అనుదిన మన్నా
0
0
12
ఆత్మ ఫలాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి - 1
Sunday, 14th of September 2025
Categories :
ఆత్మ ఫలం ( fruit of the spirit)
పరిశుద్ధాత్మ యొక్క వరములు "పొందుకోబడుతాయి" అయితే ఆయన ఫలాలు "సాగుచేయబడతాయి." ఇది ఆత్మ ఫలం ద్వారా మనం మన పాపపు స్వభావం యొక్క కోరికలపై విజయం సాధించాలి.
ఆత్మ ఫలాన్ని అభివృద్ధి పరచడం ప్రభువుతో సాంగత్యం నుండి వస్తుంది. మన జీవితాల్లో ఆత్మ ఫలాన్ని బలవంతం చేయడం కేవలం శరీరానికి సంబంధించిన కార్యం అవుతుంది మరియు నిరాశపరిచే అనుభవం అవుతుంది.
మనము క్రీస్తులో నిలిచినప్పుడు మాత్రమే ఆత్మ ఫలము ఆత్మ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఈ క్రింది వచనాలను జాగ్రత్తగా ధ్యానించండి (వీటిని మీకు వీలైనన్ని సార్లు చదవండి)
నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయ బడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. (యోహాను 15:4-6)
మనం ప్రభువు యెడల నిలిచినప్పుడు ఆత్మ ఫలాన్ని అభివృద్ధి చేయడం సహజమైన ప్రక్రియ అవుతుంది. సమయాన్ని వెచ్చించడం ద్వారా మరియు ఆయనతో సాంగత్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మెచ్చుకోవడం ద్వారా మరియు ఆయన ఎవరో మరియు ఆయన మనలో ఏమై ఉండాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడం ద్వారా, మనం యేసయ్య పట్ల నిలిచియుంటాము. ఆ ప్రక్రియ ఆయనతో ఏకత్వాన్ని పెంపొందించుకోవడానికి అనుమతిస్తుంది, దాని ఫలితంగా మనం ఆత్మ ఫలాన్ని ఉత్పత్తి చేస్తాము.
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగల వాడగును.
మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. (సామెతలు 13:20)
జ్ఞానులతో నడుచుకొను వాడు జ్ఞానవంతుడు అవుతాడు;
మూర్ఖులతో సహవాసం చేసిన వాడు ఇబ్బందుల్లో పడుతాడు. (సామెతలు 13:20 NLT)
నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, మనం ఎవరితో కలిసి తిరుగుతామో వారిలాగే మనం అవుతాము.
పరిశుద్ధాత్మ ఫలాన్ని పొందేందుకు ప్రతిరోజూ పరిశుద్ధాత్మతో సహవాసం చేయడం చాలా అవసరం. ఫలించాలంటే ముందు ఏదో ఒక వేరు పడాలి. యెషయా 37:31 ఇలా సెలవిస్తుంది, "ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును."
Bible Reading: Ezekiel 36-37
ఒప్పుకోలు
నేను క్రీస్తు ఉన్న పైన ఉన్న వాటిపై నా మనస్సును ఉంచాను, భూసంబంధమైన వాటిమీద కాదు. పరిశుద్ధాత్మ నా జీవితంలో తన ఫలాలను ఉత్పత్తి చేస్తున్నాడు. నా జీవితం వేలమందికి దీవెనకరంగా ఉండాలి.
Join our WhatsApp Channel

Most Read
● ఉద్దేశపూర్వక వెదకుట● జీవన నియమావళి
● దేవుని 7 ఆత్మలు : ఆలోచన గల ఆత్మ
● మీ గురువు (బోధకుడు) ఎవరు - I
● దేవునికి మీ కొరకు ఒక ప్రణాళిక ఉంది
● మీ ప్రయాసమును మీ గుర్తింపుగా మార్చుకోవద్దు - 2
● కాలేబు యొక్క ఆత్మ
కమెంట్లు