english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. అరణ్య మృగం గల మనస్తత్వంపై విజయం పొందడం
అనుదిన మన్నా

అరణ్య మృగం గల మనస్తత్వంపై విజయం పొందడం

Tuesday, 9th of September 2025
0 0 92
Categories : క్రమశిక్షణ (Discipline) దుష్ట ప్రణాళికలను విచ్ఛిన్నం చేయడం (Breaking Evil Patterns) విడుదల (Deliverance)
హోరేబు (సినాయి పర్వతానికి మరొక పేరు) నుండి శేయీరు మన్నెపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు పదకొండు దినముల ప్రయాణము. (ద్వితీయోపదేశకాండమ 1:2)

అదొక విషాదకరం. వారి రాక ఆలస్యమవడానికి గల కారణం ప్రయాణ దూరం కాదు. ప్రయాణంలో వారి వైఖరి వల్ల వారి రాక ఆలస్యమైంది. దేవుని వాక్యం పట్ల మీ దృక్పథం మీరు జీవితంలో ఎంత ఎత్తుకు, ఎంత దూరం వెళ్తారో నిర్ణయిస్తుంది.

మనస్తత్వం అంటే ఏమిటి?

దేవుని వాక్యం పట్ల మన దృక్పథమును మనస్తత్వం అంటారు. మనస్తత్వం అనేది ఒక నిర్దిష్ట ఆలోచనా విధానం.

మన మనస్తత్వాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి?

చాలా తరచుగా, మన చుట్టూ ఉన్న సంస్కృతి, మనం అనుభవించే పరిస్థితులు, మనం అనుసంధానించే వ్యక్తులు మన ఆలోచనా విధానాన్ని రూపొందిస్తారు. అందుకే మనం చేసేది చేస్తాం. అందుకే మనం ఎలా ప్రవర్తిస్తామో అలా ప్రవర్తిస్తాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యం గుండా వెళుతుండగా, మనం 'అరణ్య మృగం గల మనస్తత్వం' అని పిలిచే దాన్ని వారు అభివృద్ధి చేసుకున్నారు.

కొంతమంది చాలా దైవభక్తి కలిగి ఉంటారు, చాలా ప్రార్థనలు చేస్తారు, కానీ వారు ఒక నిర్దిష్ట ఉద్యోగ స్థలంలో చేరిన క్షణం నుండి, కొందరు కొత్త దేశానికి వెళతారు, ఆపై వారు దేవునితో వారి నడకలో నిలువెచ్చని స్థితిలో ఉంటారు. వారు తాము ఉన్న సంస్కృతి లేదా దేశం యొక్క మనస్తత్వాలను అవలంబిస్తారు. అదేవిధంగా, ఇశ్రాయేలు ప్రజలు కూడా మనం అరణ్య మృగం గల మనస్తత్వం' అని పిలిచే దాన్ని వారు అవలంభించుకొన్నారు.

మన జీవితాలలో దేవుని పిలుపును నెరవేర్చడానికి, ఫలవంతం కావడానికి, సరైన మనస్తత్వం కలిగి ఉండటం చాలా ముఖ్యం. అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి వ్రాయడానికి గల కారణం ఇదే:

మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. (రోమీయులకు 12:2)

అరణ్య మృగం గల మనస్తత్వంపై విజయం పొందడానికి మనకు సహాయపడే మూడు కీలక సూత్రాలను (పద్దతులను) పరిశుద్ధాత్మ నాకు వెల్లడించాడు.

మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చెను, "ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును; మీరు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్నెమునకును, అరాబా లోను, మన్నెములోను, లోయలోను, దక్షిణదిక్కున సముద్ర తీరములో నున్న స్థలములన్నిటికిని, కనానుదేశమునకును, లెబానోనుకును, మహానదియైన యూఫ్రటీసు వరకును వెళ్లుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి." (ద్వితీయోపదేశకాండమ 1:6-8)

1. ఈ పర్వతము నొద్ద మీరు నివసించిన కాలము చాలును.

మనము అభివృద్ధి సాధించడానికి బదులుగా అదే పర్వతం చుట్టూ మరియు చుట్టూ తిరుగుతాము. అదే పర్వతం చుట్టూ మళ్లీ మళ్లీ తిరగడం అంటే ఏమిటి?
మీరు చాలా సౌకర్యవంతంగా ఉన్న ప్రదేశంలో లేదా మీరు వదిలి వెళ్ళడానికి భయపడే ప్రదేశంలో చిక్కుకోవడం. ఇది ఒక నిర్దిష్ట అలవాటు, వ్యసనం లేదా ఓడిపోతూ జీవించే మార్గాన్ని కూడా సూచిస్తుంది.

చాలా మందికి, త్వరితగతిన పరిష్కరించబడి, మన వెనుక ఉంచగలిగే వాటిపై విజయం సాధించడానికి సంవత్సరాలు పడుతుంది. కొందరు తమ అభివృద్ధిలోకి ప్రవేశించకపోవడానికి లేదా అద్భుతాలను చూడాల్సినంత వేగంగా చూడకపోవడానికి ఇది ప్రధాన కారణాలలో ఒకటి. అయినప్పటికీ, దేవుడు నమ్మకమైనవాడు మరియు ఆయన ప్రజల నుండి దేనినీ వెనక్కి తీసుకోడు.

తన సొంత కుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరి కొరకు ఆయనను (యేసయ్యను) అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మన కెందుకు అనుగ్రహింపడు? (రోమీయులకు 8:32)

2. మీరు తిరిగి ప్రయాణమై వెళ్లుడి 

దేవుడు ఇశ్రాయేలీయులతో తిరిగి ప్రయాణమై వెళ్లే సమయం వచ్చిందని చెప్పాడు. దీనర్థం ఇన్ని సంవత్సరాలు మరియు నెలలు మనలను బంధించిన ఆ చక్రీయ విధానాలను, దుష్ట విధానాలను విచ్ఛిన్నం చేయడం.

మీరు పర్వతం నుండి దూరంగా తిరిగే కొన్ని చిహ్నాలను చూపించాల్సిన సమయం ఆసన్నమైందని దీని అర్థం. మీరు ఉండాలనుకుంటున్న ప్రదేశానికి చేరుకోవడానికి మీరు చేస్తున్న పనిని ఆపడానికి కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయవలసిన సమయం ఇది.

ఆ విధానాలను విచ్ఛిన్నం చేయడానికి ఉపవాసం మరియు ప్రార్థనలు దీనిలో ఇమిడి ఉంటుంది. మీరు కొంత మంది నాయకులకు జవాబుదారీగా ఉండడానికి దీనిలో ఇమిడి ఉంటుంది. మీ ఫోన్‌లోని కొన్ని యాప్‌లను లేదా కొన్ని ఫోన్ నంబర్‌లను తొలగించడాన్ని దీనిలో ఇమిడి ఉంటుంది. ఏదైనా చేయండి కానీ మిమ్మల్ని మందస్థితిలో ఉంచే ఆ విధ్వంసకర విధానాలను విచ్ఛిన్నం చేయండి.

3. మీరు వెళ్లి దేశమును స్వాధీన పరచుకొనుడి

మీరు వాక్యం మీద అదరపడాలనేది దీని అర్థం. మీకు ఏమీ అనిపించకపోవచ్చు, మీరు ఏమీ చూడకపోవచ్చు, కానీ మీరు కేవలం వాక్య ఆధారంగా ముందుకు సాగాలి.

దేవుని దాసుని నుండి వ్యక్తిగత ప్రవచన వాక్యాన్ని పొందుకోనప్పుడు చాలా మంది నిరాశ చెందుతారు. మీరు నిజంగా అలా చేయవలసిన అవసరం లేదు. దేవుని దాసుడు బోధిస్తున్న సందేశాన్ని మీరు విన్నప్పుడు, ఆ వాక్యమే ప్రవచనాత్మకమైనది. ప్రతి ఆరాధనలో బోధింపబడుతున్న మీరు విన్న వాక్యంపై అదరపడండి.

నేను ప్రవచనానికి వ్యతిరేకం కాదు (మరియు అది మీకు కూడా తెలుసు). చాలా మంది కేవలం వ్యక్తిగత ప్రవచన వాక్యం కోసం వేచి ఉన్నారు, మరియు వాక్యాన్ని పొందుకున్న తర్వాత, వారు తమ జీవితాల గురించి మరొక దేవుని దాసుని కోసం ఎదురు చూస్తుంటారు. వారు చాలా దూరం ప్రయాణిస్తారు, డబ్బు ఖర్చు చేస్తారు (మరియు నేను దానికి కూడా వ్యతిరేకం కాదు). అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగలనుకుంటున్నాను: మీరు పొందుకున్న మొదటి వాక్యం పట్ల మీరు ఏమి చేసారు?

దేశమును స్వాధీనం చేసుకునేందుకు మీరు మరియు నేను చేయవలసిన వాటిలో ఒకటి "మన మనస్సులను స్థిరపరచుకోవడం మరియు పైనున్న (ఉన్నతమైన వాటిపై ఉంచడం) వాటి మీదనే గాని, భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు." (కొలొస్సయులకు 3:2) దేవుని వాక్యాన్ని చదవడం మరియు ధ్యానించడం ద్వారా మనం పైనున్న వాటిపై మన మనస్సులను ఏర్పరచుకుంటాము.

చివరగా, నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మిత్రమా. "నా ప్రజలకు చెప్పు, మీ వాగ్దాన దేశాన్ని కోల్పోకండి" అని పరిశుద్ధాత్మ చెప్పడం నేను విన్నాను.

నిజానికి, 11 రోజుల ప్రయాణం ప్రారంభించిన ఇశ్రాయేలీయుల్లో చాలా మంది చనిపోయి 40 ఏళ్ల తర్వాత విడిచి వెళ్లిపోయారు. వాగ్దానపు దేశానికి వారు ఎన్నడూ చేరుకోలేదు. నాకు, ఇది ఎవరికైనా సంభవించే అత్యంత విచారకరమైన విషయాలలో ఒకటి - చాలా అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని ఆస్వాదించలేకపోవడం.

ఐగుప్తు నుండి బయటకు రావడానికి అంత సులువు కాదు; నువ్వు కనాను దేశానికి వెళ్లాలి. విడుదల మరియు స్వస్థత పొందుకోవడం అంత సులువు కాదు; మీరు దేవుని వాగ్దానాలలోకి ప్రవేశించాలి.

మీలో కొందరు అరణ్యం గుండా వెళుతున్నారు. అరణ్యం చెడ్డది కాదు, కానీ అది మీ చివరి గమ్యస్థానం కూడా కాదు.

Bible Reading: Ezekiel 23-24
ఒప్పుకోలు
నేను క్రీస్తుతో కలిసి లేపబడ్డాను గనుక, క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్న పైనున్నవాటిని మీదనే నేను శ్రద్ధగా మరియు తీవ్రమైన మనస్సును కలిగి ఉంటాను. నేను ఉద్దేశపూర్వకంగా పైన ఉన్న అనేక విషయాలపై నా మనస్సును కేంద్రీకరిస్తాను మరియు భూమిపై ఉన్న తాత్కాలిక విషయాల గురించి తక్కువ స్థాయి ఆలోచనలలో చిక్కుకోను. యేసు నామంలో. ఆమెన్.

Join our WhatsApp Channel


Most Read
● 21 రోజుల ఉపవాసం: 3# వ రోజు
● మీరు యేసు వైపు ఎలా చూచు చున్నారు?
● మనస్సులో నిత్యత్వముతో జీవించడం
● కోపం (క్రోధం) యొక్క సమస్య
● ఆత్మలో తీవ్రతతో ఉండుట
● 21 రోజుల ఉపవాసం: వ రోజు #15
● అగాపే ప్రేమలో ఎలా వృద్ధి చెందాలి
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్