english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. సంబంధాలలో సన్మాన నియమము
అనుదిన మన్నా

సంబంధాలలో సన్మాన నియమము

Wednesday, 9th of July 2025
0 0 43
Categories : ఘనత (Honour) సంబంధాలు (Relationships)
మీరు మీ సంబంధాలలో నెరవేర్పు చూడాలనుకుంటే, అది పనిలో ఉండుట, ఇంట్లో లేదా ఏ ప్రదేశంలోనైనా, మీరు సన్మాన సూత్రాన్ని నేర్చుకోవాలి.

 మీరు సన్మానించేవి మీ వైపుకు వస్తాయి, మరియు మీరు నిందించేవి మీ నుండి దూరమవుతాయి. ఉదాహరణకు, మీరు డబ్బును ఉపయోగించడం ద్వారా మరియు దానిని తెలివిగా పెట్టుబడి పెట్టడం ద్వారా సన్మానించినప్పుడు, డబ్బు మీ దగ్గరకు వస్తుంది; లేకపోతే, మీరు దానిని వెతకాలి వస్తుంది. ఈ సన్మాన సూత్రాన్ని సంబంధాలకు కూడా అన్వయించవచ్చు.

పాత నిబంధనలో, దేవుడు తన ప్రజలకు 10 ఆజ్ఞలను ఇచ్చాడు.

మొదటి నాలుగు ఆజ్ఞలు దేవుని సన్మానించడంలో వ్యవహరిస్తాయి.
చివరి ఆరు ఆజ్ఞలు ప్రజలను సన్మానించడంలో వ్యవహరిస్తాయి.

నేను ముందుకు వెళ్ళే ముందు, గత కాలంలో, సన్మాన సూత్రాన్ని పాటించడంలో నేను చాలా తప్పులు చేశానని అంగీకరించాలి. అయినప్పటికీ, నా చేతిని ఓపికగా పట్టుకొని నాకు బోధిస్తున్న ధన్యుడగు పరిశుద్దాత్మకు నేను నిత్య కృతజ్ఞుడను.

మన చుట్టుపక్కల ప్రజలను చూసినప్పుడు, చిరాకు కలిగించే అలవాట్లు, తీవ్రమైన నిరుత్సాహాలు, వైఫల్యాలను చూడటానికి మనకు మనస్తత్వశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ అవసరం లేదు మరియు ఆ మంటి ఘటములలో, దేవుడు ఐశ్వర్యము దాచిపెట్టాడు అనే విషయాన్ని మరచిపోండి. (2 కొరింథీయులు 4:7)

అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు, ". ....మన మూలమైనది కాక దేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు" (2 కొరింథీయులు 4:7)

మనము విజయవంతమైన సంబంధాలను నిర్మించాలంటే, గత సాధారణ మానవ బలహీనతలను చూడటం ద్వారా ఒకరినొకరు గౌరవించడం నేర్చుకోవాలి మరియు మనలో ప్రతి ఒక్కరిలో నివసించే అద్భుతమైన విలువను అభినందించాలి. మనలో ప్రతి ఒక్కరికి మరొకరికి ఇచ్చి పుచ్చుకునేది ఉంది. ఈ సత్యాన్ని మనం గ్రహించినప్పుడు, ఒకరికొకరిలో సానుకూల ఆలోచనలు మరియు భావాలు పెరుగుతాయి. దీనికి విపరీతమైనది ఏమిటంటే, మనము దీన్ని చేయకపోతే, మనము ఒకరినొకరు పెద్దగా పట్టించుకోము.

మీరు సన్మానించడానికి ఎవరిని ఎంచుకుంటారో అప్పుడు మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది మరియు మీరు మీ జీవితంలో విఫలమైతే, మీరు నిందించడానికి ఎంచుకున్న వ్యక్తి కారణంగా ఉంటుంది.

ఏదేమైనా, పదాలు మరియు భావాలకు మించి, నిజమైన సన్మానం పనులలో మరియు కార్యాలలో వ్యక్తమవుతుంది.

అడగడానికి కొన్ని ప్రశ్నలు?
నేను నా కుటుంబాన్ని (నా భార్య, పిల్లలను) తేలికగా తీసుకున్నాన?
నాతో పనిచేసే వ్యక్తులను నేను తేలికగా తీసుకున్నాన?
నా జీవితంలో దేవుని దాసుని, దాసురాళ్లుని నేను తేలికగా తీసుకున్నాన?

ఈ పద్ధతిలో ప్రతిబింబ ప్రక్రియ ద్వారా వెళ్లి మీరు వారిని సన్మానించే మార్గాల గురించి ఆలోచించండి. గుర్తుంచుకోండి, మీరు ఏదైతే విత్తుతారో అదే కోస్తారు. మీరు సన్మానం విత్తుతే, అది మీకు తిరిగి వస్తుంది.

Bible Reading: Psalms 108-117
ప్రార్థన
తండ్రీ దేవా, నా జీవితంలో ప్రతి దీవెనకు వందనాలు. నీవు ప్రతి మహిమ మరియు స్తుతులకు అర్హులు. నిన్ను మరియు నీ ప్రజలను సన్మానించడానికి నాకు నేర్పు. యేసు నామంలో. ఆమెన్.




Join our WhatsApp Channel


Most Read
● మన ఎంపికల ప్రభావం
● నీతియుక్తమైన కోపాన్ని స్వీకరించడం
● భాషలలో మాట్లాడుట మరియు అభివృద్ధి చెందుట
● ప్రజలు సాకులు చెప్పే కారణాలు - పార్ట్ 1
● ఆరాధన యొక్క పరిమళము
● వివేచన v/s తీర్పు
● సరైన వాటి మీద దృష్టి పెట్టుట
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్