అనుదిన మన్నా
0
0
101
శీర్షిక: 2026 సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఒక దైవ ప్రణాళిక
Thursday, 1st of January 2026
మోషే గుడారం గురించిన ఒక విశేషమైన తరచుగా విస్మరించబడే వివరాలను బైబిలు మనకు తెలియజేస్తుంది:
“మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను” (నిర్గమకాండము 40:2).
“రెండవ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను” (నిర్గమకాండము 40:17).
మరో మాటలో చెప్పాలంటే, ఇశ్రాయేలీయుల మధ్య తన నివాస స్థలం స్థాపించబడే సమయంగా దేవుడు నూతన సంవత్సర దినాన్ని ఎంచుకున్నాడు. ఇది యాదృచ్ఛికంగా జరిగినది కాదు. ఇది ఉద్దేశపూర్వకమైనది, ప్రవచనాత్మకమైనది మనం 2026 జనవరి 1వ తేదీన అడుగుపెడుతున్న ఈ తరుణంలో మనకు లోతైన బోధను ఇచ్చేది.
దేవుడు తన సన్నిధితో ప్రారంభిస్తాడు
గుడారం కేవలం ఒక నిర్మాణం కాదు—అది దేవుని సన్నిధి తన ప్రజలతో నివసిస్తున్నట్లు కనిపించే సంకేతం. ఇశ్రాయేలు విజయం, స్థిరనివాసం లేదా విస్తరణలో ముందుకు సాగే ముందు, దేవుడు తన సన్నిధి మొదట స్థాపించబడిందని నిర్ధారించుకున్నాడు.
ఇది చాలా శక్తివంతమైన సిధ్ధాంతాన్ని వెల్లడిస్తుంది: దేవుడు సంవత్సరాలను కార్యములతో ప్రారంభించడు; ఆయన వాటిని సన్నిధితో ప్రారంభిస్తాడు.
శతాబ్దాల తర్వాత ప్రభువైన యేసు మనకు ఈ నమూనాను బోధించాడు,
"కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును" (మత్తయి 6:33).
ఆశీర్వాదకరమైన సంవత్సరం అంటే ప్రణాళికలతో మాత్రమే ప్రారంభమయ్యేది కాదు, కానీ దేవుని మీ జీవిత కేంద్రపు సింహాసనం మీద కూర్చోవడంతో ప్రారంభమయ్యేది.
పరిశుద్ధమైన పునఃస్థాపన
మొదటి నెల ఇశ్రాయేలుకు నూతన శకాన్ని గురించి సూచిస్తుంది. ఆ రోజే గుడారాన్ని నిలబెట్టమని ఆజ్ఞాపించడం ద్వారా, ప్రతి నూతన ప్రారంభాన్ని పరిశుద్ధం చేయాలని దేవుడు వారికి బోధిస్తున్నాడు.
అపొస్తలుడైన పౌలు కొత్త నిబంధనలో ఈ సత్యాన్ని ఇలా వ్రాశాడు,
"కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను" (2 కొరింథీయులకు 5:17).
నూతన సంవత్సరం కేవలం క్యాలెండర్ మార్పు కాదు—ఇది దేవుని ఉద్దేశ్యాలతో మన జీవితాలను సరిదిద్దుకోవడానికి ఒక ఆహ్వానం. మనం మొదట ఏమి అంకితం చేస్తామో అది తరచుగా తరువాత ఏమి జరుగుతుందని నిర్ణయిస్తుంది.
మహిమ నిర్మాణం నుండి వస్తుంది
ప్రభువు మహిమ గుడారాన్ని నింపే ముందు (నిర్గమకాండము 40:34), మోషే దేవుని సూచనలను జాగ్రత్తగా పాటించాడు. ప్రతి తెర, ఒర, బలిపీఠం మరియు ఫర్నిచర్ దైవ క్రమంలో ఉంచబడ్డాయి.
దేవుని ఆజ్ఞ మహిమపరచబడే చోటే దేవుని మహిమ ఉంటుందని ఇది మనకు బోధిస్తుంది.
క్రైస్తవులైన మనకు అపొస్తలుడైన పౌలు గుర్తుచేస్తున్నాడు,
"సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగ నియ్యుడి" (1 కొరింథీయులకు 14:40).
మీరు 2026లోకి అడుగుపెడుతున్నప్పుడు, దేవుడు మీ ప్రార్థనలపై మాత్రమే కాకుండా, మీ నిర్ణయాలు, క్రమశిక్షణలు అనుదిన విధేయతపై కూడా ఆసక్తి కలిగి ఉంటాడు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, నిర్మాణం మహిమకు స్థలాన్ని సృష్టిస్తుంది.
గుడారం నుండి ఆలయం నుండి మీ వరకు
గుడారం తాత్కాలికమైనది, ఆలయం శాశ్వతమైనది - కానీ నేడు, అంతకంటే గొప్పది నిజం ఉంది:
“మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?” (1 కొరింథీయులకు 3:16).
సంవత్సరంలో ఈ మొదటి దినాన, దేవుడు మిమ్మల్ని వస్త్రాలు కర్రలతో గుడారం వేయమని అడగడం లేదు. మీ జీవితాన్ని తన నివాస స్థలంగా నూతనముగా సమర్పించమని ఆయన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు.
“కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి” (రోమీయులకు 12:1).
2026 కొరకు ఒక ప్రవచనాత్మక ఆహ్వానం
సంవత్సరాన్ని దేవునితో ప్రారంభించండి—
అప్పుడు ఈ సంవత్సరం మీకు ఏమి జరుగుతుందో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, మార్గదర్శకత్వం, సమృద్ధి, విజయం వెంట వస్తాయి.
యేసు నామంలో, నేను ప్రవచిస్తున్నాను, “ఈ సంవత్సరం అంత ప్రభువు మీ ముందు నడుస్తాడు, ఇశ్రాయేలు దేవుడు మీ వెనుక కావలిగా ఉంటాడు.”
మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ప్రార్థన
తండ్రీ, ప్రవక్త మోషే నూతన సంవత్సర దినాన గుడారాన్ని స్థాపించినట్లుగా, నేను కూడా ఈ రోజు నా హృదయంలో, నా ఇంట్లో ఒక బలిపీఠాన్ని స్థాపిస్తున్నాను. నా జీవితంలో నీకు మొదటి స్థానం ఇస్తున్నాను. యేసు నామంలో. ఆమేన్!!
Join our WhatsApp Channel
Most Read
● రాజభవనం వెనుక ఉన్న వ్యక్తి● నమ్మే సామర్థ్యాన్ని ఎలా పెంచుకోవాలి
● ప్రభువును సేవించడం అంటే ఏమిటి - I
● మీ ఉద్దేశ్యం ఏమిటి?
● తప్పుడు ఆలోచనలు
● ఎవరికీ రోగనిరోధక శక్తి లేదు
● సాతాను మీకు అప్పగించిన పనిని ఎలా అడ్డుకుంటాడు
కమెంట్లు
