అనుదిన మన్నా
21 రోజుల ఉపవాసం: 9# వ రోజు
Monday, 20th of December 2021
1
0
1012
Categories :
Fasting and Prayer
చెడు తలంపు విధానాలతో పోరాడడం
సాతాను గురి మీ మనస్సు
సాతాను మొదటి పురుషుడు (ఆదాము) మరియు స్త్రీ (హవ్వ) పాపంలోకి నడిపించాలనుకున్నప్పుడు, వాడు స్త్రీ మనస్సుపై దాడి చేయడం ప్రారంభించాడు. ఇది 2 కొరింథీయులకు 11:3లో స్పష్టంగా చెప్పబడింది.
"సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడల నున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను."
సాతాను మీ మనస్సుపై ఎందుకు దాడి చేయాలనుకుంటున్నాడు?
ఎందుకంటే, మీ మనస్సు దేవుని స్వరూపంలోని భాగం, కాబట్టి దేవుడు మీతో సహవాసం చేస్తాడు మరియు మీ కోసం తన చిత్తాన్ని వెల్లడిపరుస్తాడు. కొంతమంది క్రైస్తవులు మనస్సు యొక్క ప్రాముఖ్యతను తగ్గించడం దురదృష్టకరం, ఎందుకంటే బైబిలు దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
సాతాను మిమ్మల్ని అబద్ధాన్ని నమ్మేలా చేయగలిగితే, వాడు మిమ్మల్ని పాపంలోకి నడిపించడానికి మీ జీవితంలో పని చేయడం ప్రారంభించవచ్చు. అందుకే వాడు మనస్సుపై దాడి చేస్తాడు మరియు అందుకే మన మనస్సులను మనం రక్షించుకోవాలి. మీ మనస్సు ఒక యుద్దభూమి.
ధ్యానించుటకు కొన్ని లేఖనాలు
రొమీయులకు 12:1-2
ఫిలిప్పీయులకు 4:8
ఎఫెసీయులకు 4:23
యోహాను 8:32

ప్రార్థన
మీ హృదయం నుండి వచ్చేంత వరకు ప్రతి ప్రార్థన అస్త్రాన్ని పునరావృతం చేయండి. అప్పుడు మాత్రమే తదుపరి ప్రార్థన అస్త్రానికి వెళ్లండి. (దీన్ని పునరావృతం చేయండి, వ్యక్తిగతంగా చేయండి, ప్రతి ప్రార్థన అంశముతో కనీసం 1 నిమిషం పాటు చేయండి)
నేను యేసు నామంలో నా జీవితంలోని కంగారు యొక్క దుర్గమును తీసివేస్తున్నాను.
నా జీవితాన్ని నాశనం చేయాలనుకునే ప్రతి శక్తి, యేసు నామంలో నాశనం అవును గాక అని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.
నా జీవితంలో ప్రతి అక్రమమైనా (తప్పు) పునాది, యేసు నామంలో దేవుని అగ్నిని పొందుకొనును గాక.
నా మనస్సు, యేసు నామంలో దేవుని నుండి దైవిక స్పర్శను పొందుకొనును గాక.
నేను యేసు నామంలో నా జీవితంలోని అనియంత్రిత ఆలోచనల ప్రతి దుర్గమును తీసివేస్తున్నాను.
నేను నా హృదయం నుండి ప్రతి చెడు తలంపును యేసు నామంలో తీసివేస్తున్నాను.
నా ఆధ్యాత్మిక ఎదుగుదలకు విరుద్ధమైన ప్రతి తలంపులను యేసు నామంలో భంగుపాటు అవును గాక అని నేను ఆజ్ఞాపిస్తున్నాను.
నేను యేసు రక్తంతో ప్రతి వ్యర్థమైన తలంపు నుండి నా ఆత్మ, ప్రాణము మరియు శరీరాన్ని రక్షించుకుంటాను.
యేసు నామంలో నా జీవితంలోకి ఎక్కడానికి శత్రువు ఉపయోగిస్తున్న ప్రతి దుష్టుల నిచ్చెనను నేను క్రిందికి లాగుతాను.
నేను యేసు నామంలో నా హృదయంలోని ప్రతి చెడు తలంపును బంధిస్తున్నాను.
యేసు రక్తం, యేసు నామంలో చెడు తలంపుల నుండి నా తలని శుద్దీకరిస్తున్నాను.
నా మనస్సు, యేసు నామంలో దేవుని అగ్ని యొక్క స్పర్శను పొందుకుంటున్నాను.
యేసు యొక్క శక్తివంతమైన నామంలో నాకు మరియు నా కుటుంబానికి వ్యతిరేకంగా నేను ప్రతి దుష్టుల తలంపును తీసివేస్తున్నాను మరియు ఏమీ లేకుండా చేస్తున్నాను.
ప్రభువా, నా ప్రార్థనలకు జవాబు ఇచ్చినందుకు వందనాలు.
ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపుతూ కొంత సమయం గడపండి.
Join our WhatsApp Channel
Most Read
● 06 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన● సాకులు చెప్పే కళ
● 38 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● నా దీపమును వెలిగించు ప్రభువా
● కొత్త నిబంధనలో నడిచే దేవాలయము
● సాతాను మీకు అప్పగించిన పనిని ఎలా అడ్డుకుంటాడు
● అప్పు ఊబి నుండి బయటపడండి: తాళంచెవి # 1
కమెంట్లు