english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 09 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
అనుదిన మన్నా

09 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన

Tuesday, 19th of December 2023
1 1 798
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
మీ దైవ (విధి) సహాయకులకు కలుసుకోవడం

యెహోవా వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. (కీర్తనలు 121:2)

మీరు సాధించడానికి మరియు కావాలని దేవుడు ఉద్దేశించినది మీ దైవం (విధి). ఇది మీ జీవితం కోసం దేవుని యొక్క వివరణాత్మక ప్రణాళిక (బ్లూప్రింట్). ప్రతి వ్యక్తి సహాయం మరియు సహాయబడటం కోసం రూపొందించబడ్డాడు. ఎవరూ ఒంటరిగా తమ విధిని నెరవేర్చుకోలేరు.

దేవుడు మనలను ఆయన మీద ఆధారపడేలా సృష్టించాడు, కాబట్టి మన మానవ శక్తితో మనం చేయలేని అనేక విషయాలు ఉన్నాయి. మనకు బలం, జ్ఞానం, వివేకం మరియు సామర్థ్యాలు పరిమితం చేయబడ్డాము. మనం దేవుని మీద ఆధారపడితే, పౌలులా ధైర్యంగా ప్రకటించి, "నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను" అని చెప్పగలము. (ఫిలిప్పీయులకు 4:13). దేవుడు మన సహాయానికి మూలం, మరియు ఆయన వివిధ మార్గాల ద్వారా మనకు సహాయాన్ని పంపుతాడు. మనుష్యులు, దేవదూతలు, ప్రకృతి మొదలైనవి.

విధి సహాయకుల యొక్క పరిచర్య గురించి లేఖనాల అంతటా ఉంది మరియు ఈ రోజు మనం వాటిలో కొన్నింటిని అధ్యయనం చేద్దాం. 

విధి సహాయకులకు యొక్క బైబిల్ ఉదాహరణలు

1. ఆదాము
విధి సహాయకుల సేవను ఆస్వాదించిన మొదటి వ్యక్తి ఆదాము. ఆదాముకు సహాయం చేయడానికి హవ్వను తయారు చేశారు. ఆమె అతనికి "సహాయకురాలిగా" రూపొందించబడింది. (ఆదికాండము 2:18)

2. యోసేపు
ఆదికాండము 40:14లో, యోసేపు భక్ష్యకారుల అధిపతి యొక్క కలను వివరించిన తర్వాత, అతడు భక్ష్యకారుల అధిపతి సహాయం కోసం వేడుకున్నాడు మరియు అతడు చెరసాల నుండి ఎలా బయటపడతాడో చూడాలి, కాని భక్ష్యకారుల అధిపతిని అతని గురించి రెండేళ్లపాటు మరచిపోయాడు (ఆదికాండము 40:22, 41:1, 9-14). దేవుడు మీకు సహాయం చేసినప్పుడు మాత్రమే ప్రజలు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు.
 
3. దావీదు
దావీదు తన జీవితంలో వివిధ సమయాల్లో సహాయం పొందాడు. సహాయాన్ని ఆస్వాదించడం అంటే ఏమిటో అతడు అర్థం చేసుకున్నాడు, అందుకే అతడు వివిధ సమయాల్లో సహాయం గురించి వ్రాసాడు.

దావీదు దండు దేవుని సైన్యమువలె మహాసైన్యమగునట్లు ప్రతిదినమున అతనికి సహాయము చేయువారు అతనియొద్దకు వచ్చు చుండిరి. (1 దినవృత్తాంతములు 12:22)

ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరల జరుగగా దావీదు తన సేవకులతోకూడ దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మ సిల్లెను. అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బిబేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలదినేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిచూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి. (2 సమూయేలు 21:15-17)

విధి సహాయకుడిని ఎన్నుకునే వ్యక్తి మీరు కాదు, దేవుడు మీకు సహాయం చేయడానికి సిద్ధం చేసిన వారితో మిమ్మల్ని జతపరుస్తాడు.

నేటి ప్రార్థన తర్వాత, మీరు దేవుని నుండి అద్భుతమైన సహాయాన్ని పొందడం ప్రారంభిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. మూయబడిన తలుపులు మళ్లీ తెరవబడతాయి మరియు ప్రజలు యేసు నామములో మీకు మేలు చేయడం మొదలుపెడుతారు.

సహాయం యొక్క రకాలు

1. దేవుని సహాయం
దేవుడు మన సహాయానికి ప్రధాన మూలం. దేవుడు మీకు సహాయం చేస్తే, మానవుడు మీకు సహాయం చేయాలి. మీకు సహాయం చేయమని ప్రజలను వేడుకునే బదులు, దేవుని సహాయం కోరుతూ ప్రార్థనలో కొంత సమయం గడపండి. మీకు సహాయం చేయడానికి దేవుడు ఎవరి హృదయాలనైన కదిలించగలడు.

నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు 
నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము 
నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును 
నీకు సహాయము చేయువాడను నేనే 
నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును. (యెషయా 41:10)

ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు 
ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. (సామెతలు 16:7)

2. మనిష్యుని సహాయం
దేవుడు ఏలీయా ప్రవక్తతో, తనను పోషించడానికి ఒక విధవరాలిని సిద్ధం చేశానని చెప్పాడు. ప్రతి ఒక్కరికి సహాయం కావాలి మరియు మీరు దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన మీ కోసం సిద్ధం చేసిన సరైన వ్యక్తి వద్దకు మిమ్మల్ని పంపుతాడు. (1 రాజులు 17:8-9)

సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అను గ్రహింపబడియున్న దేవుని కృపనుగూర్చి మీకు తెలియ జేయుచున్నాము. 2 ఏలాగనగా, వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా, అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్త రించెను. 3 ఈ కృప విషయములోను, పరిశుద్ధులకొరకైన పరిచర్యలో పాలుపొందు విషయములోను, మనఃపూర్వక ముగా మమ్మును వేడుకొనుచు, 4 వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యముకంటె ఎక్కువగాను తమంతట తామే యిచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. 5 ఇదియు గాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు. (2 కొరింథీయులు 8:1-5 CEV)

3. దేవదూతల సహాయం
యెరికో గోడలను నాశనం చేయడంలో యెహోషువా మరియు ఇశ్రాయేలీయులు దేవదూతల సహాయాన్ని సంతోషించారు.

13 యెహోషువ యెరికో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, దూసిన కత్తి చేత పట్టుకొనియున్న ఒకడు అతని యెదుట నిలిచియుండెను; యెహోషువ అతనియొద్దకు వెళ్లినీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధులపక్షముగా నున్నవాడవా? అని అడుగగా 14 అతడుకాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసినా యేలినవాడు తన దాసునికి సెల విచ్చునదేమని అడిగెను. 15 అందుకు యెహోవా సేనాధిపతి నీవు నిలిచియున్న యీ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసి వేయుమని యెహోషువతో చెప్పగా యెహో షువ ఆలాగు చేసెను. (యెహోషువ 5:13-15)

ఈ రోజు మీరు ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువు మీ కోసం దేవదూతల సహాయాన్ని విడుదల చేస్తాడని నేను ప్రవచిస్తున్నాను. అసాధ్యమైనది, సాధించలేని అనిపించేది యేసు నామములో జరుగుతుంది.

4. భూమి నుండి సహాయం
ప్రకృతి దేవుని స్వరానికి ప్రతిస్పందిస్తుంది మరియు అవసరమైనప్పుడు ఆయన ప్రజల మేలు కోసం పని చేస్తుంది. మన మంచి కోసం సమస్తము కలిసి పనిచేస్తాయని లేఖనము చెబుతోంది. సమస్త వస్తువులు ప్రకృతిని కలిగి ఉంటాయి; లేఖనాలలో మనకు లభించే ఆశీర్వాదాలను మాత్రమే మనం విశ్వసించవలసి ఉంటుంది.

భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను. (ప్రకటన 12:16)

యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయు లను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా, "నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడియున్నది గదా. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి యించు మించు ఒక నా డెల్ల అస్తమింప త్వరపడలేదు." (యెహోషువ 10:12-13)

తదుపరి అధ్యయనం: కీర్తనలు 121:1-8, కీర్తనలు 20:1-9, ప్రసంగి 4:10, యెషయా 41:13
ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. తొందరపడకండి.

తండ్రీ, దయచేసి యేసు నామములో, నీ పరిశుద్ధ స్థలము నుండి నాకు సహాయాన్ని పంపు. (కీర్తనలు 20:2)

నేను నా జీవితంలో విధిని ఆపేవాని యొక్క కార్యాలను యేసు నామములో కుంటిపడేలా చేస్తున్నాను. (యోహాను 10:10)

నన్ను మరియు నా విధి సహాయకులను నిరోధించే లేదా కప్పి ఉంచే ఏదైనా, యేసు నామములో పరిశుద్దాత్మ యొక్క అగ్ని ద్వారా నాశనం అవును గాక. (యెషయా 54:17)

నా విధి సహాయకుల ముందు నన్ను నిందించే, ప్రతి చెడు స్వరం, యేసు నామములో మౌనము వహించును గాక. (ప్రకటన 12:10)

ఓ దేవా, నీ దయతో, యేసు నామములో నా తదుపరి స్థాయికి నీవు సిద్ధపరచిన సహాయకులతో నన్ను కలుపు. (నిర్గమకాండము 3:21)

ప్రభువా, యేసు నామములో నా జీవితానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే స్థలములో నా కోసం స్వరాలను లేవనెత్తు. (సామెతలు 18:16)

నాకు వ్యతిరేకంగా నా సహాయకులను తారుమారు చేసే ఏదైనా శక్తి, యేసు నామములో ఆ శక్తుల ప్రభావాన్ని నేను నాశనం చేస్తున్నాను. (ఎఫెసీయులకు 6:12)

నా విధి సహాయకులు చంపబడరు మరియు వారికి ఎటువంటి చెడు జరగదు, యేసు నామములో. (కీర్తనలు 91:10-11)

నేను వాగ్దానం యొక్క ప్రతి ఆత్మను మరియు నా జీవితానికి వ్యతిరేకంగా పనిచేయకుండా విఫలపరచి యేసు నామములో నిషేధిస్తున్నాను. (2 కొరింథీయులకు 1:20)

తండ్రీ, యేసు నామములో నాకు అనుకూలంగా ప్రజలను ప్రభావితం చేయడానికి నీ పరిశుద్ధ దేవదూతలను విడుదల చేయి. (హెబ్రీయులకు 1:14)

కరుణా సదన్ పరిచర్య యొక్క విధి సహాయకులు ఇప్పుడు యేసు నామములో ముందుకు వచును గాక.. (1 కొరింథీయులకు 12:28)

నేను ఈ 40 రోజుల ఉపవాసములో ప్రతి వ్యక్తి మరియు వారి కుటుంబాల మీద యేసు రక్తాన్ని అనవహిస్తున్నాను. (నిర్గమకాండము 12:13)


Join our WhatsApp Channel


Most Read
● విజయానికి పరీక్ష
● వాక్యం యొక్క సమగ్రత
● జీవితపు తుఫానుల మధ్య విశ్వాసాన్ని కనుగొనడం
● 10 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఒక ముఖ్యమైన మూలం
● జయించే విశ్వాసం
● స్తుతి ఫలములను తెస్తుంది
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్