english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. ప్రభువును ఎలా ఘనపరచాలి
అనుదిన మన్నా

ప్రభువును ఎలా ఘనపరచాలి

Wednesday, 30th of July 2025
0 0 56
Categories : ఆరాధన (Worship) స్తుతి (Praise)
నేను చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చానని మీలో చాలా మందికి తెలుసు. విషయాలు అంత తేలికగా జరగలేదు, కానీ మా నాన్న మరియు అమ్మ మమ్మల్ని, ముగ్గురు పిల్లలను పెంచడంలో గొప్ప పని చేసారు. నాకు ఒక పుట్టినరోజు గుర్తుంది, నాకు భూతద్దం కొనివ్వమని అమ్మని అడిగాను. నేడు, ఇది పిల్లలకు వింత విలువను కలిగి ఉండకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో, ఇది ప్రత్యేకమైనది.

నేను నా భూతద్దం తీసుకున్నప్పుడు చీమలు వాటి రంధ్రాల నుండి బయటకు వస్తున్నట్లు చూసాను. అవి చాలా పెద్దవిగా కనిపించాయి; అవి చాలా భిన్నంగా కనిపించాయి. నేను అన్ని వివరాలను చూడగలిగాను. నాలాంటి చిన్నారికి, ఇది సరికొత్త ప్రపంచాన్ని కలిగించింది.

నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. 
(కీర్తనలు 34:3)


ప్రభువును ఘనపరచడం ద్వారా, మీరు ఆయనని గొప్పగా చేయడం లేదు. కానీ అవును! ఆయన మీ మనస్సు యొక్క దృష్టిని నింపుతాడు, మరియు ఆయన మీ జీవితంలో గొప్ప భాగమవుతాడు.

అలాగైతే ప్రభువును ఎలా ఘనపరచాలి? మీరు దేని మీద శ్రద్ధ వహింస్తారో అదే మీ మనస్సులో అభివృద్ధవుతుంది.

దావీదు దేవుని గొప్పగా ఘనపరచాలనుకున్నాడు. అతడు ఇలా కూడా తెలియజేస్తున్నాడు: నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు. (కీర్తనలు 34:1-2)

ఇవి ప్రమాదకరమైన సమయాలు, మరియు మీ విజయ స్థానాన్ని కొనసాగించడానికి, మీరు సరైన విషయాలపై దృష్టి పెట్టాలి లేదా మీ దృష్టిని ఇవ్వాలి; లేకపోతే, అవి మీ ఆలోచనను మారుస్తుంది.

మీరు పని చేస్తున్నప్పుడు కూడా ఇంట్లో కొన్ని మృదువైన ఆరాధన సంగీతాన్నీ వినండి. ఆయనను స్తుతిస్తూ ఉండండి, రోజంతా ఆరాధన పాటలు పాడుతూ ఉండండి. ఇది మీ హృదయాన్ని మరియు మనస్సును దేవునిపై దృష్టి ఉంచేలా చేస్తుంది. కాబట్టి మీరు దీన్ని చేసినప్పుడు, మీరు ఆయనను ఘనపరుస్తారు మరియు నామాన్ని గొప్పగా చేస్తారు. దేవుడు మీ జీవితంలో పెద్ద భాగం అవుతాడు, మరియు మీ మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని జయించడానికి మీకు శక్తి లభిస్తుంది.

Bible Reading: Isaiah 24-27
ప్రార్థన
తండ్రీ దేవా, నీవు జగత్తు సృష్టికర్త అని మేము నీకు కృతజ్ఞత స్తుతులు తెలుపుతున్నాము. శాశ్వతమైన దేవా. నిత్యుడగు తండ్రి. నిజమైన దేవుడవు. మా హృదయాలు, మనసులు మరియు మా కళ్ళు నీపై దృష్టి పెట్టినప్పుడు, నీవు ఏమై యున్నావో అని, నిన్ను చూడాలని మేము ప్రార్థిస్తున్నాము. మేము నిన్ను ఘనపరుస్తాము మరియు యేసు నామమున నీకు మహిమ, కీర్తి మరియు స్తుతులను చెల్లిస్తాం, ఆమేన్.

Join our WhatsApp Channel


Most Read
● శాంతి మిమ్మల్ని ఎలా మారుస్తుందో తెలుసుకోండి
● ఐక్యత మరియు విధేయత దర్శనం
● ఏదియు దాచబడలేదు
● క్రైస్తవులు దేవదూతలను ఆజ్ఞాపించవచ్చా?
● ఏదియు దాచబడలేదు
● ఇతరులకు ప్రకవంతమైన దారి చూపుట
● మంచి నడవడిక నేర్చుకోవడం
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్