అనుదిన మన్నా
0
0
141
అగాపే ప్రేమలో ఎలా వృద్ధి చెందాలి
Wednesday, 1st of October 2025
Categories :
ఆత్మ ఫలం ( fruit of the spirit)
ప్రేమ (Love)
అగాపే ప్రేమ అనేది అత్యున్నతమైన ప్రేమ. ఇది 'దేవుని ప్రేమ'గా పేర్కొనబడింది. ప్రేమ యొక్క మిగితా రూపాలు పరస్పరం ఇవ్వడం మరియు తీసుకోవడం లేదా నిర్ణయించిన షరతులపై ఆధారపడి ఉంటాయి. అగాపే ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ. దేవుడు తన క్రైస్తవులందరూ పంచుకోవాలని కోరుకునే ప్రేమ ఇదే. నిజమైన అగాపే ప్రేమ ఎల్లప్పుడూ బహుమానంగా (ఇచ్చే విధంగా) ఉంటుంది.
అయితే దేవుడు మన యెడల తన (స్వంత) ప్రేమను (అగాపే ప్రేమను) వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మన మింకను పాపులమై యుండగానే క్రీస్తు (మెస్సీయ, అభిషిక్తుడు) మన కొరకు చనిపోయెను. (రోమీయులకు 5:8)
దేవుడు మన పట్ల తన అగాపే ప్రేమను చూపించినప్పుడు, మనం ఇంకా పాపులమే. దేవుని ప్రేమకు బదులుగా మనం ఏమీ ఇవ్వలేము.
అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ (అగాపే), సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టివాటికి విరోధమైన నియమమేదియు లేదు. (గలతీయులకు 5:22-23)
ఆత్మ ఫలాల జాబితాలో అగాపే ప్రేమ మొదటగా ప్రస్తావించబడింది ఎందుకంటే ఇది అన్నింటికీ పునాది. ప్రేమ అనేది ఆత్మ ఫలం మాత్రమే కాదు; ఇది మిగితా ఫలాలను వ్యక్తం చేసే మూలం. ప్రేమ అనేది సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము ప్రధాన మూలం.
ఆత్మ ఫలాలు పరిశుద్ధాత్మ నుండే వెలువడతాయి. పరిశుద్ధాత్మతో మన అనుదిన సహవాసాన్ని కొనసాగించడానికి మనం జాగ్రత్తగా ఉంటే. ఆయన మన హృదయాల్లో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు. (రోమీయులకు 5:5 చదవండి
Bible Reading: Jonah 2-4; Micah 1-3

ప్రార్థన
తండ్రీ, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ మనస్సుతో మరియు నా పూర్ణ శక్తితో నిన్ను ప్రేమించదానికి నాకు నేర్పుము. యేసు నామంలో ఆమేన్.
Join our WhatsApp Channel
Most Read
● సరైన వ్యక్తులతో సహవాసం చేయుట● దైవిక క్రమశిక్షణ గల స్వభావం - 1
● ప్రార్థనలో వచ్చే కలవరముపై ఎలా విజయం సాధించాలి
● 20 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● ఇటు అటు పరిగెత్తవద్దు
● అద్భుతాలలో పని చేయుట: కీ#2
● వాతావరణం మీద కీలకమైన అంతర్దృష్టులు (పరిజ్ఞానం) - 3
కమెంట్లు