english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. దేవుని 7 ఆత్మలు: ప్రభువు యొక్క ఆత్మ
అనుదిన మన్నా

దేవుని 7 ఆత్మలు: ప్రభువు యొక్క ఆత్మ

Monday, 18th of August 2025
0 0 63
Categories : ఆత్మ యొక్క పేర్లు మరియు బిరుదులు (Names and Title of the Spirit) దేవుని 7 ఆత్మలు (The 7 Spirits of God) దేవుని ఆత్మ (Spirit of God)
యెషయా ప్రవక్త పేర్కొన్న ఏడు ఆత్మలలో మొదటిది ప్రభువు యొక్క ఆత్మ. దీనిని రాజ్యమేలే ఆత్మ లేదా ఆధిపత్యం యొక్క ఆత్మ అని కూడా అంటారు.

సేవ చేసే శక్తితో మనల్ని అభిషేకించేవాడు ఆయనే. పాత మరియు క్రొత్త నిబంధనలలో ఆయనను వర్ణించిన ప్రతిసారీ, ఆయన ఎల్లప్పుడూ "వచ్చినప్పుడు."

న్యాయాధిపతులు 6లో, శత్రు దేశాలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో యుద్ధానికి తమ గుడారాన్ని వేసినప్పుడు, అది ఇలా సెలవిస్తుంది: ​యెహోవా ఆత్మ గిద్యోనును మీదికి వచ్చెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి (న్యాయాధిపతులు 6:34)

సమ్సోనును కట్టివేసి ఫిలిష్తీయులచే బంధింపబడినప్పుడు, బైబిలు ఇలా సెలవిస్తుంది: అతడు లేహీకి వచ్చువరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్లు అగ్ని చేత కాల్చబడిన జనుపనారవలె నాయెను; సంకెళ్లును అతనిచేతులమీదనుండి విడిపోయెను. అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను. (న్యాయాధిపతులు 15:14-15)

ప్రభువు ఆత్మ మీ మీదికి వచ్చిన తర్వాత, మీరు ఇక సామాన్య వ్యక్తులు కారు. దేవుని చిత్తానికి అనుగుణంగా ఏదైనా చేసే ధైర్యం మీకు ఉంటుంది. "దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు." (2 తిమోతి 1:7)

యేసు ప్రభువు గొప్ప శబ్దముతో ప్రకటించాడు,
" ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగి ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు" (లూకా 4:18-19)

నేను పరిచర్య చేయకముందే చాలా సార్లు, ప్రభువు ఆత్మ యొక్క అభిషేకం నా మీదకు రావాలని నేను ఎదురు చూస్తుండేవని. అప్పటి నుండి అది నేను కాదు అని మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు. నేను పూర్తిగా భిన్నమైన వ్యక్తిని.

మంచి శుభవార్త ఏమిటంటే, ప్రభువైన యేసుపై ఉన్న అదే ప్రభువు ఆత్మ మనపై కూడా ఉంది. మీరు మరియు నేను యేసు ప్రభువు చేసిన ప్రతి శక్తివంతమైన కార్యాలను మరి ఎక్కువగా చేయగలము.

Bible Reading: Jeremiah 23-24
ఒప్పుకోలు

ప్రభువు ఆత్మ నామీద ఉంది. నేను యేసు నామంలో గొప్ప మహా కార్యాములను చేయుదును.


Join our WhatsApp Channel


Most Read
● మానవుని హృదయం
● హెచ్చరికను గమనించండి
● వివేకం పొందుట
● సరైన బంధాలను ఎలా నిర్మించుకోవాలి
● తిరస్కరణ మీద వియజం పొందడం
● వరుడిని కలవడానికి సిద్ధపడుట
● విశ్వాసం అంటే ఏమిటి?
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్