english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుని యొక్క 7 ఆత్మలు
అనుదిన మన్నా

దేవుని యొక్క 7 ఆత్మలు

Sunday, 17th of August 2025
0 0 35
Categories : దేవుని 7 ఆత్మలు (The 7 Spirits of God)
యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూత భవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు (ప్రకటన 1:4)

"...ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలు" అనే చిత్రమైన వాక్యాన్ని గమనించండి.

ఒకే ఒక ఆత్మ ఉంది - పరిశుద్దాత్మ.

ఏడు అనేది బైబిలు ప్రతీకవాదంలో ఎల్లప్పుడూ సంపూర్ణత లేదా పరిపూర్ణతను సూచించే సంఖ్య. ఈ విధంగా, 'ఏడు' అనే సంఖ్య క్రైస్తవునికి పరిశుద్దాత్మ శక్తులు మరియు ఆయన వివిధ కార్యాలు లేదా పరిచర్యల సంపూర్ణతను సూచిస్తుంది.

"యోసేపుకు తన తండ్రి యాకోబు ఇచ్చిన విచిత్రమైన నిలువు టంగీ కుట్టించెను" అని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 37:3). బైబిలు పండితులు ఈ నిలువు టంగీ పరిశుద్ధాత్మ యొక్క ఆవరణకు ప్రతీక అని అంగీకరిస్తున్నారు. యోసేపు పాత నిబంధనలో క్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు ఇక్కడ ప్రభువైన యేసయ్య అనేక నిలువు టంగీని ధరించి ఉన్నాడు, తన పరలోకపు తండ్రి ద్వారా ఆయనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ యొక్క ఆవరణ.

ఇప్పుడు ప్రవక్త యెషయా, యెషయా 11:2లో క్రీస్తు గురించి ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ యొక్క ఏడు విభిన్నమైన పరిచర్యల గురించి స్పష్టంగా చెప్పాడు:

యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. (యెషయా 11:2)

1. యెహోవా ఆత్మ
2. జ్ఞానం గల ఆత్మ
3. వివేకము గల ఆత్మ
4. ఆలోచన గల ఆత్మ
5. బలము గల ఆత్మ
6. తెలివి గల ఆత్మ
7. యెహోవా యెడల భయభక్తుల ఆత్మ

"దేవుని ఏడు ఆత్మలు" పరిశుద్ధాత్మ యొక్క ఏడు 'గుణాలు'. ఇవి ఆత్మ యొక్క సంపూర్ణతను కూడా సూచిస్తాయి. ఆత్మ యొక్క ఈ సంపూర్ణత యేసు ప్రభువుపై ఆధారపడింది. ఒక ప్రిజం కాంతిని ఏర్పరుచుకునే ఏడు వేర్వేరు రంగులను ప్రతిబింబించినట్లు, అదేవిధంగా మన ప్రభువు ఆత్మ యొక్క ప్రతి విభిన్నమైన గుణము కానీ ఏకీకృతమైన విధులను కూడా వ్యక్తపరిచాడు.

నేను ఈ దేశం అంతటా మరియు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలకు ఎక్కడికి వెళ్లినా. నేను ఒకే పరిశుద్దాత్మ పరిచారకుని వేర్వేరు వ్యక్తులకు వివిధ మార్గాల్లో వ్యక్తపరచడం చూసాను. కొందరికి, ఆయన బలముతో పరిచర్య చేసాడు - వారు స్వస్థత పొందారు, విడుదల చేయబడ్డారు. కొందరికి, ఆయన జ్ఞానాన్ని, కొందరికి వివేకముతో పరిచర్య చేసాడు. మీరు "దేవుని ఏడు ఆత్మలు" యొక్క 'సంపూర్ణతను' పొందుకోవాలనుకుంటే, మీరు చేయాల్సిందల్లా అడగడం. (లూకా 11:13 చదవండి)

Bible Reading: Jeremiah 19-22

ఒప్పుకోలు

యేసు నామంలో, ప్రభువు యొక్క ఆత్మ నా మీద ఉంది, జ్ఞానం మరియు వివేకము గల ఆత్మ, ఆలోచన మరియు బలము గల ఆత్మ, తెలివి మరియు ప్రభువు యెడల భయభక్తుల గల ఆత్మ నాలో ఉన్నాయి.


యెహోవా భయము నాకు ఇంపైన సువాసనగా ఉండును, మరియు కంటి చూపును బట్టి నేను తీర్పుతీర్చను, నేను విను దానిని బట్టి విమర్శ చేయను (యెషయా 11:2-3)


Join our WhatsApp Channel


Most Read
● ఆ వాక్యన్ని పొందుకునట
● పన్నెండు మందిలో ఒకరు
● 21 రోజుల ఉపవాసం: 9# వ రోజు
● దుష్ట ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం
● పాపముతో యుద్ధం
● 38 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● తన్నుతాను మోసపాచుకోవడం అంటే ఏమిటి? - II
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్