english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. Day 13: 40 Days Fasting & Prayer
అనుదిన మన్నా

Day 13: 40 Days Fasting & Prayer

Saturday, 23rd of December 2023
0 0 856
Categories : ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
మీ సంఘాన్ని కట్టుడి

మరియు నీవు పేతురువు; ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. (మత్తయి 16:18)

సంఘం అనేది విశ్వాసుల సమావేశం, పిలవబడిన వారు. చాలామందికి సంఘం గురించి పరిమిత అవగాహన ఉంది మరియు వారు సంఘాన్ని ఒక భవనానికి పరిమితం చేశారు. భవనం సంఘము కంటే విభిన్నంగా ఉంటుంది; భౌతిక ప్రార్థనా స్థలం నిజమైన సంఘం అని ఎప్పుడూ అనుకోకండి.

సంఘం కోసం గ్రీకు పదం "ఎక్లేసియా", దీని అర్థం పిలవబడిన వారి సమావేశం. మనము ప్రభువు విమోచించబడ్డాము, చీకటి నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డాము. (1 పేతురు 2:9)

విశ్వాసులే సంఘం, మరియు సంఘం ఇక్కడ భూమి మీద ఉండే క్రీస్తు శరీరము. వివిధ సిద్ధాంతాలు క్రైస్తవులను వివిధ వర్గాలుగా విభజించాయి. "విశ్వాసులు"గా ఐక్యంగా ఉండడానికి బదులుగా, ప్రతి ఒక్కరూ క్రీస్తు యొక్క కారణాన్ని పణంగా పెట్టి తమ వర్గ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మనం "విశ్వాసులు"గా ఐక్యత స్థానానికి తిరిగి రావాలి మరియు క్రైస్తవులు ఐక్యంగా ఉండాలంటే ప్రార్థన అవసరం.

మనము భూసంబంధమైన పరిధిలో దేవుని పాద సైనికులం, మరియు సంఘాన్ని నిర్మించాలనే దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి మన దేశముకై వ్యూహాత్మక ప్రార్థనలు చేయాలి. దేవుడు ఏది చేయాలనుకున్నా దానికి తప్పక ప్రార్థించాలి. మన ప్రార్థనే ఆయన చేయాలనుకున్నది చేయడానికి భూసంబంధమైన పరిధిలో ఆయనకు చట్టబద్ధమైన హక్కును ఇస్తుంది. ఆయన అలా ఉండాలని నిర్ణయించాడు మరియు భూసంబంధమైన పరిధిలో పనిచేయడానికి దేవుడు ఎంచుకున్న సిధ్ధాంతాలను మనం అర్థం చేసుకోవాలి.

క్రైస్తవులు ఐక్యంగా ఉన్నప్పుడు, చీకటి రాజ్యం చాలా మంది జీవితములో తన పట్టును కోల్పోతుంది మరియు మన దేశం రూపాంతరం చెందుతుంది. మన పాఠశాలలు, రాజకీయాలు, ఆరోగ్య సంరక్షణ, సైనిక, విద్య, వ్యాపారం, మీడియా మరియు కుటుంబం ఈ రూపాంతరాన్ని ఆనందిస్తాయి.

సంఘాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు:

1. సార్వత్రిక సంఘము
సార్వత్రిక సంఘము ప్రతి దేశంలోని విశ్వాసులందరినీ కలిగి ఉంటుంది.

2. స్థానిక సంఘము
స్థానిక సంఘము అనేది భౌగోళిక స్థలములోని ప్రజల సమూహం (విశ్వాసులు) ఆరాధన, ప్రార్థన, సహవాసం మరియు దేవుని గురించి తెలుసుకోవడానికి కలిసి కలుసుకుంటారు.

సంఘాన్ని ఇలా కూడా సూచించవచ్చు
1. దేవుని గృహము. (1 తిమోతి 3:15)

2. క్రీస్తు వధువు. (ప్రకటన 19:6-9, 21:2, 2 కొరింథీయులకు 11:2)

3. క్రీస్తు శరీరము. (ఎఫెసీయులకు 1:22-23)

4. దేవుని మందిరము. (1 పేతురు 2:5, ఎఫెసీయులకు 2:19-22)

5. దేవుని మంద (1 పేతురు 5:2-3)

6. ప్రభువు యొక్క ద్రాక్షతోట (యెషయా 5:1-7)

7. విశ్వాస గృహము (గలతీయులకు 6:10)

సంఘం యొక్క బాధ్యతలు

సంఘం యొక్క బాధ్యతలు మతపరమైన ఆరాధనకు మాత్రమే పరిమితం కాదు; మనం దాని కంటే ఎక్కువగా మన సమాజాలను ప్రభావితం చేయాలి. కాబట్టి, సంఘం యొక్క కొన్ని బాధ్యతలు ఏమిటి?

1. ఆరాధించడం
ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు చేయుడి. (ఎఫెసీయులకు 5:19)

2. ప్రభావితం చేయాలి
బలవంతముగా కాకుండా మన సమాజాలకు సరైన ఉదాహరణలను చూపడం ద్వారా మనము ప్రభావితం చేయాలి.

నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకు మాదిరిగా ఉండుము. (1 తిమోతి 4:12)

14 "మీరు లోకమునకు వెలుగైయున్నారు; కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు. 15 మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కాని అది యింటనుండువారికందరికి వెలు గిచ్చుటకై దీపస్తంభముమీదనే పెట్టుదురు. 16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి." (మత్తయి 5:14-16)

3. జీవితాలను మార్చడం
మనం మనుషులను చీకటి రాజ్యము నుండి వెలుగు రాజ్యాములోకి తీసుకురావాలి. మనుష్యులకు క్రీస్తు మరియు దేవుని రాజ్యమును గూర్చిన శుభవార్తను మనం సాక్ష్యమివ్వాలి. జీవితాలను మార్చే శక్తి సువార్తకు ఉంది.

సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది. (రోమీయులకు 1:16)

4. అపవాది యొక్క క్రియలను లయపరచాలి
మనుష్యుల జీవితాలలో అపవాది యొక్క పనులను మనం బంధించాలి, నష్టపరిచాలి మరియు నాశనం చేయాలి. మన సమాజాలకు దేవుడు, స్వస్థత, భద్రత, విమోచన మరియు సహాయం అవసరం. మనం ఆ స్థలములో నిలబడకపోతే, అవిశ్వాసులు తమ జీవితాల్లో సాతాను చేస్తున్న వాటిని వ్యతిరేకించలేరు.

అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి; అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. (1 యోహాను 3:8)

5. విజ్ఞాపన ప్రార్థన చేయాలి
రాజులు మరియు అధికారంలో ఉన్నవారి కోసం ప్రార్థించమని మనకు ఆజ్ఞా ఇవ్వబడింది. వారు అపవాది యొక్క ప్రాధమిక లక్ష్యం. వాడు అధికారంలో ఉన్నవారిని పట్టుకోగలిగితే, వాడు విశ్వాసులను మరియు భూమి మీద ఉన్న దేవుని రాజ్యాన్ని ప్రభావితం చేసే తప్పుడు చట్టాలను అమలు చేయగలడు. మన ప్రార్థనలు వారిని రక్షించగలవు మరియు వారు దేశము మరియు సంఘం కోసం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నిర్ధారిస్తాయి.

మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరి కొరకును 2 రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను. 3 ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది. 4 ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించు చున్నాడు. (1 తిమోతి 2:1-4)

6. ప్రేమతో నడుచుకోవాలి
మనం అవిశ్వాసుల పట్ల ప్రేమతో నడుచుకోవాలి. వారికి లేనిది మన దగ్గర ఉంది, అది దేవుని ప్రేమ. మనం దేవుని ప్రేమను ఎంత ఎక్కువగా చూపిస్తామో, అంత ఎక్కువగా వారు దేవుని వైపు ఆకర్షితులవుతారు.

క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి. (ఎఫెసీయులకు 5:2)

7. అధికారం చూపెట్టాలి
భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడంలో మరియు విస్తరించడంలో సంఘానికి అధికారం ఉంది.

ఇదిగో పాము లను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు. (లూకా 10:19)

విశ్వాసులుగా, మన దేశము కోసం ప్రార్థించే బాధ్యతను మనం పెంచుకోవాలి. మన దేశము యొక్క శాంతి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి మన శాంతి మరియు అభివృద్ధికి కూడా దారి తీస్తుంది.

నరకం యొక్క ద్వారాలు సంఘము యొక్క చేరువలో ఉన్న అన్ని మార్గాలతో పోరాడుతున్నాయి, అయితే మనము ప్రభువు మరియు ఆయన శక్తి యొక్క శక్తిలో బలంగా ఉండాలి మరియు విశ్వాసం యొక్క మంచి పోరాటము పోరాడాలి.

తదుపరి అధ్యయనం: ఎఫెసీయులకు 1:22-23, 1 కొరింథీయులకు 12:12-27

ప్రార్థన
1. తండ్రీ, నీ సంఘాన్ని భారతదేశములో యేసు నామములో నిర్మించు. (మత్తయి 16:18)

2. తండ్రీ, యేసు నామములో ఈ దేశము కోసం ప్రార్థించే ప్రార్థన భారాన్ని నాకు దయచేయి. (1 తిమోతి 2:1-2)

3. నేను ఇతర క్రైస్తవులతో నా విశ్వాసాన్ని కలుపొకొని మరియు ఈ నగరం మరియు దేశం యొక్క చీకటి కోటలను మేము బలహీనపరుస్తాము, యేసు నామములో. (2 కొరింథీయులకు 10:4)

4. ఓ దేవా, యేసు నామములో భారతదేశంలోని సంఘాల మీద నీ ప్రేమను కుమ్మరించు, తద్వారా మేము ఐక్యంగా ఉండి, భూమి మీద నీ రాజ్యం యొక్క అభివృద్ధికి కలిసి పని చేస్తాము. (యోహాను 17:21)

5. ఈ నగరం మరియు దేశం మీద, మేము యేసు నామములో క్రీస్తు కోసం నూతన సరిహద్దులను పొందుకుంటాము. (యెహోషువ 1:3)

6. దైవ సిధ్ధాంతాలు, విలువలు మరియు సంఘానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి చట్టాలు, వాటిని యేసు నామములో మార్చబడును గాక. (సామెతలు 29:2)

7. యేసు నామములో మేము పట్టణము మరియు దేశం మీద దేవుని శాంతిని విడుదల చేస్తున్నాము. (ఫిలిప్పీయులకు 4:7)

8. తండ్రీ, నీ చిత్తము యేసు నామములో మా పట్టణము మరియు దేశముపై నెరవేరును గాక. (మత్తయి 6:10)

9. తండ్రీ, పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం మరియు ఆయన బృందానికి మీరు ప్రతి పరిస్థితులలో మరియు ప్రతి సమయాల్లో, యేసు నామములో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ధైర్యం మరియు శక్తిని ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. (అపొస్తుల కార్యములు 4:29)

10. తండ్రీ, యేసు నామములో, కరుణా సదన్ సంఘ సేవల్లో మానవ జ్ఞానాన్ని మరియు వివేచనను అడ్డుకునే మరియు వైజ్ఞానిక ప్రపంచాన్ని మూగబోసే శక్తివంతమైన సంకేతాలు, అద్భుతాలు మరియు సూచకక్రియలు జరగాలని నేను వేడుకుంటున్నాను. (అపొస్తుల కార్యములు 2:22)

11. తండ్రీ, యేసు నామములో, నీవు పాస్టర్ మైఖేల్, ఆయన కుటుంబం మరియు బృందానికి అలౌకిక జ్ఞానం, వివేచన మరియు పునరుజ్జీవనానికి మరియు సంఘ పెరుగుదలకు మార్పు కలిగించే జనన కార్యక్రమాలు మరియు కార్యాలకు సంబంధించిన జ్ఞానంతో దీవించాలని నేను వేడుకుంటున్నాను. (యాకోబు 1:5)


Join our WhatsApp Channel


Most Read
● అందమైన దేవాలయము
● పందెంలో గెలవడానికి రెండు పి(P)లు
● ఆధ్యాత్మిక మహా ద్వారము యొక్క రహస్యాలు
● 21 రోజుల ఉపవాసం: #20 వ రోజు
● కార్యాలయంలో ఒక ప్రసిద్ధ వ్యక్తి - II
● మతపరమైన ఆత్మను గుర్తించడం
● 21 రోజుల ఉపవాసం: 7# వ రోజు
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్