మూడవ దిన నాటికి, బైబిల్లోని గుడారపు వృత్తాంతంలో అసాధారణమైన ఏదో జరుగుతుంది. మోషే దేవునికి ఖచ్చితంగా విధేయత చూపిన తర్వాత - గుడారాన్ని లేపడం, ప్రతి వస్తువును క్రమంలో ఉంచడం సూచనల ప్రకారం దానిని అభిషేకించడం - లేఖనం ఒక ఉత్కంఠభరితమైన క్షణాన్ని నమోదు చేస్తుంది:
“అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను.” (నిర్గమకాండము 40:34).
మోషే విధేయతను దేవుడు కేవలం గుర్తించలేదు - ఆయన తన మహిమతో ప్రతిస్పందించాడు.
ఇది ఒక శక్తివంతమైన సత్యాన్ని వెల్లడిస్తుంది: దేవుడు తన కోసం సిద్ధం చేసిన వాటిని నింపుతాడు.
విధేయత నివాస స్థానాన్ని సృష్టిస్తుంది
మోషే తన సృజనాత్మకత లేదా ఇష్టానుసారం గుడారాన్ని రూపొందించలేదు. అతడు ప్రతిదీ “యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే” చేశాడని లేఖనం పదే పదే మనకు చెబుతుంది (నిర్గమకాండము 40:16). విధేయత దైవ ప్రత్యక్షతకు ముందుంది.
ప్రభువైన యేసు ఇదే సిధ్ధాంతాన్ని బోధిస్తూ ఇలా అన్నారు:
“యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము” (యోహాను 14:23).
దేవుని మహిమ శబ్దానికి లేదా కార్యాలకు ఆకర్షించబడదు—అది ఆయనతోను, ఆయన వాక్యంతోను ఏకీభవించే వారి వైపు ఆకర్షించబడుతుంది.
ప్రాప్తిని మార్చే మహిమ
ఆ మహిమ గుడారాన్ని నింపినప్పుడు, ఊహించనిది జరిగింది:
“ఆ మేఘము మందిరము మీద నిలుచుటచేత మందిరము యెహోవా తేజ స్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లలేకుండెను” (నిర్గమకాండము 40:35).
దానిని నిర్మించిన వ్యక్తి ఇకపై నిర్లక్ష్యంగా నడవలేకపోయాడు. ఎందుకు? ఎందుకంటే మహిమ మనం దేవుని ఎలా సమీపించాలో మారుస్తుంది. పరిచయము భక్తికి దారి తీస్తుంది.
కీర్తనలు 24:3–4 మనకు గుర్తుచేస్తుంది:
“యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? … శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే.”
ఈ నూతన సంవత్సరం ముందుకు సాగుతున్న కొద్దీ, దేవుడు మీలో తన పనిని మరింత లోతుగా చేయవచ్చు—సంగతులను సులభతరం చేయడం ద్వారా కాదు, వాటిని పరిశుద్ధంగా చేయడం ద్వారా.
బాహ్య మహిమ నుండి అంతర్గత వాస్తవికత వరకు
ఒకప్పుడు గుడారాన్ని నింపినది ఇప్పుడు విశ్వాసులను నింపుతోంది:
“మీ యందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడు” (కొలొస్సయులకు 1:27).
2026వ సంవత్సరంలో దేవుని కోరిక కేవలం మీ జీవితాన్ని దర్శించడం కాదు, మీ ఆలోచనలు, నిర్ణయాలు, మాటలు, అలవాట్లు, ఉద్దేశాలతో సహా దానిని పూర్తిగా నివసించడం.
అపొస్తలుడైన పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు,
“మీరు దేవుని ఆలయమై యున్నారనియు మీరెరుగరా?” (1 కొరింథీయులకు 3:16).
ప్రశ్న ఏమిటంటే, దేవుడు తన మహిమను కుమ్మరిస్తాడా?.
ప్రశ్న ఏమిటంటే, దానిని నింపుకోవడానికి మనలో తగినంత స్థలం సిద్ధపరచబడి ఉందా?
ప్రవచనాత్మక పిలుపు
సంసిద్ధత ప్రత్యక్షతను ఆహ్వానిస్తుంది. ప్రత్యక్షత మహిమను విడుదల చేస్తుంది. మహిమ జీవితాలను మారుస్తుంది.
దావీదు ప్రార్థించినప్పుడు ఈ ఆకలిని అర్థం చేసుకున్నాడు,
“యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను... నేను యెహోవా మందిర ములో నివసింప గోరుచున్నాను” (కీర్తనలు 27:4).
సంవత్సరాలు గడిచేకొద్దీ, మీ జీవితం వ్యవస్థీకృతంగా ఉండటమే కాకుండా పరిశుద్ధంగా కూడా ఉండాలి. చురుకుగా ఉండటమే కాకుండా సరైన దిశలో కూడా ఉండాలి.
దేవుడు ఇంటిని నింపినప్పుడు, కాబట్టి ఏదీ అలాగే ఉండదు.
Bible Reading: Genesis 8-11
ప్రార్థన
తండ్రీ, మహిమ లేకుండా నిర్మాణం నాకు అక్కరలేదు. నేను నీ కోసం సిద్ధం చేసిన ప్రతి స్థలాన్ని నింపు. నా జీవితం నీ సన్నిధి కలిగి ఉండును గాక. యేసు నామంలో. ఆమెన్!
Join our WhatsApp Channel
Most Read
● 30 వ రోజు: 40 రోజుల ఉపవాసం & ప్రార్థన● పరధ్యానం యొక్క గాలుల మధ్య స్థిరంగా (ఉండుట)
● వాక్యాన్ని పొందుకొవడం
● దేవుడు ఎలా సమకూరుస్తాడు #1
● 17 రోజు: 40 రోజుల ఉపవాస ప్రార్థన
● యేసయ్య ఇప్పుడు పరలోకములో ఏమి చేస్తున్నాడు?
● లోబడే స్థలము
కమెంట్లు
