii) ఏడుపు (విచారం).
iv) పళ్ళు కొరుకుట (కోపం).
v) పొగ (పూర్తి దాహం).
vi) మండుతున్న కొలిమి (బాధింపబడే వేడి).
vii) అరుపులు (నిరంతర గల వేదన శబ్దం).
viii) కట్టబడలేని అంతరం (శాశ్వతమైన ఎడబాటు).
ix) మానవ సంబంధం కోల్పోవడం (కుటుంబం, స్నేహితులు - తీవ్రమైన ఒంటరితనం).
x) మానసిక వేదన (స్నేహితులు, కుటుంబం, పరిచయస్తుల నుండి సువార్తను తిరస్కరించిన జ్ఞాపకశక్తి).

ఈ ఉపమానంలో చాలా భారం కలిగి ఉంది, ఎందుకంటే ఇది ఇతర సువార్తలలో చెప్పబడలేదు - ఇది లూకా సువార్తలో మాత్రమే నమోదు చేయబడింది. ఉపమానాలలో, యేసు ఎన్నడూ నిర్దిష్ట పేర్లను ఇవ్వలేదు, అయినా ఈ ప్రత్యేక వివరణలో, ఆయన లాజరు, అబ్రహము మరియు మోషే పేర్లు పెట్టాడు.

లేఖనము మనకు నొక్కి చెబుతుంది,"[అందరూ] మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత [నిర్దిష్ట] తీర్పు జరుగును." (హెబ్రీయులు 9:27)

ప్రస్తుతం జీవిస్తున్న మనం ఈ జీవితం నుండి గతించిపోతాము. మట్టి యొక్క ఈ పెంకు నుండి మనం విడిచిపెట్టి వెళ్లినప్పుడు, పునరుత్థానం మరియు తీర్పు రోజు వరకు మన శాశ్వతమైన ఆత్మ మరియు ప్రాణం ఉండే రెండు ప్రదేశాలు మాత్రమే ఉన్నాయి.

ఒక ప్రదేశంలో, చనిపోయిన వారు బహుశా (ధనికుడిలాగా) ప్రార్థిస్తూ ఉండవచ్చు, మీరు ఎన్నడూ అక్కడికి రావొద్దని. మరొక ప్రదేశంలో, దేవుని సింహాసనం ముందు మన కోసం ఒక ప్రధాన యాజకుడు నిరంతరం మధ్యసత్యం చేస్తున్నాడు.

పరలోకము వాస్తవమైనది, కానీ అదేవిధముగా నరకం కూడా. దయచేసి - యేసు క్రీస్తులో నిత్య జీవం గల జీవితాన్ని ఎంచుకోండి - (యోహాను 3:16-17). మీ కుటుంబ సభ్యుల రక్షణ కోసం హృదయపూర్వకంగా ప్రార్థించండి.
ప్రార్థన
ప్రియమైన ప్రభువైన యేసు, నీవు దేవుని కుమారుడవని నేను నమ్ముతున్నాను. నీవు 2,000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి వచ్చావని నేను నమ్ముతున్నాను. నీవు సిలువపై నా కోసం చనిపోయావని మరియు నా రక్షణ కోసం నీ రక్తాన్ని చిందించావని నేను నమ్ముతున్నాను. నీవు మృతులలో నుండి లేపబడి ఉన్నత స్థానానికి ఆరోహణమాయ్యావని నేను నమ్ముతున్నాను. నీవు మళ్లీ ఈ లోకంలోకి తిరిగి రాబోతున్నావని నేను నమ్ముతున్నాను. నా పాపాన్ని క్షమించు. ఇప్పుడే నీ అమూల్యమైన రక్తంతో నన్ను శుద్ధికరించు. నా హృదయంలోకి రా. ఇప్పుడే నా ప్రాణాన్ని రక్షించు. నా జీవితాన్ని నేను నీకు అప్పగిస్తున్నాను. ఇప్పుడే నేను నిన్ను నా రక్షకునిగా, నా ప్రభువుగా మరియు నా దేవుడిగా స్వీకరిస్తున్నాను.

Join our WhatsApp Channel


Most Read
● ఒక విషయం: క్రీస్తులో నిజమైన ధనమును కనుగొనడం
● కృప వెంబడి కృప
● అద్భుతాలలో పని చేయుట: కీ#1
● దేవుడు భిన్నంగా చూస్తాడు
● మీరు యుద్ధంలో ఉన్నప్పుడు: పరిజ్ఞానము
● గొప్ప ఉద్దేశాలు జరగడానికి చిన్న చిన్న కార్యాలు
● మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారు?
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్