english हिंदी मराठी മലയാളം தமிழ் ಕನ್ನಡ Contact us మమ్మల్ని సంప్రదించండి స్ఫోటిఫై లో వినండి స్ఫోటిఫై లో వినండి Download on the App Storeయాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి Get it on Google Play ఆండ్రాయిడ్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
 
లాగిన్
ఆన్‌లైన్‌లో ఇవ్వండి
లాగిన్
  • హోమ్
  • ఈవెంట్లు
  • ప్రత్యక్షం
  • టీవీ
  • నోహ్ ట్యూబ్
  • స్తుతులు
  • వార్తలు
  • మన్నా
  • ప్రార్థనలు
  • ఒప్పుకోలు
  • కలలు
  • ఇ-బుక్స్
  • వ్యాఖ్యానం
  • మృత్యు వార్తలు
  • ఒయాసిస్
  1. హోమ్
  2. అనుదిన మన్నా
  3. 21 రోజుల ఉపవాసం: 19# వ రోజు
అనుదిన మన్నా

21 రోజుల ఉపవాసం: 19# వ రోజు

Thursday, 30th of December 2021
1 0 1347
Categories : ప్రార్థన (Prayer)
కృతజ్ఞతా స్తుతుల దినము
 
1 సమూయేలు 7:12లో, ప్రవక్త సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, "యింత వరకు యెహోవా మనకు సహాయము చేసెనని" చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను.

మన జీవితాల్లో, దేవుడు చేసిన గొప్ప పనులను మనకు గుర్తుచేయడానికి ప్రవక్త సమూయేలు వంటి జ్ఞాపకార్థ రాళ్లను (లేదా సమయాలను) కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం.

2021 సంవత్సరం ముగుస్తున్న కొద్దీ, మీరు ప్రభువుకు కృతజ్ఞతా స్తుతులు తెలపండి. వీలైతే, రోజంతా కృతజ్ఞతా స్తుతులు చెప్పండి. ఇక మీదట ఎలాంటి పరిస్థితి గురించి ఫిర్యాదు చేయడానికి మరియు గొణుగడానికి నిరాకరించండి.

ప్రభువుని ఆరాధిస్తూ కొంత సమయం (కనీసం 10 నిమిషాలు) గడపండి. (ఆరాధనకు సంబంధించిన పాటలు పాడండి లేదా మీకు ఆరాధించడంలో సహాయపడటానికి కొన్ని మృదువైన ఆరాధన సంగీతాన్ని వినండి)

రాబోయే సంవత్సరం (2022) నిరుత్సాహంగా అనిపించవచ్చు కానీ బైబిలు మనకు సెలవిస్తుంది కాబట్టి నిరీక్షణ అనేది ఉంది, "దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును" (ఫిలిప్పీయులు 4:6-7).

మీ కుటుంబ సభ్యుల ప్రతి సభ్యుని పేరు ద్వారా (మీకు కంటికి కనిపించని వారు కూడా) ప్రభువుకు వందనాలు చెప్పండి. దీనికి చాలా విశ్వాసం అవసరమని నాకు తెలుసు, కానీ అది విలువైనదని నేను మీకు తెలియజేస్తున్నాను.

మీ … కోసం దేవునికి కృతజ్ఞతా స్తుతులు తెలియజేయండి
ఉద్యోగం లేదా వ్యాపారం మొదలైనవి
భారతదేశం కోసం
ఇశ్రాయేలు దేశం కోసం
ఈ పద్ధతిలో చేప్తూ ఉండండి

మీరు కరుణా సదన్ పరిచర్యలో భాగమైతే, నాయకులు, సభలు మొదలైనవాటికి దేవునికి కృతజ్ఞతా స్తుతులు తెలపండి. (మీరు ఏదైనా ఇతర సంఘం/పరిచర్యలో భాగమైతే, నాయకుల కొరకు దేవునికి కృతజ్ఞతా స్తుతులు తెలపండి.) ఇది మీకు స్వస్థత మరియు పునరుద్ధరణను తెస్తుంది.

ధ్యానించుటకు కొన్ని లేఖనాలు
1 థెస్సలొనీకయులకు 5:18
ఎఫెసీయులకు 5:20
కీర్తనలు 118

ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అంశాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన క్షిఅంశానికి వెళ్లండి.

సింహాసనంపై ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగును గాకని నేను జీవులతో కీర్తించుచున్నాను. ఆమెన్. (ప్రకటన 4:9)

ప్రభువా, నేను మొఱ్ఱపెట్టినప్పుడు నీవు ఎల్లప్పుడూ నా మాట వింటున్నందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుపుతున్నాను. నీవు నమ్మదగిన దేవుడవు. నీవు ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడవు.

తండ్రీ, నన్ను యేసు నామంలో ఫిర్యాదు దారునిగా కాకుండా ప్రచారకునిగా చేయి.

నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది. (కీర్తనలు 139:14)

యెహోవా దయాళుడు ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆయన కృప నిత్యముండును. (కీర్తనలు 107:1)

ప్రవచనాత్మక చర్య:

ఒకవేళ, కరుణా సదన్ ఫలవంతమైన పరిచర్యలో కృతజ్ఞతా అర్పణాని విత్తడానికి ప్రభువు మిమ్మల్ని నడిపిస్తే, దానిని చేయండి. మీ అర్పణను మీ చేతిలో పట్టుకొని, దానిని యెహోవా యందు ఉంచి మరియు మీ విత్తనం కొరకు ఈ క్రింది ప్రార్థనను రోజంతా ప్రార్థించండి మరియు అప్పడు మాత్రమే పంపండి.

"యెహోవా, నీవు జ్ఞాపకము చేసుకోను దేవుడవు. నీ కృపా సింహాసనం యందు నా అర్పణము మాట్లాడనివ్వు. నా కష్టార్జితము యొక్క అర్పణమును మరువలేనని నీవు వాగ్దానం చేసావు. నేను నా ఫలమును (పంటను) యేసుక్రీస్తు నామంలో పొందుకుంటున్నాను. ఆమెన్."


Join our WhatsApp Channel


Most Read
● దానియేలు ఉపవాసం
● విజ్ఞాపన పరులకు ఒక ప్రవచనాత్మక సందేశం
● మీ విధిని మార్చండి
● దైవ క్రమము - 2
● ఆర్థిక పరిస్థితి నుండి ఎలా బయటపడాలి #2
● మరచిపోవడం యొక్క ప్రమాదాలు
● భిన్నమైన యేసు, విభిన్న ఆత్మ మరియు మరొక సువార్త - II
కమెంట్లు
మమ్మల్ని సంప్రదించండి
ఫోన్: +91 8356956746
+91 9137395828
వాట్సాప్: +91 8356956746
ఇమెయిల్: [email protected]
చిరునామా :
10/15, First Floor, Behind St. Roque Grotto, Kolivery Village, Kalina, Santacruz East, Mumbai, Maharashtra, 400098
యాప్ను పొందండి
Download on the App Store
Get it on Google Play
మెయిలింగ్ లిస్టులో చేరండి
అన్వేషించండి
ఈవెంట్లు
ప్రత్యక్షం
నోహ్ ట్యూబ్
టీవీ
విరాళం
మన్నా
స్తుతులు
ఒప్పుకోలు
కలలు
సంప్రదించండి
© 2025 Karuna Sadan, India.
➤
లాగిన్
దయచేసి ఈ సైట్‌లో కమెంట్ మరియు లైక్ చేయడానికి మీ నోహ్ అకౌంట్కు లాగిన్ అవ్వండి.
లాగిన్