అనుదిన మన్నా
0
0
82
04 రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
Tuesday, 25th of November 2025
Categories :
ఉపవాసం మరియు ప్రార్థన (Fasting and Prayer)
మంచి వస్తువులను మరల పొందుకోవడం
"మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను." (యోబు 42:10)
మరల పొందుకోవడం (పునరుద్ధరణ), లోకము యొక్క సాధారణ పరిభాషలో, పాతదిగా మారిన, అరిగిపోయిన, శిథిలమైన లేదా విచ్ఛిన్నమైన దానిని గతంలో ఉన్న విధంగా తిరిగి మార్చే ప్రక్రియను సూచిస్తుంది. అయితే, పునరుద్ధరణ, దేవుని వాక్యం ప్రకారం, లోక పునరుద్ధరణకు భిన్నంగా ఉంటుంది. బైబిలు ప్రకారం, "పునరుద్ధరణ" అనే పదం ఏదైనా దాని పూర్వ స్థితికి పునరుద్ధరించే ప్రక్రియను సూచిస్తుంది, అయితే అది మునుపటి కంటే మరింత మెరుగ్గా ఉండే విధంగా దాన్ని మెరుగుపరుస్తుంది.
యోబు విషయములో ఇది స్పష్టంగా లేదు. యోబు 42:12 ఇలా చెబుతోంది:
"యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటె మరి అధికముగా ఆశీర్వదించెను."
శత్రువు ఏది దొంగిలించినా - అది మీ ఆరోగ్యం, మీ ఆర్థిక భద్రత, మీ మనశ్శాంతి లేదా మీకు ఇష్టమైన మరేదైనా సరే-దేవుడు దానిని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసాడు. శత్రువు ఏమి చెప్పినా, ప్రభువైన యేసు ఆఖరి మాటను కలిగి ఉంటాడు ఎందుకంటే మన పట్ల దేవుని చిత్తం పునరుద్ధరించబడాలి.
దేవుడు ఏర్పరచిన ఆధ్యాత్మిక సిధ్ధాంతాల ప్రకారం,
ఒక దొంగ పట్టుబడినప్పుడు, వాడు మన నుండి తీసుకున్న దానికి ఏడు రెట్లు తిరిగి చెల్లించవలసి ఉంటుంది. (సామెతలు 6:31 చదవండి)
దొంగిలించడం, చంపడం మరియు నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో దొంగ వస్తాడు, కానీ దేవుడు మన జీవితాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే స్థాయికి తీసుకువస్తాడు. ఆయన మునుపటి స్థితి కంటే ప్రతిదీ మెరుగుపరుస్తాడు.
విశ్వాసి నుండి అపవాది దొంగిలించగలడా?
అవును. అపవాది అనుమతితో పనిచేస్తాడు; ప్రవేశం లేకుండా, వాడు విశ్వాసి నుండి దొంగిలించలేడు (ఎఫెసీయులకు 4:27). విశ్వాసుల నుండి అపవాది దొంగిలించగల కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి.
1. దైవిక సూచనలకు లేదా ఆదేశాలకు అవిధేయత చూపడం
దేవుని ఆదేశాలను ఉల్లంఘించేలా చేయడం ద్వారా భూమి మీద ఆదాము యొక్క అధికారాన్ని అపవాది దొంగిలించాడు. మీరు ఎప్పుడైనా దేవునికి అవిధేయత చూపితే, మీ నుండి దొంగిలించడానికి మీరు దెయ్యానికి చోటు ఇస్తున్నారు.
2. తప్పుడు ఆలోచన చేయడం
మీ ఆలోచనలు దేవుని వాక్యానికి అనుగుణంగా లేకుంటే అపవాది మిమ్మల్ని దొంగిలించడానికి, చంపడానికి మరియు నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు.
దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న ఊహలు, ఆలోచనలు మరియు జ్ఞానం మీరు బంధించాలి. (2 కొరింథీయులకీ 10:5).
ప్రజలు తప్పుడు సంగతుల గురించి ఆలోచించినప్పుడు, అది వారి ఒప్పుకోలు మరియు క్రియలను ప్రభావితం చేస్తుంది.
3. తప్పుడు ఒప్పుకోలు చేయడం
దేవుని దూషించడానికి యోబు తప్పుడు మాటలు చెప్పేలా సాతాను ప్రయత్నించాడు, కానీ యోబు నిరాకరించాడు. అజాగ్రత్త మాటలు మరియు ప్రతికూల ఒప్పుకోలు సాతాను మీ నుండి దొంగిలించడానికి అనుమతిస్తాయి లేదా చోటు కలిపిస్తాయి.
"నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు." (సామెతలు 6:2)
4. తప్పుడు సహవాసం
దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఒక మనిషిని పంపుతాడు. అపవాది కూడా మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు, వాడు ఒక మనిషిని పంపుతాడు. మీ స్నేహితులు మరియు మీకు చెందిన మనుష్యుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు సహవాసాల వల్ల చాలా మంది మంచి సంగతులను పోగొట్టుకున్నారు.
మోసపోకుడి. దుష్టసాంగత్యము మంచి నడవడిని (కలసి ఉండడం లేదా సంభాషణ, సాంగత్యములు) మంచి మర్యాదలు మరియు నైతికత మరియు స్వభావాన్ని పాడు చేస్తాయి లేదా చెరుపుతాయి. (1 కొరింథీయులకు 15:33)
మీరు అనుభవించిన ఎదురుదెబ్బలు, నష్టాలు, బాధలు, తప్పులు మరియు నష్టాలు ఉన్నప్పటికీ పునరుద్ధరణ (మరల పొందుకోవడం) సాధ్యమవుతుంది. సాతాను చాలా వస్తువులను తీసివేయవచ్చు, కానీ ప్రభువు ప్రతిదీ తిరిగి ఇస్తాడని వాగ్దానం చేసాడు మరియు ఆయన ప్రతిదీ పునరుద్ధరించగలడు లేదా మరల ఇవ్వగలడు.
పునరుద్ధరణ యొక్క ప్రధాన రంగాలు
1. దేవునితో మన ఐక్యతను పునరుద్ధరించడం
నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమి్మవేయ నుద్దేశించుచున్నాను. (ప్రకటన 3:15-16)
లోకం యొక్క చింతలు మరియు ఐశ్వర్యం యొక్క మోసపూరితత చాలా మంది యొక్క హృదయాలను దేవుని నుండి దొంగిలించబడ్డాయి.
దేవుడు లేకుండా మనము ఏమీ చేయలేము కాబట్టి మనం ఆయన దగ్గరకు తిరిగి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. (యోహాను 15:5)
2. మన కీర్తి మరియు మంచి సంగతుల యొక్క పునరుద్ధరణ
ఏశావు తన జ్యేష్ఠత్వమును కోల్పోయాడు, అది అతనికి పునరుద్ధరించబడలేదు.
ఆహారం, సెక్స్ (లైగింక కోరికలు) మరియు తాత్కాలిక లాభం కారణంగా చాలా మంది ఇప్పటికీ తమ వైభవాన్ని కోల్పోతున్నారు.
యాకోబు ఆహార మును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడు తిని త్రాగి లేచిపోయెను.
అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. (ఆదికాండము 25:34)
ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెదకినను, మారుమనస్సుపొంద నవకాశము దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. (హెబ్రీయులకు 12:17)
3. వృధా సంవత్సరాలు మరియు అవకాశాల యొక్క పునరుద్ధరణ
నేను పంపిన మిడుతలును
గొంగళి పురుగులును పసరు పురుగులును
చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన
సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. (యోవేలు 2:25)
వృధాగా పోయిన మీ సంవత్సరాలను దేవుడు పునరుద్ధరించినప్పుడు, ఆ సంవత్సరాల్లో మీరు సంపాదించిన మరియు తిరస్కరించబడిన లాభాన్ని కొంత అదనంగా చేర్చి మీకు దయచేస్తాడు. మీ జ్ఞాపకశక్తి కూడా పదునుగా మారుతుంది.
120 సంవత్సరాల వయస్సులో, మోషే ఇంకా యువకుడిలాగే ఉన్నాడు; అతని కళ్ళు మసకబారలేదు మరియు అతని బలం తగ్గలేదు (ద్వితీయోపదేశకాండము 34:7). అది మీ సాక్ష్యం కూడా అవుతుంది!
4. ఆనందం యొక్క పునరుద్ధరణ
యోబుకు సంతోషాన్ని కలిగించినవన్నీ పోయాయి, కానీ దేవుడు అతనికి ప్రతిదీ మరల తిరిగి ఇచ్చాడు. నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. (కీర్తనలు 51:12)
Bible Reading Plan : Matthew 19 -24
ప్రార్థన
ప్రతి ప్రార్థన క్షిపణిని కనీసం 2 నిమిషాలు లేదా మీ ఆత్మలో విడుదలను అనుభవించే వరకు ప్రార్థించండి.
1. తండ్రీ, యేసు నామములో నా జీవితంలో మంచి సంగతులు పునరుద్ధరణ జరుగును గాక.
2. యేసు నామములో నా జీవితానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆధ్యాత్మిక దొంగలు మరియు నష్టం కలిగించే వాని యొక్క కార్యాలను నేను భంగపరుస్తున్నాను మరియు రద్దు చేస్తున్నాను.
3. యేసు నామములో నా జీవితంలో మంచి సంగతులను నాశనం చేసే సాతాను ప్రతినిధి యొక్క కార్యాలను నేను స్తంభింపజేస్తున్నాను.
4. ఓ దేవా, యేసు నామములో నేను కోల్పోయిన ఆశీర్వాదాలు, విధి యొక్క సహాయకులు మరియు సద్గుణాలన్నింటినీ దయచేసి నాకు మరల దయచేయి.
5. తండ్రీ, నా శరీరంలో మరియు జీవితంలో దెబ్బతిన్న వాటిని యేసు నామములో బాగు చేయి.
6. తండ్రీ, యేసు నామములో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదాలను వెంబడించడానికి, అధిగమించడానికి మరియు తిరిగి పొందేందుకు నాకు అధికారం దయచేయి.
7. ఆశీర్వాదం యొక్క ప్రతి మూసివేసిన తలుపు యేసు నామములో తిరిగి తెరవబడును గాక.
8. తండ్రీ, యేసు నామములో నా నుండి తప్పిపోయిన విధి సహాయకులతో నన్ను మళ్లీ కలుపు.
9. యేసు నామములో నా జీవితములో సంపద, ఆశీర్వాదం మరియు కీర్తి యొక్క ఏడింతలు పునరుద్ధరణ జరగాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను.
10. తండ్రీ, యేసు నామములో నీ పరిశుద్ధ స్థలము నుండి నాకు సహాయమును పంపు.
Join our WhatsApp Channel
Most Read
● దేవునికి మొదటి స్థానం ఇవ్వడం #3● వివేచన v/s తీర్పు
● విధేయత ఒక ఆధ్యాత్మిక గుణము
● 37 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన
● 21 రోజుల ఉపవాసం: 1# వ రోజు
● మీ ప్రతిదినము మిమ్మల్ని నిర్వచిస్తుంది
● దేవుని నోటి మాటగా మారడం
కమెంట్లు
