అనుదిన మన్నా
దైవికమైన సమాధానము ఎలా పొందాలి
Monday, 10th of June 2024
0
0
539
Categories :
ప్రార్థన (Prayer)
శాంతి (Peace)
ప్రార్థన అనేది సహజమైన కార్యము కాదు. సహజత్వ మనిషికి, ప్రార్థన చేయడం అంత సులభంగా రాదు మరియు ఈ రంగంలో చాలా మంది కష్టపడుతున్నారు. ఈ సూపర్‌సోనిక్ యుగంలో, ప్రజలు శబ్దం యొక్క వేగంతో తిరుగుతూ, వేగంగా మరియు అతి వేగంగా పనులను చేయడానికి ఇష్టపడతారు, ప్రార్థన చేయడం వారికి బాధించే పనిలా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యక్తి తన మోకాళ్లపై పడి, చూసిన మరియు కనిపించని అన్ని వస్తువులు ఎవరి ద్వారా సృష్టించబడిందో ఆయనకు మొఱ్ఱ పెట్టడం జరుగుతుంది. (యోహాను 1:3)
విషాదం, పెద్ద సమస్య లేదా వైఫల్యానికి గురైన వ్యక్తులను మీరు సహజంగా అడిగినట్లైతే, "మీరు మోకాళ్లపై పడి, ప్రభువుకు మీ హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఏమి జరిగింది?" కొందరు నాతో అన్నారు, "నేను వివరించలేని లోతైన శాంతిని (సమాధానము) అనుభవించాను", మరికొందరు, "ఇది ఒక భారం తొలగిపోయినట్లు ఉంది", "నేను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా భావించలేదు."
మా అమ్మ చనిపోయిందని డాక్టర్ నుండి వార్త తెలియగానే, నా హృదయంలో ఒక లోతైన బాధ ప్రవేశించింది. నేను ఏడవలేకపోయాను. అందరూ నా చుట్టూ ఏడుస్తున్నారు, కానీ నేను దానిని బయటికి రానివ్వలేదు. రోజుల తరబడి ప్రార్థనలో కష్టపడ్డాను.
ఒకరోజు, నేను అర్థరాత్రి ప్రార్థిస్తున్నప్పుడు, నా ఆత్మ ఒక లోతైన నిరీక్షణతో నిండిపోయింది. నేను దానిని వివరించలేను. నేను నిజాయితీగా చెబుతున్నాను, నేను దేవుని స్వరాన్ని వినలేదు, కానీ ఆయన స్వరం నా ఆత్మీయ మనిషితో మాట్లాడుతూ, "వీటన్నిటి గుండా నీవు నా యందు విశ్వాసిస్తూన్నావా?" నేను విపరీతంగా ఏడవడం ప్రారంభించి, "అవును ప్రభువా!" నేను వర్ణించలేని లోతైన శాంతి (సమాధానము) నా ఆత్మను నింపింది. నా మీద నుండి ఒక పెద్ద భారం తొలగినట్లు అనిపించింది.
ఆ రోజు ఫిలిప్పీయులకు 4:6-7 గురించి నేను లోతుగా అర్థం చేసుకున్నాను
దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును.
ఈ సమాధానము అనుభవించడానికి, మీరు కొన్ని పర్వతాలను ఎక్కడం లేదా వందల మైళ్లు ప్రయాణించాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటే ఈ దైవికమైన సమాధానము అనుభవించవచ్చు. మీరు ప్రతిరోజూ ప్రభువుకు దగ్గరవుతున్నప్పుడు మరియు ఆయనతో లోతైన సాన్నిహిత్యానికి కట్టుబడి ఉన్నప్పుడు, ఆయన సమాధానము భయాన్ని పారద్రోలి మరియు ఆనందాన్ని కలిగించే కావలిగా మారుతుంది. దేవుని సమాధానము అనేది ఒక వాస్తవికత, మరియు మీరు కూడా ఈ వాస్తవాన్ని ప్రతిరోజూ అనుభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.

ప్రార్థన
తండ్రీ, ఓ దేవా, నీ దృఢమైన, నమ్మకమైన ప్రేమ అనుసారంగా; నీ కరుణ యొక్క మహాత్యాన్ని బట్టి నా యందు కృప చూపుము. నేను నీ యొద్దకు వచ్చిన్నప్పుడు, ఈ రోజు మరియు నా జీవితంలో ప్రతి రోజు నీ దైవికమైన సమాధానము అనుభవించడానికి నాకు సహాయం చేయి. యేసు నామంలో. ఆమెన్.
Join our WhatsApp Channel
Most Read
● సాకులు చెప్పే కళ● ఆరాధనను జీవన విధానంగా మార్చుకోవడం
● పందెంలో గెలవడానికి రెండు పి(P)లు
● పురాతన మార్గములను గూర్చి విచారించుడి
● అరుపు కంటే కరుణింపు కొరకు రోదన
● తప్పుడు ఆలోచనలు
● నిత్యమైన పెట్టుబడి
కమెంట్లు