కలవరాన్ని అధిగమించడానికి క్రియాత్మకమైన మార్గాలు
కలవరాన్ని ఎలా అధిగమించాలనే దానిపై కొన్ని క్రియాత్మకమైన మార్గాలను పంచుకోవడానికి నాకు అనుమతివ్వండి.
1. ఇంటర్నెట్ గొప్ప ఆశీర్వాదం అయితే ఇది పెద్ద కలవరము కూడా కావచ్చు.
మనము దినితో ఎలా వ్యవహరించగలము?
ఆఫ్లైన్లో చూడవచ్చు
ఆయన పెందలకడనే లేచి యింకను చాలా చీకటి యుండగానే బయలుదేరి, అరణ్య ప్రదేశమునకు వెళ్లి, అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడ నున్న వారును ఆయనను వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని,"అందరు నిన్ను వెదకుచున్నారని" ఆయనతో చెప్పెను. (మార్కు 1:35-37)
యేసు ప్రభువు తన పరలోకపు తండ్రితో కలవరపడని నాణ్యమైన సమయం కోసం ఉదయాన్నే నిద్రలేచే అలవాటును కలిగి ఉన్నాడు. నేటి పరిభాషలో చెప్పాలంటే, ఆయన ఆఫ్‌లైన్‌లొకి వెళ్లాడు - దూరంగా ఉన్నాడు. అది నాకు ఎలా తెలుసు? శిష్యులు ఆయనను సంప్రదించడానికి ప్రయత్నించారు మరియు సాధ్యపడలేదు. "అందరూ నిన్ను వెదకుచున్నారు" అని వారు చెప్పడం ఒకసారి గమనించండి.
మన గురువు నుండి నేర్చుకుందాం, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ఫోన్‌ని ఆఫ్ చేయండి. చాలా మంది ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా తమ ఫోన్‌ని చెక్ చేస్తూనే ఉంటారు. నోటిఫికేషన్‌లతో ఫోన్ చెక్ చేయడం గొప్ప కలవరము. మీరు ప్రభువుతో ఆ సంబంధాన్ని ఏర్పరచుకోకపోవడంలో ఆశ్చర్యం లేదు.
విద్యార్థులారా, మీరు ఆ ముఖ్యమైన పాఠాన్ని చదువుతున్నప్పుడు, ఆ ఫోన్‌ని ఆఫ్ చేయండి. ఇది మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టడంలో మీకు సహాయపడుతుంది మరియు మీరు దాన్ని వేగంగా మరియు మెరుగ్గా పూర్తి చేయగలరు.
సోషల్ మీడియా ఒక గొప్ప సాంగత్యము మరియు కలుసుకోవడానికి సాధనం. ఈ ప్రస్తుత సమయాల్లో, సన్నిహితంగా ఉండటానికి ఇది బాగా సహాయపడుతుంది. కానీ ఇది కూడా గొప్ప కలవరము. ప్రజలు సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతారు మరియు గందరగోళ ప్రణాళికను కలిగి ఉంటారు. మీరు మీ ప్రాధాన్యతలను పూర్తి చేసే వరకు కొంత సమయం పాటు ఆఫ్‌లైన్‌లో ఉండటం వలన మీరు సరైన దిశలో వేగంగా వెళ్లడంలో ఇది సహాయపడుతుంది.
నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. (మత్తయి 6:6)
మీరు గమనించండి, యేసయ్య తలుపును మూసివేయడం గురించి స్పష్టంగా పేర్కొన్నాడు,ఆయనతో ఆ ముఖ్యమైన సాంగత్యాన్ని ఏర్పరచుకోకుండా మీకు ఆటంకం కలిగించే కలవరాల తలుపును మూసివేయుండి.
2. ముందు రోజు రాత్రి మీ మరుసటి రోజు యొక్క ప్రణాళికను చేసుకోండి
కలవరాలు తమకు తాము అత్యవసరమైనవి మరియు ముఖ్యమైనవిగా సులభంగా మారువేషంలో ఉంచుతాయి మరియు వాటిని గుర్తించడం కష్టం అవుతుంది. ప్రణాళికను కలిగి ఉండటం వలన మీరు కలవరాన్ని గుర్తించి, వాటిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.
31ఆ లోగా శిష్యులు, "బోధకుడా, భోజనము చేయుమని" ఆయనను వేడుకొనిరి.
34యేసు వారిని చూచి, "నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది." (యోహాను 4:31-34)
యేసయ్యకు తండ్రి ఇచ్చిన ప్రణాళిక ఉంది. ఆయన ఈ ప్రణాళికను తండ్రి చిత్తము అని అన్నాడు. యేసయ్యకు ఒక ప్రణాళిక ఉన్నందున, ఏది కలవరము మరియు ఏది కాదు అని గుర్తించగలిగాడు.
Bible Reading: Ezekiel 45-46
తండ్రీ, యేసు నామంలో, నేను క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుతాను మరియు కొనసాగుతానని అంగీకరిస్తున్నాను.

Most Read
● ప్రభువును సేవించడం అంటే ఏమిటి - I● కోతపు కాలం - 2
● ఒక ఉద్దేశ్యము కొరకు జన్మించాము
● ఒక గంట మరియు దానిమ్మ
● 21 రోజుల ఉపవాసం: 9# వ రోజు
● సంఘానికి సమయానికి ఎలా రావాలి
● మానవుని ప్రశంసల కంటే దేవుని ప్రతిఫలాన్ని కోరడం